1998 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల
పాఠశాలకు వెళ్లడంలో “ఒక ప్రత్యేక విద్యలో లేక నైపుణ్యంలో బోధను లేక శిక్షణను పొందడం” ఇమిడివుంది. దైవపరిపాలన పరిచర్య పాఠశాలలో మనం నిర్విరామంగా దేవుని జ్ఞానంలో శిక్షణను పొందుతున్నాము. అంతేగాక, ఈ పాఠశాలలో పాల్గొనడం ద్వారా మనం మన మాట్లాడే నైపుణ్యాన్నీ, బోధించే నైపుణ్యాన్నీ మెరుగుపర్చుకోవచ్చు. 1998 పాఠశాల కార్యక్రమం మనం మరింత ఆధ్యాత్మిక ప్రగతిని సాధించడానికి అవకాశాలను ఎన్నింటినో కలుగజేస్తుంది.
రాబోయే సంవత్సరపు పాఠశాల షెడ్యూలును పరిశీలిస్తే, సంవత్సరపు మొదటి భాగంలో అసైన్‌మెంట్ నెం. 3 జ్ఞానము పుస్తకంపై ఆధారపడివుంటుందని గమనిస్తారు. అదనంగా, 1998 కొరకు కుటుంబ సంతోషము పుస్తకం జతచేయబడింది, దానిని అసైన్‌మెంట్ నెం. 3, నెం. 4 క్రమంగా చర్చిస్తాయి. అసైన్‌మెంట్ నెం. 4కు కుటుంబ సంతోషము ఆధారంగా ఉన్నప్పుడు, సహోదరుడు దానిని సంఘాన్ని ఉద్దేశించి ఇచ్చే ప్రసంగమైవుండాలి. ఒక జ్ఞాపికగా, పాఠశాల కార్యక్రమంలో ఎవరూ కూడా సమయాన్ని మించిపోకూడదు.
ఒక క్రొత్త ఫీచర్: మన వ్యక్తిగత ప్రయోజనం నిమిత్తం పాట నెంబరు తరువాత బ్రాకెట్‌లలో “చదవవలసిన బైబిలు భాగం అదనపు పట్టిక” అనేది ప్రతివారం చేర్చబడింది. పాఠశాల యొక్క వారపు కార్యక్రమం ఏదీ కూడా దీనిపై ఆధారపడకపోయినప్పటికీ, దీనిని అనుసరించడాన్ని లక్ష్యంగా పెట్టుకోండి. ఇప్పటికే బైబిలును ప్రతిదినం చదివే అలవాటు మీకు లేకపోయినట్లైతే ఆ అలవాటును పెంపొందించుకునేలా ఇది సహాయపడుతుంది.
అసైన్‌మెంట్‌లు, సలహా, వ్రాతపూర్వక పునఃసమీక్షల గురించి మరింత సమాచారం కొరకు దయచేసి “1998 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పట్టిక”లోనూ, అలాగే 1996 అక్టోబరు మన రాజ్య పరిచర్య, మూడవ పేజీలోనూ ఉన్న నిర్దేశాలను జాగ్రత్తగా చదవండి.
మీరు ఇంకా దైవపరిపాలన పరిచర్య పాఠశాలలో చేరకపోయినట్లైతే, ఇప్పుడే చేరమని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. విశిష్టమైన ఈ పాఠశాల, అణకువగల, అంకితభావంగలవారైన యెహోవా సేవకులు మరింత అర్హతగలవారిగా తయారుకావడానికి శిక్షణనివ్వడంలో ఒక ప్రముఖ పాత్రను పోషించడంలో కొనసాగుతుంది.—1 తిమో. 4:13-16.