వివిధ భాషలు మాట్లాడే ప్రజలుగల క్షేత్రంలో సాహిత్యాలను ప్రతిపాదించడం
1. స్థానిక భాష కాక వేరే భాష మాట్లాడే వారికి ఎలాంటి సహాయం చేయబడుతోంది?
1 అనేక మహానగరాల్లో, కేవలం ఒకే భాష ఉపయోగించి కూటాలు నిర్వహించడాన్ని ప్రారంభించడంలో మంచి అభివృద్ధి సాధించబడింది. స్థానిక భాష కాక వేరే భాష మాట్లాడేవారు, వారికి బాగా అర్థమయ్యే భాష ఉపయోగించే సమీప సంఘానికి పంపించబడుతున్నారు. వివిధ భాషలు మాట్లాడే ప్రజలుగల క్షేత్రంలో సాక్ష్యమివ్వడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయబడుతున్నాయి?
2. వేర్వేరు భాషలు ఉపయోగించే రెండు లేక అంతకంటే ఎక్కువ సంఘాలు ఒకే క్షేత్రంలో పరిచర్య చేసినప్పుడు ఎలాంటి సహకారం అవసరం?
2 సాహిత్యాలు ఎప్పుడు ప్రతిపాదించాలి: సేవాక్షేత్రంలో వివిధ భాషలు మాట్లాడే ప్రజలున్నప్పుడు ఆ సేవాక్షేత్రంలో వేర్వేరు భాషలు ఉపయోగించే రెండు లేదా అంతకంటే ఎక్కువ సంఘాలు క్రమంగా సాక్ష్యమివ్వడానికి ఏర్పాటు చేసుకోవాలి. ఈ ఏర్పాట్లు చేసే పెద్దల సభలు, క్షేత్రంలోని ప్రతి భాషా గుంపుకు చెందిన ప్రజలకు సంపూర్ణంగా సాక్ష్యమివ్వబడేలా ఆయా సంఘాలకు పరస్పర అనుకూల పద్ధతిని ఏర్పాటుచెయ్యడంలో సేవా పైవిచారణకర్తలతో కలిసి పనిచేస్తారు. ఇలాంటి క్షేత్రంలో ఇంటింటి పరిచర్య చేసేటప్పుడు ప్రచారకులు సాధారణంగా ఇతర సంఘాలు ఉపయోగించే భాషకు చెందిన సాహిత్యాలు అందించరు. ఒకవేళ వారలా అందించినా, ఆ సంబంధిత సంఘం ఆ వ్యక్తులను తిరిగి సందర్శించేందుకు వీలుగా వారి పేర్లను, చిరునామాలను నోట్ చేసుకోవాలి. సేవా పైవిచారణకర్తలు టెరిటరీ అసైన్మెంట్ కార్డుమీద ఆ గృహస్థులు ఏ భాషకు చెందినవారో నీట్‌గా వ్రాసివుంచేలా చేస్తారు, అలా చేయడంవల్ల భవిష్యత్తులో, ప్రచారకులు కేవలం తమ సంఘం ఉపయోగించే భాష మాట్లాడే ప్రజలనే సందర్శించడానికి వీలవుతుంది.
3. వివిధ భాషలు మాట్లాడే ప్రజలుగల క్షేత్రంలో సమర్థవంతంగా సేవచేసేలా సహాయపడేందుకు ప్రచారకులు ఏమి చేయవచ్చు?
3 ప్రతీ సంఘం ఆ క్షేత్రంలో క్రమంగా, సంపూర్ణంగా సాక్ష్యమిచ్చేలా నిశ్చయపరచుకోవడానికి మంచి వ్యవస్థీకరణ అవసరం. ప్రచారకులందరూ తమ సంఘ భాషను మాట్లాడేవారిపై ముఖ్యంగా అవధానం నిలపడం ద్వారా సహకరించవచ్చు. ఇంటింటి పరిచర్యా రికార్డుల్లో వివరాలన్నీ వ్రాసి పెట్టుకోవడం కూడా సహాయకరంగా ఉంటుంది. సూచించబడిన రీతిలో S-8 ఫారమ్‌ను ఉపయోగించి, ఆ భాషా సంబంధిత సమాచారాన్ని సత్వరమే సేవా పైవిచారణకర్తకు అందజేయండి. ఒకవేళ గృహస్థులు రెండు లేక మూడు భాషలను అనర్గళంగా మాట్లాడగలిగితే, ఆ ఇంటిని ఏ సంఘం సందర్శించాలో వివేచనాయుక్తంగా నిర్ణయించుకోవాలి. అంతేకాక ప్రజలు అప్పుడప్పుడూ ఇళ్ళు మారుతుంటారు కాబట్టి రికార్డులను ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి.
4. ఒక సంఘం తన భాష కాక వేరే భాషకు చెందిన సాహిత్యాలను ఎలాంటి పరిస్థితుల్లో స్టాకు చేసుకోవచ్చు?
4 సాహిత్యాలను ఎప్పుడు స్టాకు చేసుకోవాలి: సాధారణంగా ఒక స్థానిక సంఘం ఉపయోగిస్తున్న భాషకు చెందిన సాహిత్యాలను మరో సంఘం పెద్ద మొత్తంలో స్టాకు చేసుకోకూడదు. ఒక ప్రాంతంలో ఇతర భాష మాట్లాడే ప్రజలు ఎంతోమంది ఉన్నా ఆ భాష ఉపయోగించే సంఘం లేకపోతే అప్పుడేమి చేయాలి? అలాంటి పరిస్థితుల్లో, సంఘాలు ఆ భాషలో లభ్యమయ్యే ప్రాథమిక సాహిత్యాలను అంటే కరపత్రాలను, దేవుడు కోరుతున్నాడు బ్రోషుర్లను, జ్ఞానము పుస్తకాలను కొన్నింటిని స్టాకులో ఉంచుకోవచ్చు. ఆ భాష చదవగలిగే ప్రజలను కలిసినప్పుడల్లా ప్రచారకులు ఆ సాహిత్యాలను అందజేయవచ్చు.
5. సంఘపు స్టాకులో లేని భాషకు చెందిన సాహిత్యాలను ఎలా పొందవచ్చు?
5 ఆసక్తిగల వ్యక్తి చదవగలిగే భాషా సాహిత్యాలు సంఘంలో లేకపోతే, అప్పుడు ఆ భాషకు చెందిన సాహిత్యాలు ఎలా పొందవచ్చు? ప్రచారకుడు సాహిత్య సేవకుడి దగ్గరకు వెళ్ళి ఆ భాషలో ఏయే ప్రచురణలు లభ్యమవుతున్నాయో కనుక్కొని, వాటిని తర్వాతి సాహిత్యపు రిక్వెస్టుతోపాటు ఆర్డర్ చేయమని కోరవచ్చు.
6. క్రైస్తవ ప్రచురణలను ప్రజలకు లభ్యమయ్యేలా చేయడంలో మన లక్ష్యమేమిటి?
6 భాషతో ప్రమేయం లేకుండా “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుం[డేలా]” సహాయం చేయడానికి మనం క్రైస్తవ ప్రచురణలను సమర్థవంతంగా ఉపయోగిద్దాం.—1 తిమో. 2:3, 4.