జిల్లా మరియు అంతర్జాతీయ సమావేశాలు దేవుణ్ణి మహిమపరచేందుకు మనలను పురికొల్పాయి!
ఇప్పటివరకు జరిగిన “దేవుణ్ణి మహిమపరచండి” జిల్లా మరియు అంతర్జాతీయ సమావేశాలు అద్భుతమైన సాక్ష్యమిచ్చాయి. ఈ విశేష దైవపరిపాలనా సంఘటనలు యెహోవా నామాన్ని మహిమపరచడానికీ, ‘యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించేందుకు’ మన సామర్థ్యాన్ని ఇనుమడింపజేయడానికీ ఉపకరించాయి. (కీర్త. 96:8) అవును, ఆయన ఆశ్చర్యకర లక్షణాలను ప్రతిబింబించే ఆయన అద్భుత సృష్టికార్యాల్నిబట్టి మహిమను పొందడానికి ఆయన అర్హుడు.—యోబు 37:14; ప్రక. 4:10.
మీరు వ్యక్తిగతంగా వ్రాసుకున్న నోట్సుతోపాటు ఈ క్రింది ప్రశ్నలు ఉపయోగిస్తూ, జనవరి 19తో ప్రారంభమయ్యే వారంలో జరిగే సమావేశ కార్యక్రమ పునఃసమీక్షలో భాగంవహించేందుకు సిద్ధపడి, దానిలో భాగం వహించండి.
1. నిర్జీవ సృష్టి దేవుణ్ణెలా మహిమపరుస్తోంది, అది మానవులు ఆయనను స్తుతించే విధానానికి ఎలా భిన్నంగా ఉంది? (కీర్త. 19:1-3; “సృష్టి దేవుని మహిమను వెల్లడిచేస్తోంది”)
2. రూపాంతరం నేటి ఏ వాస్తవానికి పూర్వఛాయగా ఉంది, క్రైస్తవులు నేడు ఈ వాస్తవంచే ఏ విధంగా పురికొల్పబడుతున్నారు? (ముఖ్యాంశ ప్రసంగం, “అద్భుతమైన ప్రవచనాత్మక దర్శనాలు మనల్ని ఉత్తేజపరుస్తాయి!”)
3. దానియేలు ప్రవక్త ప్రదర్శించిన అణకువను మనమెలా అలవర్చుకోవచ్చు, అలాచేయడం నుండి మనమెలా ప్రయోజనం పొందుతాము? (దాని. 9:2, 5; 10:11, 12; “యెహోవా అణకువగలవారికి తన మహిమను వెల్లడిచేశాడు”)
4. (ఎ) ఆమోసు ప్రవచనం నుండి, దేవుని తీర్పు గురించి మనం ఏ మూడు సంగతులు నేర్చుకోవచ్చు? (ఆమో. 1:3, 11, 13; 9:2-4, 8, 14) (బి) ఆమోసు 2:12లో ఉన్న హెచ్చరికా మాదిరినుండి నేడు యెహోవాసాక్షులు ఎలాంటి ఆచరణాత్మక పాఠం నేర్చుకోవచ్చు? (“ఆమోసు ప్రవచనం—మన కాలం కొరకైన దాని సందేశం”)
5. (ఎ) ఒక వ్యక్తి తప్పత్రాగకపోయినా, మితిమీరి మద్యపానం సేవిస్తే ఎలాంటి ప్రమాదాలున్నాయి? (బి) మితిమీరి త్రాగే సమస్యను ఎలా అధిగమించవచ్చు? (మార్కు 9:43; ఎఫె. 5:18; “మద్యపాన ఉచ్చును తప్పించుకోండి”)
6. ‘మంచి దేశమును చూడండి’ అనే కొత్త ప్రచురణ నుండి మీరెలా ప్రయోజనం పొందుతున్నారు? (“‘మంచి దేశము’—పరదైసుకు ముంగుర్తు”)
7. ఏ మూడు విధాలుగా మనం ‘యెహోవా మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయగలము’? (2 కొరిం. 3:18; “యెహోవా మహిమను అద్దమువలె ప్రతిఫలింపజేయండి”)
8. అన్యాయంగా ద్వేషించబడడానికి మూలకారణమేమిటి, అలాంటి ద్వేషం అనుభవిస్తున్నా మన యథార్థత కాపాడుకోవడానికి మనకేది సహాయం చేయగలదు? (కీర్త. 109:1-3; “నిర్హేతుకంగా ద్వేషించబడ్డారు”)
9. గొప్పతనం విషయంలో క్రీస్తువంటి దృక్పథమేమిటి, ఈ దృక్పథాన్ని మరింత వృద్ధిచేసుకొనే అవసరత తనకుందని ఒక వ్యక్తి ఎలా తీర్మానించుకోవచ్చు? (మత్త. 20:20-26; “గొప్పతనం విషయంలో క్రీస్తువంటి దృక్పథం అలవరచుకోవడం”)
10. శారీరక అలసటవున్నా ఆధ్యాత్మికంగా బలంగా ఉండేందుకు మనకేది సహాయం చేయగలదు? (“అలసిపోతారు కానీ సొమ్మసిల్లరు”)
11. సాతాను అబద్ధాన్ని ప్రబలింపజేసే కొన్ని మాధ్యమాలేమిటి, మన విశ్వాసాన్ని దారిమళ్లించే ప్రయత్నాలకు ఎలాంటి లేఖన ప్రతిస్పందన సముచితమైనది? (యోహా. 10:5; “‘అన్యుల స్వరము’ విషయంలో జాగ్రత్త”)
12. (ఎ) మార్కు 10:14, 16లో చెప్పబడినట్లు తల్లిదండ్రులు యేసు మాదిరిని ఎలా అనుకరించవచ్చు? (బి) “గొప్ప బోధకుడి నుండి నేర్చుకోండి” (ఆంగ్లం) అనే కొత్త పుస్తకం విషయంలో మీకు నచ్చినదేమిటి? (“మన పిల్లలు—ఒక అమూల్య స్వాస్థ్యము”)
13. యౌవనులు యెహోవాను ఎలా స్తుతిస్తున్నారు? (1 తిమో. 4:12; “యువత యెహోవాను స్తుతిస్తున్న విధానం”)
14. “వ్యతిరేకత ఉన్నప్పటికీ ధైర్యంగా సాక్ష్యమివ్వడం” అనే నాటకంలో ఏ దృశ్యాలు మీకు ప్రత్యేకంగా జ్ఞాపకమున్నాయి?
15. (ఎ) పేతురు యోహానులు (అపొ. 4:10), (బి) స్తెఫను (అపొ. 7:2, 52, 53), (సి) మొదటి శతాబ్దపు క్రైస్తవ సంఘపు మాదిరిని మనమెలా అనుకరించవచ్చు? (అపొ. 9:31; నాటకం మరియు “సువార్తను ‘మానకుండా’ ప్రకటించండి” అనే ప్రసంగం)
16. (ఎ) ఏయే విధాలుగా దేవుణ్ణి మహిమపరచాలని మనం తీర్మానించుకున్నాం? (బి) “దేవుణ్ణి మహిమపరచండి” సమావేశాల్లో మనం నేర్చుకున్నది అన్వయించుకుంటూ ఉన్నప్పుడు మనం దేని విషయంలో నిర్భయంగా ఉండవచ్చు? (యోహా. 15:9, 10, 16; “యెహోవాకు మహిమ కలిగేవిధంగా ‘బహుగా ఫలిస్తుండండి’”)
[1వ పేజీలోని బాక్సు]
సమావేశంలో అందించబడిన చక్కని ఆధ్యాత్మిక ఉపదేశాన్ని ధ్యానించడం ద్వారా, మనం నేర్చుకున్నవి ఆచరణలో పెట్టడానికి మనం పురికొల్పబడతాం. (ఫిలి. 4:8, 9) ఇది మనం “సమస్తమును దేవుని మహిమకొరకు” చేయాలనే మన తీర్మానాన్ని బలపరుస్తుంది.—1 కొరిం. 10:31.