కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp20 No. 1 పేజీలు 12-13
  • దేవుని రాజ్యానికి సంబంధించిన సత్యం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని రాజ్యానికి సంబంధించిన సత్యం
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుని రాజ్యం గురించి యేసు ఏమి బోధించాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
  • దేవుని రాజ్యం గురించి ఆయనేమి బోధించాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • దేవుని రాజ్యం పరిపాలిస్తుంది
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • దేవుని రాజ్యమంటే ఏమిటి?
    దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
wp20 No. 1 పేజీలు 12-13
సూర్యుని వెలుగులో కనిపిస్తున్న అంతరిక్షంలోని భూమి

దేవుని రాజ్యానికి సంబంధించిన సత్యం

యేసు తన శిష్యులకు ఇలా ప్రార్థించమని నేర్పించాడు, “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి. నీ రాజ్యం రావాలి. నీ ఇష్టం పరలోకంలో నెరవేరుతున్నట్టు భూమ్మీద కూడా నెరవేరాలి.” (మత్తయి 6:9, 10) దేవుని రాజ్యం అంటే ఏంటి? అది ఏం చేస్తుంది? దానికోసం మనం ఎందుకు ప్రార్థించాలి?

దేవుని రాజ్యానికి రాజు యేసు.

లూకా 1:31-33: “ఆయనకు నువ్వు యేసు అని పేరు పెట్టాలి. ఆయన గొప్పవాడిగా ఉంటాడు, సర్వోన్నతుని కుమారుడని పిలువబడతాడు. ఆయన తండ్రైన దావీదు సింహాసనాన్ని యెహోవా దేవుడు ఆయనకు ఇస్తాడు. ఆయన యాకోబు వంశస్థుల్ని ఎప్పటికీ రాజుగా పరిపాలిస్తాడు, ఆయన రాజ్యానికి అంతం ఉండదు.”

యేసు ముఖ్యంగా దేవుని రాజ్యం గురించే ప్రజలకు చెప్పాడు.

మత్తయి 9:35: “యేసు అన్ని నగరాల్లో, గ్రామాల్లో ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఆయన అలా వెళ్తూ వాళ్ల సభామందిరాల్లో బోధిస్తూ, రాజ్యం గురించిన మంచివార్త ప్రకటిస్తూ, అన్నిరకాల జబ్బుల్ని, అనారోగ్యాల్ని బాగుచేస్తూ ఉన్నాడు.”

దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుందో తెలుసుకోవడానికి యేసు తన శిష్యులకు ఒక గుర్తు చెప్పాడు.

మత్తయి 24:7: “ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి. ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు, భూకంపాలు వస్తాయి.”

యేసు శిష్యులు దేవుని రాజ్యం గురించి ఇప్పుడు భూమంతటా చెప్తున్నారు.

మత్తయి 24:14: “అన్ని దేశాల ప్రజలకు సాక్ష్యంగా ఉండేలా, రాజ్యం గురించిన మంచివార్త భూమంతటా ప్రకటించబడుతుంది. ఆ తర్వాత అంతం వస్తుంది.”

దేవుని రాజ్యం​—వాస్తవాలు

స్థలం. దేవుని రాజ్యం ఒక నిజమైన ప్రభుత్వం, దేవుడు దాన్ని పరలోకంలో స్థాపించాడు.​—దానియేలు 2:44; మత్తయి 4:17.

ఉద్దేశం. దేవుని రాజ్యం ఈ భూమిని ఒక అందమైన తోటలా మారుస్తుంది. అప్పుడు మనుషులందరూ ప్రశాంతంగా, కలిసిమెలిసి జీవిస్తారు. వాళ్లకు ఇక అనారోగ్యం గానీ, చావు గానీ ఉండవు.​—కీర్తన 37:11, 29.

పరిపాలకులు. పరలోకంలో పరిపాలించడానికి దేవుడు యేసును రాజుగా నియమించాడు. దేవుడు భూమ్మీద నుండి కొన్న 1,44,000 మందితో కలిసి యేసు పరిపాలిస్తాడు.​—లూకా 1:30-33; 12:32; ప్రకటన 14:1, 3.

పౌరులు. ఆ రాజ్య పరిపాలన కింద ఉండే పౌరులు భూమ్మీదే జీవిస్తారు. వాళ్లు యేసు పరిపాలనకు ఇష్టపూర్వకంగా లోబడుతూ ఆ రాజ్య నియమాలను పాటిస్తారు.​—మత్తయి 7:21.

మనుషుల్ని పరిపాలించడానికి యేసే సరైనవాడని ఎందుకు చెప్పవచ్చు?

యేసు భూమ్మీద ఉన్నప్పుడు తాను ఒక సమర్థవంతమైన, ప్రేమగల పరిపాలకునిగా ఉండగలడని నిరూపించుకున్నాడు. ఎలా?

  • ఆయన పేదవాళ్లను పట్టించుకున్నాడు.​—లూకా 14:13, 14.

  • అవినీతిని, అన్యాయాన్ని సహించలేదు.​—మత్తయి 21:12, 13.

  • ప్రకృతి శక్తుల్ని అదుపు చేశాడు.​—మార్కు 4:39.

  • వేలమందికి ఆహారం పెట్టాడు.​—మత్తయి 14:19-21.

  • రోగాలతో బాధపడుతున్నవాళ్ల మీద జాలిపడ్డాడు, వాళ్లను బాగుచేశాడు.​—మత్తయి 8:16.

  • చనిపోయినవాళ్లను బ్రతికించాడు.​—యోహాను 11:43, 44.

దేవుని రాజ్యం వల్ల మీరు ఇప్పుడెలా ప్రయోజనం పొందవచ్చు?

దేవుని రాజ్య పౌరులుగా ఉంటే మీరు ఇప్పుడు కూడా ఎంతో సంతోషంగా జీవించవచ్చు. ఉదాహరణకు, దేవుని రాజ్య పౌరులు . . .

  • ‘అందరితో శాంతిగా ఉంటారు.’​—హెబ్రీయులు 12:14.

  • తమ కుటుంబాల్లో శాంతి, ఐక్యతలు కలిగివుంటారు. ఎందుకంటే భార్యాభర్తలు ఒకరిపట్ల ఒకరు ప్రేమ, గౌరవం చూపించుకుంటారు.​—ఎఫెసీయులు 5:22, 23, 33.

  • “దేవుని నిర్దేశం తమకు అవసరమని” గుర్తిస్తారు కాబట్టి వాళ్లు సంతోషంగా, సంతృప్తిగా జీవిస్తారు.​—మత్తయి 5:3.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి