కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/00 పేజీ 1
  • ‘మెలకువగా ఉండండి’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘మెలకువగా ఉండండి’
  • మన రాజ్య పరిచర్య—2000
  • ఇలాంటి మరితర సమాచారం
  • ‘మెలకువగా నుండుడి’!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • “అంత్యకాలములో” మెలకువగా ఉండుము
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
  • మెలకువగా ఉండువారు ధన్యులు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ప్రకటనాపని ఎంత అత్యవసరమైనదో గుర్తుంచుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2000
km 5/00 పేజీ 1

‘మెలకువగా ఉండండి’

1 ఈ విధానపు చివరిదినాలను సూచించే ప్రాముఖ్యమైన పరిస్థితులను గూర్చి వివరించిన తర్వాత యేసు తన శిష్యులను ‘మెలకువగా ఉండండి’ అని కోరాడు. (మార్కు 13:33) క్రైస్తవులు ఎందుకు మెలకువగా ఉండాలి? ఎందుకంటే మనం మానవ చరిత్రలోనే అత్యంత అపాయకరమైన కాలాల్లో జీవిస్తున్నాము. కనుక, మనం ఆధ్యాత్మికంగా మగతలో పడిపోకూడదు. ఎందుకంటే, అలా పడిపోతే ఈ అంత్యకాలాల్లో చేయమని యెహోవా మనకిచ్చిన పని విలువను గ్రహించడంలో విఫలులమౌతాము. అది ఏ పని?

2 యెహోవా, మానవజాతికి ఏకైక నిరీక్షణ అయిన తన రాజ్యాన్ని గూర్చిన సువార్తను తన ప్రజలచే భూమియందంతటా ప్రకటింపజేస్తున్నాడు. మనం దేవుని సంస్థతో సన్నిహితంగా పనిచేయడం ద్వారా, సమయాన్ని గూర్చీ, “నిత్యజీవపు మాటలు” వినేందుకు ఇతరులకు సహాయం చేయవలసిన అవసరాన్ని గూర్చీ సరైన అవగాహన ఉన్న నిజ క్రైస్తవులముగా మనం గుర్తించబడతాము. (యోహా. 6:68) ఎంతో ప్రాముఖ్యమైన ఈ పనిలో ఆసక్తితో పాల్గొనడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా మెలకువగా ఉన్నామని నిరూపించుకుంటాము.

3 ప్రకటించడానికి కదిలించబడ్డాము: యెహోవా సాక్షులముగా మనం మన పరిచర్యపట్ల అనుకూల దృక్పథాన్ని కలిగివుండాలి. దేవుని పట్ల, పొరుగువారి పట్ల గల ప్రేమ, ప్రకటనాపనిలో భాగం వహించేలా వ్యక్తిగతంగా మనలను కదిలిస్తుంది. (1 కొరిం. 9:16, 17) అలా చేయడం ద్వారా మనం మన ప్రాణాలను మాత్రమే కాక, మన శ్రోతల ప్రాణాలను కూడా రక్షిస్తాము. (1 తిమో. 4:16) మానవజాతి కలిగివుండగల శ్రేష్ఠమైన ప్రభుత్వాన్ని గూర్చి అంటే దేవుని రాజ్యాన్ని గూర్చి వీలైనంత క్రమంగా, అవసరమైనంత ఎక్కువగా ప్రకటించడానికి నిశ్చయించుకుందాం!

4 ఒక ప్రాముఖ్యమైన వాస్తవం మన పరిచర్య యొక్క అత్యవసరాన్ని నొక్కిచెప్తుంది—మనం ఈ పనిలో కొనసాగుతూ ఉండగానే మహాశ్రమ ప్రారంభమౌతుందన్నదే ఆ వాస్తవం. మనకు ఆ దినము, ఆ గడియ, తెలియదు గనుక మనం ఎల్లప్పుడూ మెలకువగా, సిద్ధంగా ఉండి, ప్రార్థనాపూర్వకంగా యెహోవాపై ఆధారపడాలి. (ఎఫె. 6:18) ప్రకటనా పని కొనసాగించవలసిన ప్రాంతం విస్తరిస్తూనే ఉంది. కానీ చాలా త్వరలో ఒకరోజున, మానవచరిత్రలోకెల్లా అత్యంత గొప్ప సాక్ష్యమిచ్చే ఈ పని ముగింపుకు చేరుకుంటుంది.

5 ‘మెలకువగా ఉండండి’ అని యేసు ఇచ్చిన ఆజ్ఞను నమ్మకంగా అనుసరించండి. మెలకువగా ఉండాల్సిన అవసరం మునుపెన్నటికన్నా ఇప్పుడు ఎక్కువగా ఉంది. మనం అత్యవసర భావంతో ప్రతిస్పందిద్దాము. నేడూ అలాగే ప్రతిరోజూ ఆధ్యాత్మికంగా అప్రమత్తంగా జాగరూకులముగా ఉంటూ, యెహోవా సేవలో చురుకుగా ఉందాం. అవును, “మెలకువగా ఉండి మత్తులముకాక యుందము.”—1 థెస్స. 5:6.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి