కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/98 పేజీ 8
  • నాకు బైబిలు పఠనం కావాలి!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నాకు బైబిలు పఠనం కావాలి!
  • మన రాజ్య పరిచర్య—1998
  • ఇలాంటి మరితర సమాచారం
  • కావలెను—మరిన్ని బైబిలు పఠనాలు
    మన రాజ్య పరిచర్య—1998
  • మీరు బైబిలు పఠనములుచేయుటకు ఆహ్వానమిస్తున్నారా?
    మన రాజ్య పరిచర్య—1992
  • దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్‌ నుండి పఠనాలను ప్రారంభించడం
    మన రాజ్య పరిచర్య—1999
  • పునర్దర్శనాలను చేసేందుకు ధైర్యాన్ని కూడగట్టుకోండి
    మన రాజ్య పరిచర్య—1997
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1998
km 11/98 పేజీ 8

నాకు బైబిలు పఠనం కావాలి!

1 మనలో అనేకులం బైబిలు పఠనం కావాలన్న కోరికను వ్యక్తం చేశాం. అందుకు మంచి కారణం ఉంది. క్రొత్త శిష్యులను తయారు చేయాలన్న మన కోరిక నెరవేరేది బైబిలు పఠనం ద్వారానే. (మత్త. 28:19, 20) ఒకరికి సత్యాన్ని బోధించడం వల్ల వచ్చే ప్రత్యేక ఆనందాన్ని మనలో అనేకులు నెలలు, బహుశా సంవత్సరాలు గడిచినా పొందలేదు. నవంబరులో దీని విషయమై మనమేమి చేయవచ్చు? ఈ నెల జ్ఞానము పుస్తకాన్ని విశేషంగా చూపిస్తున్నాం గనుక, క్రొత్త బైబిలు పఠనాలను ప్రారంభించేందుకు ఈ పుస్తకాన్ని ఉపయోగించడానికి మనం ప్రత్యేక ప్రయత్నాలను చేయవచ్చు.

2 ఒకటి లేదా అంత కన్నా ఎక్కువ వారాంతాలను కేటాయించండి: ఈ నెల క్రొత్త బైబిలు పఠనాన్ని ఆరంభించడంలో శ్రద్ధ కేంద్రీకరించేందుకు కొంత సమయాన్ని కేటాయించాలని మేం ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తున్నాం. సంఘ పుస్తక పఠన నిర్వాహకులు ప్రత్యేకంగా ఈ ఉద్దేశం కోసం ఉపయోగించడానికని వారాంతాన్ని(లను) ఎంపికచేసి, ఆ తర్వాత పునర్దర్శన పనిలో సమష్టిగా ప్రయత్నం చేసేందుకు తమ గుంపులను సంస్థీకరించాలి.

3 ప్రాంతీయ పరిచర్య కొరకైన కూటాలకు హాజరయ్యేటప్పుడు మీతో పాటు పునర్దర్శన రికార్డులను తెచ్చుకోండి. ఆసక్తి చూపించిన, సాహిత్యాన్ని తీసుకున్న లేదా కూటాలకు హాజరైన వారినందరినీ తర్వాత దర్శించండి. ప్రతి సందర్శనాన్ని ఒక పఠనాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో చేయండి.

4 ఒక బైబిలు పఠనాన్ని ప్రదర్శించండి: ప్రాంతీయ పరిచర్య కోసం ఎంపిక చేయబడిన కూటాల్లో, పునర్దర్శనంలో బైబిలు పఠనాన్ని ఎలా మొదలు పెట్టవచ్చో తెలియజేసేటువంటి, చక్కగా సిద్ధమైన ప్రదర్శనను చూపించాలి. మీరిలా చెప్పవచ్చు: “చాలా మంది దగ్గర బైబిలు ఉంది, కానీ, మనకందరికీ జీవితంలో ఎదురయ్యే ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఇందులో ఉన్నాయని వాళ్ళు గుర్తించరు. [జ్ఞానము పుస్తకంలోని విషయ సూచికను చూపించి, 3, 5, 6, 8, 9 అధ్యాయాల శీర్షికలను చదవండి.] ప్రతి వారం ఒక గంట లేదా కాస్త అటు ఇటుగా ఈ పఠన సహాయకాన్ని ఉపయోగించడం ద్వారా, కేవలం కొన్ని నెలల్లోగా మీరు బైబిలును గూర్చిన ప్రాథమిక అవగాహనను పొందగల్గుతారు. ఈ అంశాల్లో దేనినైనా మీరు ఎంపిక చేసుకుంటే, ఈ పఠన కార్యక్రమం ఎలా కొనసాగుతుందో చూపించడానికి సంతోషిస్తాను.” ఒక వ్యక్తి తనకు బిజీ షెడ్యూల్‌ ఉన్నందువల్ల పఠించడానికి కాస్త వెనుకాడుతున్నట్లయితే, మా దగ్గర క్లుప్త కార్యక్రమం కూడా ఉందని మీరు వివరించవచ్చు. దేవుడు కోరుతున్నాడు బ్రోషూరును చూపించి, వారానికొకసారి 15-30 నిమిషాలు సరిపోయే చిన్న పాఠాన్ని పఠించవచ్చని ప్రతిపాదించవచ్చు.

5 పఠనాలను ఆరంభించడానికి మనమందరమూ ఐకమత్యంగా ప్రయత్నిస్తే, మనం తీసుకుంటున్న శ్రమకు యెహోవా ఆశీర్వాదాల కోసం మనం ప్రార్థిస్తే, మనం నిశ్చయంగా క్రొత్త పఠనాలను కనుగొంటాం! (1 యోహా. 5:14, 15) మీకు బైబిలు పఠనం కావాలంటే, మీరు ఒక పఠనం ఆరంభించడానికి ఇదీ ఒక అవకాశం కావచ్చు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి