మీకు స్టాండింగ్ ఆర్డరు ఉందా?
1 మీరు క్షేత్రసేవ కొరకైన కూటానికి వెళ్ళి, మీ సాక్ష్యమివ్వడానికి తీసుకువెళ్ళే బ్యాగ్‌లో పత్రికలు లేకపోవటాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? జనవరి 1996 మన రాజ్య పరిచర్యలో “మన పత్రికల్ని బాగా ఉపయోగించండి” అనే శీర్షికను జ్ఞప్తికి తెచ్చుకోండి. ఆ శీర్షిక “కచ్చితమైన పత్రికా ఆర్డర్‌ని కల్గివుండండి” అని మనకు చెప్పింది. అదింకా, “ప్రతి సంచికకు సంబందించిన ప్రతుల యొక్క నిర్దిష్టమైన సంఖ్య కొరకు ఓ వాస్తవమైన ఆర్డరును పత్రికల్ని పర్యవేక్షించే సహోదరునికి ఇవ్వండి. ఈ విధంగా, మీరు మీ కుటుంబ సభ్యులు క్రమంగా, తగినన్ని ప్రతులను కల్గివుంటారు” అని తెలియజేస్తుంది. మీరు అలా చేశారా?
2 మ్యాగజైన్‌ల కోసం స్టాండింగ్ ఆర్డరును ఎందుకు పెట్టుకోకూడదు? వారం వారం పత్రికలను అందించడాన్ని మీరొక గొప్ప బాధ్యతగా భావిస్తారు, అలా చేయడంలో అంతకంతకూ అధిక ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. మీకు ఇప్పటికే స్టాండింగ్ ఆర్డరు ఉన్నట్లయితే, పరిచర్యలో సగటున నెలకు కావలసినన్ని పత్రికలను మీరు పొందుతున్నారా లేదా అని మదింపు చేసుకోండి. నిజమే, మనం ఆర్డరు చేసిన పత్రికలను ప్రతివారం మ్యాగజైన్ కౌంటర్లో నుండి తీసుకొనే విషయంలో నమ్మకంగా ఉండాలని అనుకుంటాం, అలా చేయడం మన కర్తవ్యంగా భావించాలి. కొంతకాలం పాటు సంఘానికి దూరంగా ఉన్న వేరొక ప్రాంతానికి వెళ్తున్నట్లయితే, మీరు తిరిగి వచ్చేంతవరకూ మీ పత్రికలను పత్రికా సేవకుడు మరొకరికెవరికైనా ఇవ్వవచ్చో ఇవ్వకూడదో ఆయనకు తెలియజేయండి.
3 పైన పేర్కొనబడిన అదే అనుబంధ శీర్షిక, మనం ‘ఓ క్రమమైన పత్రికదినాన్ని ఏర్పాటు చేసుకోవాలని’ కూడా తెలియజేసింది. వారపు పత్రికదినానికి మీరు మద్దతునివ్వగలరా? 1999 యెహోవా సాక్షుల క్యాలెండరు (ఆంగ్లం)లో చూపించబడినట్లుగా అది సంవత్సరమంతా ప్రతి శనివారం ఉంటుంది! కావలికోట, తేజరిల్లు! పత్రికలను పంచిపెట్టే ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయవద్దు. పత్రిక కార్యక్రమంలో పూర్తిగా భాగంవహించేందుకు ప్రయత్నించినప్పుడు, మన పొరుగువారికి “సువర్తమానము” తీసుకువెళ్తున్నామన్నమాట.—యెష. 52:7.