ప్రకటించే పనిలో మీ సంతోషాన్ని అధికం చేసుకోండి
1 సువార్త పనిలో భాగం వహించడంవల్ల కలిగే సంతోషాన్ని మీరు మీ పరిచర్యలో అనుభవిస్తున్నారా? మనం జాగ్రత్తగా ఉండకపోతే, మన చుట్టూవున్న దుష్టలోకం ప్రకటనాపనిలో మనలను పిరికివారిని చేసి మనం సంతోషాన్ని కోల్పోయేలా చేయగలదు. ప్రజలు అంతగా ప్రతిస్పందించని ప్రాంతంలో పనిచేయడం కూడా మనలను నిరుత్సాహపరచవచ్చు. ప్రకటనా పనిలోని మన సంతోషాన్ని అధికం చేసుకొనేందుకు మనం ఎలాంటి ఆచరణాత్మక చర్యలు తీసుకోవచ్చు?
2 అనుకూల దృక్పథాన్ని కలిగివుండండి: అనుకూల దృక్పథాన్ని కాపాడుకోవడం నిజంగా సహాయపడుతుంది. అలా చేయడానికి ఒక మార్గమేమిటంటే, ‘దేవుని జతపనివారిగా’ మనం కలిగివున్న గొప్ప ఆధిక్యత గురించి ధ్యానించడం. (1 కొరిం. 3:9) ఈ పనిని నెరవేర్చడంలో యేసు కూడా మనతో ఉన్నాడు. (మత్త. 28:20) ఆయన తన దూతల సైన్యంతో మనకు మద్దతునిస్తాడు. (మత్త. 13:41, 49) కాబట్టి మన ప్రయత్నాలన్నిటికీ దేవుని నడిపింపు ఉంటుందని మనం నమ్మకం కలిగివుండవచ్చు. (ప్రక. 14:6, 7) కాబట్టి మన పనికి కొంతమంది మానవులు ఎలా ప్రతిస్పందించినప్పటికీ పరలోక ప్రతిస్పందన మనకు గొప్ప సంతోషాన్ని కలుగజేస్తుంది!
3 బాగా సిద్ధపడండి: మంచి సిద్ధపాటు కూడా మన సంతోషానికి దోహదపడుతుంది. పరిచర్యకు సిద్ధపడడం, ఎంతో శ్రమతో కూడినదై ఉండనవసరం లేదు. క్రొత్త పత్రికల్లో నుండి లేక ఆ నెలలో ఏ సాహిత్యాలనైతే అందజేయాలో వాటిలో నుండి మాట్లాడే అంశాన్ని పరిశీలించేందుకు కేవలం కొద్ది నిమిషాలే పడుతుంది. మన రాజ్య పరిచర్యలో “పత్రికల గురించి ఏమని చెప్పాలి?” అనే అంశంలో నుంచి ఒక అందింపును ఎంపిక చేసుకోండి. జనవరి 2002లోని మధ్య పేజీల్లో ఉన్న “క్షేత్రసేవకు సూచించబడిన అందింపులు” అనే దాన్ని చదవండి, లేకపోతే తర్కించడం (ఆంగ్లం) పుస్తకంలో ప్రభావవంతమైన ఉపోద్ఘాతం కోసం చూడండి. సాధారణంగా గృహస్థులు లేవనెత్తే ఒక అభ్యంతరాన్ని మీరు ఎదుర్కొని ఉంటే, వారి వ్యాఖ్యానాన్ని అంగీకరిస్తూ ఆసక్తిని రేకెత్తించే విషయంవైపుకు వారి దృష్టిని మరల్చేలాంటి జవాబును సిద్ధం చేసుకోండి. అలా చేయడానికి తర్కించడం (ఆంగ్లం) పుస్తకం ఎంతో ఉపకరిస్తుంది. ఈ సహాయకాలను ఉపయోగించడం, సంతోషంగా ప్రకటించేందుకు మనకు కావలసిన నమ్మకాన్ని ఇస్తుంది.
4 హృదయపూర్వకంగా ప్రార్థించండి: శాశ్వత సంతోషానికి ప్రార్థన ఆవశ్యకం. మనం యెహోవా పని చేస్తున్నాము కాబట్టి, తన ఆత్మను కుమ్మరించమని మనం ఆయనను వేడుకోవడం అవసరం, ఆ ఆత్మఫలాల్లో ఒకటి సంతోషం. (గల. 5:22) మనం ప్రకటనా పనిలో కొనసాగేందుకు యెహోవా మనకు బలాన్నిస్తాడు. (ఫిలి. 4:13) మనం పరిచర్య గురించి ప్రార్థించడం, మనకు పరిచర్యలో ప్రతికూల అనుభవాలు ఎదురైనప్పుడు, సరైన దృక్పథాన్ని కలిగివుండేందుకు సహాయం చేయగలదు. (అపొ. 13:52; 1 పేతు. 4:13, 14) మనకు భయం అనిపిస్తే, ధైర్యంగానూ సంతోషంగానూ పట్టుదలతో కొనసాగేందుకు ప్రార్థన మనకు సహాయపడగలదు.—అపొ. 4:31.
5 అవకాశాలను సృష్టించుకోండి: మనం ప్రజలను కనుగొని వారికి సాక్ష్యమివ్వగలిగితే, మన పరిచర్య మరింత సంతోషకరంగా ఉంటుంది. ఇంటింటి పరిచర్యకు వేరే సమయంలో బహుశా మధ్యాహ్నం తరువాత గానీ, సాయంకాలానికి కాస్త ముందుగానీ సాక్ష్యమిచ్చేలా మీ షెడ్యూల్ని కాస్త మార్చుకోవడం మరింత ఫలవంతంగా ఉండవచ్చు. మీరు వీధిలో నడిచివెళ్తున్నప్పుడు, షాపుకు వెళ్తున్నప్పుడు, బస్లో ప్రయాణిస్తున్నప్పుడు, లేదా పార్క్లో వాహ్యాళికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎదురుపడుతుంటారు. క్లుప్తంగా సంభాషణను ప్రారంభించడానికి సిద్ధపడి, స్నేహపూర్వకంగా కనిపించేవారిని సమీపించేందుకు ఎందుకు చొరవ తీసుకోకూడదు? లేదా మీరు ఉద్యోగం చేస్తుంటే లేదా పాఠశాలకు వెళ్తుంటే అక్కడ మీరు ప్రతిరోజూ ఇతరులతో మాట్లాడుతుండవచ్చు. కొంత ఆసక్తిని రేకెత్తించే ఒక లేఖనాధారిత అంశాన్ని ఊరికే అలా లేవదీయడంద్వారా మీకు సాక్ష్యమిచ్చే అవకాశం లభించవచ్చు. జనవరి 2002 మన రాజ్య పరిచర్య మధ్యపేజీల్లోని మొదటి పేజీలో మంచి సలహాలు ఇవ్వబడ్డాయి. ఈ ప్రయత్నాల్లో ఏదైనా, ఒక వ్యక్తి ప్రకటనా పనిలో పొందే సంతోషాన్ని అధికం చేసేందుకు ఎంతైనా దోహదపడగలదు.
6 మనం ఓర్చుకొనేందుకు సంతోషం సహాయం చేస్తుంది కాబట్టి, దాన్ని కాపాడుకోవడం ఎంత ప్రాముఖ్యం! అలా చేయడం ద్వారా, పునరావృతం కాని ఈ పని ముగింపుకు చేరుకున్నప్పుడు, మనం గొప్ప ప్రతిఫలాన్ని పొందుతాము. ఆ ఉత్తరాపేక్షే ప్రకటనా పనిలో మన సంతోషాన్ని అధికం చేయగలదు.—మత్త. 25:21.