‘ఎవరైనా నాకు త్రోవ చూపకుంటే నేనెలా . . .?’
1 సువార్తికుడైన ఫిలిప్పు, నీవు చదువుతున్న దాన్ని గ్రహిస్తున్నావా అని ఐతియోపీయుడైన నపుంసకుడిని అడిగినప్పుడు, అతడు ‘ఎవడైనను నాకు త్రోవ చూపకుంటే ఏలాగు గ్రహింపగలను’ అన్నాడు. అప్పుడు ఫిలిప్పు యేసును గూర్చిన సువార్తను అతడు అర్థం చేసుకోవటానికి సంతోషంగా సహాయం చేశాడు, ఫలితంగా అతను వెంటనే బాప్తిస్మం తీసుకున్నాడు. (అపొ. 8:26-38) ‘సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, బాప్తిస్మ మిచ్చుచు, బోధించుడి’ అన్న క్రీస్తు ఆజ్ఞకు ఫిలిప్పు విధేయత చూపించాడు.—మత్తయి 28:19, 20.
2 ఫిలిప్పులానే మనం కూడా ఆ ఆజ్ఞకు విధేయత చూపించాలి. అయితే, మనం ఎవరితోనైతే బైబిలు పఠనం చేస్తామో వాళ్లు ఐతియోపీయుడైన నపుంసకునిలా తరచూ త్వరితగతిన ఆధ్యాత్మిక అభివృద్ధిని సాధించలేకపోవచ్చు. లేఖనాల్లో ప్రావీణ్యంగల యూదా మతప్రవిష్టుడైన ఆ వ్యక్తికి గ్రహించే హృదయం ఉంది, వాగ్దానం చేయబడిన మెస్సీయా యేసే అని మాత్రమే ఆయన అంగీకరించాల్సి ఉంది. మనం పఠనం చేసే వ్యక్తులు బైబిలుతో అంతగా పరిచయం లేని వారైనా, అబద్ధ మత బోధలచే తప్పుడు మార్గాన్ని అవలంబిస్తున్నా లేక కష్టతరమైన వ్యక్తిగత సమస్యలను అనుభవిస్తున్నా అది మనకు సవాలుతో కూడినదే. మన బైబిలు విద్యార్థులను విజయవంతంగా సమర్పణా బాప్తిస్మాలకు నడిపించేందుకు మనకు ఏది సహాయపడగలదు?
3 బైబిలు విద్యార్థుల ఆధ్యాత్మిక అవసరతలను గ్రహించండి: దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్ను గానీ జ్ఞానము పుస్తకాన్ని గానీ ఉపయోగిస్తూ ప్రజలతో మనం ఎంత కాలంపాటు పఠనం చేయాలి అన్న విషయాన్ని ఆగస్టు 1998 మన రాజ్య పరిచర్య ఇన్సర్ట్ చర్చించింది. “విద్యార్థి పరిస్థితుల్నిబట్టీ, సామర్థ్యాన్నిబట్టీ పఠనవేగాన్ని మదింపుచేసుకోవడం అవసరం. . . . విద్యార్థి పొందాల్సిన స్పష్టమైన అవగాహనను బలిపెట్టి పుస్తకాన్ని త్వరత్వరగా ముగించాలని మనం అనుకోకూడదు. దేవుని వాక్యంలో తాను కనుగొన్న క్రొత్త విశ్వాసానికి బలమైన ఆధారం ప్రతి విద్యార్థికీ అవసరం” అని అది సలహానిచ్చింది. కాబట్టి, ఆరు నెలల్లో మొత్తం పుస్తకాన్ని పూర్తిచేయాలన్న తలంపుతో జ్ఞానము పుస్తకంలో ఉన్న విషయాలన్నింటినీ త్వరత్వరగా పఠించుకుంటూ వెళ్ళిపోకుండా ఉండటం మంచిది. కొంతమంది వ్యక్తులు బాప్తిస్మానికి చేరుకొనేందుకు మనం సహాయపడటానికి వారికి ఆరునెలల కంటే ఎక్కువ సమయమే అవసరమవ్వవచ్చు. వారం వారం మీరు పఠనం చేస్తున్నప్పుడు, విద్యార్థి తాను దేవుని వాక్యం నుండి నేర్చుకుంటున్నదాన్ని అర్థం చేసుకొని దాన్ని అంగీకరించేందుకు సహాయం చేయటానికి ఎంత సమయం అవసరమైతే అంత సమయం తీసుకోండి. కొన్ని పరిస్థితుల్లో జ్ఞానము పుస్తకంలోని ఒక అధ్యాయాన్ని పూర్తి చేయడానికి రెండు లేక మూడు వారాలు పట్టవచ్చు. ఉదహరించబడిన అనేక లేఖనాలను చదివి, స్పష్టం చేయడానికి అది అవకాశాన్నిస్తుంది.—రోమా. 12:2.
4 ఒకవేళ జ్ఞానము పుస్తకం పూర్తయిన తర్వాత, మీ విద్యార్థి సత్యాన్ని గూర్చి ఇంకా పూర్తిగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని మీరు గ్రహిస్తే లేదా సత్యాన్ని తన సొంతం చేసుకొని దేవునికి తన జీవితాన్ని సమర్పించుకొనేందుకు పూర్తిగా పురికొల్పబడలేదని మీరు గ్రహిస్తే అప్పుడేమిటీ? (1 కొరిం. 14:20) జీవానికి తీసుకువెళ్ళే మార్గాన నడిపించడానికి ఇంకా అదనంగా మీరేమి చేయవచ్చు?—మత్త. 7:13.
5 బైబిలు విద్యార్థుల ఆధ్యాత్మిక అవసరాలను తీర్చండి: నెమ్మదిగానే అయినప్పటికీ, ఒక వ్యక్తి అభివృద్ధి సాధిస్తున్నాడనీ, తను నేర్చుకుంటున్న విషయాల పట్ల మెప్పుదల చూపిస్తున్నాడనీ స్పష్టమైతే, దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్ నుండి, జ్ఞానము పుస్తకం నుండి పఠనం పూర్తి అయినతర్వాత అప్పుడు రెండవ పుస్తకాన్నుండి బైబిలు పఠనం కొనసాగించండి. అది ప్రతిసారి అవసరం కాకపోవచ్చు, ఒకవేళ అవసరమైతే, నా బైబిలు కథల పుస్తకము నుండి పఠనం కొనసాగించవచ్చు. ఒకవేళ సంఘంలో దీని సప్లై లేకపోతే చాలామంది ప్రచారకుల దగ్గర బహుశా దీని వ్యక్తిగత కాపీలు ఉండవచ్చు, కాబట్టి వాటిని ఉపయోగించవచ్చు. కానీ ప్రతి సందర్భంలోనూ దేవుడు కోరుతున్నాడు బ్రోషూర్, జ్ఞానము పుస్తకం మాత్రం మొదట పఠనం చేయాలి. రెండవ పుస్తకం పూర్తికాకముందే విద్యార్థి బాప్తిస్మం తీసుకున్నాసరే, బైబిలు పఠనాన్ని, పునర్దర్శనాలను, ఆ పఠనం కొనసాగడానికి తీసుకున్న సమయాన్ని రిపోర్ట్ చేయాలి.
6 ఒక్క పుస్తకం మాత్రమే పఠనం చేసి ఇటీవలి కాలంలో బాప్తిస్మం తీసుకున్న వ్యక్తికి రెండవ పుస్తకం పఠనం చేసేందుకు సహాయం చేయాలని దానర్థమా? అలాగనికాదు. అయితే, బహుశా వాళ్లు ఇనాక్టివ్ అయిపోయి ఉండవచ్చు లేక సత్యమందు వృద్ధిచెందకపోయి ఉండవచ్చు, సత్యాన్ని తమ జీవితాల్లో పూర్తిగా అన్వయించుకొనేందుకు తమకు వ్యక్తిగత సహాయం అవసరమని వాళ్ళు భావిస్తుండవచ్చు. బాప్తిస్మం తీసుకున్న ప్రచారకునితో పఠనాన్ని పునఃప్రారంభించే ముందు సేవా పైవిచారణకర్తను సంప్రదించాలి. గతంలో జ్ఞానము పుస్తకాన్ని పఠించి సమర్పణా బాప్తిస్మముల వరకూ ఎదగలేకపోయిన వారెవరి గురించైనా మీకు తెలిస్తే, వాళ్ళు తిరిగి పఠనం ప్రారంభించాలని ఇష్టపడుతున్నారేమో తెలుసుకోవటానికి మీరు చొరవ తీసుకోవచ్చు.
7 మనం ఎవరితోనైతే పఠనం చేస్తున్నామో ఆ ఆసక్తిగల వాళ్లందరి పట్ల సన్నిహితమైన వ్యక్తిగతమైన అవధానాన్ని ఇవ్వడం మన క్రైస్తవ ప్రేమకు చిహ్నం. దేవుని వాక్య సత్యాన్ని గురించి గొప్ప అంతర్దృష్టిని పొందేలా మన విద్యార్థికి సహాయం చేయడమే మన లక్ష్యం. అప్పుడు, అతడు సత్యం కోసం ఖచ్చితమైన, జ్ఞానయుక్తమైన నిర్ణయాన్ని తీసుకొని, తన జీవితాన్ని యెహోవాకు సమర్పించుకొని, నీటి బాప్తిస్మం తీసుకోవడం ద్వారా దాన్ని చూపిస్తాడు.—కీర్త. 40:8; ఎఫె. 3:17-19.
8 ఐతియోపీయుడైన నపుంసకుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఏమి జరిగిందో మీకు గుర్తుందా? యేసుక్రీస్తు క్రొత్త శిష్యునిగా ‘సంతోషిస్తూ తన త్రోవను వెళ్ళాడు.’ (అపొ. 8:39, 40) మనమూ, సత్య మార్గంలోనికి మనం ఎవరికైతే త్రోవచూపిస్తున్నామో వారూ యెహోవా దేవుడ్ని ఆరాధించడంలో గొప్ప ఆనందాన్ని ఇప్పుడు, నిరంతరమూ పొందుదుము గాక!