ప్రశ్నా భాగం
◼ టెలిఫోన్ ద్వారా సాక్ష్యమిస్తున్నప్పుడు విరాళమిచ్చే ఏర్పాటు గురించి వివరించాలా?
మనం ముఖాముఖిగా సాక్ష్యమిస్తున్నప్పుడు, యెహోవాసాక్షులు ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న బైబిలు విద్యాపని పూర్తిగా స్వచ్ఛంద విరాళాల మద్దతుతో జరుగుతోందని, ఆ పనికి మద్దతుగా ఇచ్చే విరాళాలను సంతోషంగా స్వీకరిస్తామని వివరించడం సాధ్యం కావచ్చు. కానీ టెలిఫోన్ ద్వారా సాక్ష్యమిచ్చేటప్పుడు విరాళాల గురించి గానీ విరాళమిచ్చే ఏర్పాటు గురించి గానీ ప్రస్తావించకూడదు, అలా చేస్తే అది టెలిఫోన్ ద్వారా విరాళాల కోసం అభ్యర్థించే ఒక పద్ధతి అనే తప్పుడు భావాన్నిచ్చే అవకాశముంది. యెహోవాసాక్షుల పరిచర్య ఏ విధంగానూ వాణిజ్యపరమైనది కాదు.—2 కొరిం. 2:17.
◼ టెలిఫోన్ ద్వారా సాక్ష్యమిస్తున్నప్పుడు, యెహోవాసాక్షులు ఇంకెప్పుడూ తనకు ఫోన్ చేయకూడదని ఒక వ్యక్తి అన్నప్పుడు మనమేమి చేయాలి?
ఆ వ్యక్తి కోరుకుంటున్నదాన్ని మన్నించాలి. భవిష్యత్తులో ప్రచారకులు ఆ నంబరుకు ఫోన్ చేయకుండా ఉండేందుకు, తనకు ఫోన్ చేయవద్దన్న ఆ వ్యక్తి పేరు, అలా చెప్పిన తేదీతో ఒక నోటు వ్రాసి క్షేత్రపు కవరులో ఉంచాలి. తమకు ఫోన్ చేయవద్దని కోరిన వ్యక్తుల లిస్టును సంవత్సరానికి ఒకసారి సమీక్షించాలి. వారిని సంప్రదించి వారు ప్రస్తుతం ఎలా భావిస్తున్నారనే విషయాన్ని నిర్ధారించుకునేందుకు సేవా పైవిచారణకర్త మార్గదర్శకంలో అనుభవమున్న, ఔచిత్యాన్ని చూపించే ప్రచారకులను నియమించవచ్చు.—మే 1998 మన రాజ్య పరిచర్యలోని ప్రశ్నా భాగం చూడండి.