కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 10/98 పేజీ 1
  • మీరు మన పత్రికలను చదువుతారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు మన పత్రికలను చదువుతారా?
  • మన రాజ్య పరిచర్య—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • సువార్తనందించుట—పత్రికలతో
    మన రాజ్య పరిచర్య—1989
  • మీ పరిచర్యలో పత్రికలను ప్రతిపాదించండి
    మన రాజ్య పరిచర్య—2005
  • కావలికోట మరియు తేజరిల్లు!—సత్యాన్ని తెల్పే సమయోచిత పత్రికలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • పత్రికలందించుటకు సమయాన్ని కేటాయించండి
    మన రాజ్య పరిచర్య—1993
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1998
km 10/98 పేజీ 1

మీరు మన పత్రికలను చదువుతారా?

1 ఆఫ్రికాలో ఉండే ఒక మిషనరీ జంట మన పత్రికలను గూర్చి ఇలా చెప్పింది. “మా ప్రాంతంలో ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా ఉండేందుకు కావలికోట మాకు సహాయం చేస్తుంది. ప్రతి సంచిక మమ్మల్ని బలపర్చి, ప్రోత్సహిస్తుంది.” మన పత్రికల మీద మీకూ అలాంటి లోతైన మెప్పుదలే ఉందా? వాటిని చదవడానికి మీకూ అలాంటి ఆతురతే ఉందా?

2 ఒక శీర్షిక చదవడానికి కొద్ది నిముషాలే పట్టినా దాన్ని తయారు చేయడానికి చెప్పుకోదగినంత సమయం తీసుకుంటుంది. దాన్ని తెలుసుకునికూడా మీరు ఊరికే పేజీలు అలా త్రిప్పుతూ అందులోని బొమ్మలను చూస్తూ, మీ దృష్టిని ఆకర్షించిన వాటిని మాత్రమే చదువుతారా? ఒకవేళ అంతకంటే ఎక్కువే చేస్తున్నట్లయితే మీరు జ్ఞానయుక్తమైన పని చేస్తున్నట్లే. మన పత్రికల ప్రతి సంచికలోని అన్ని శీర్షికలను చదవడానికి వాటిని విశ్లేషించడానికి మనం సమయం తీసుకోవాలి. కావలికోట సమయానుకూలమైన ఆధ్యాత్మిక ఆహారాన్ని అందించే మన ప్రధాన పత్రిక. తేజరిల్లు! వైవిధ్యభరితమైన విషయాలపై ఆసక్తికరమైన సమాచారాన్ని తెలియజేసే శీర్షికలను అందిస్తుంది. ఈ పత్రికలను చదివి నేర్చుకునేవి మన ఆధ్యాత్మికతను బలపర్చడమేగాక, మన పరిచర్యను మరింత ప్రభావవంతంగా చేయడానికి మనల్ని సిద్ధం చేస్తాయి. మనం మంచి పాఠకులుగా ఉండడం ద్వారా, ఇతరులకు మన పత్రికలను ఇవ్వడానికి ఉత్సాహం కలిగివుంటాము.

3 పఠన అలవాట్లను ఎలా పెంచుకోవచ్చు: మీరు పత్రికలను చదివే అలవాటును మెరుగు పర్చుకోగలరా? అందుకు అనేక మందికి ఉపయోగపడిన రెండు సలహాలు ఇక్కడ ఉన్నాయి. (1) క్రమంగా చదివే ఒక పట్టికను ఏర్పరుచుకోండి. చదవడానికి కేవలం రోజుకు పది లేక పదిహేను నిమిషాలు మాత్రం కేటాయించుకుని, ఒక వారంలో ఎంత చదవగలుగుతారో చూసుకుని మీరే ఆశ్చర్యపోతారు. (2) మీరు ఏమి చదివేశారో అవి మీకు తెలియడానికి ఒక పద్ధతిని పెట్టుకోండి. బహుశా ప్రతి శీర్షికను చదివిన తర్వాత దానికి మీరు ఒక మార్కు పెట్టుకోవచ్చు. ఇలా చేయకపోతే మీరు కొన్ని శీర్షికలను చదవడం తప్పిపోవచ్చు లేదా చివరికి మొత్తం పత్రికనే చదవకుండా పోవచ్చు. మీకు అనుకూలమైన ఒక క్రమమైన పఠన పట్టికను తయారు చేసుకోవడమే గాక దానికి అంటి పెట్టుకుని ఉండడం ప్రాముఖ్యమైనది.—ఫిలిప్పీయులు 3:16 పోల్చండి.

4 మారుతున్న కాలపరిస్థితులకు అనుగుణంగా ప్రజల నిజమైన అవసరాలతో వ్యవహరించే శీర్షికలను ప్రచురించడం ద్వారా “నమ్మకమును బుద్ధిమంతుడైన దాసు”డు జ్ఞానయుక్తంగా ప్రతిస్పందించాడు. (మత్త. 24:45) నిజంగా, ఈ పత్రికలు మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయి. మన ఆధ్యాత్మిక అభివృద్ధి రేటు అనేది మన ఆధ్యాత్మిక పఠన అలవాట్ల నాణ్యతపై ఎంతగానో ఆధారపడి ఉంటుంది. ఎవరైతే ప్రతి పత్రికను చదవడానికి సమయం తీసుకుంటారో వారికోసం గొప్ప ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు వేచి ఉన్నాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి