కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/03 పేజీ 1
  • ప్రశంస ఉత్తేజాన్నిస్తుంది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశంస ఉత్తేజాన్నిస్తుంది
  • మన రాజ్య పరిచర్య—2003
  • ఇలాంటి మరితర సమాచారం
  • “సమయోచితమైన మాట యెంత మనోహరము!”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2006
  • ప్రశంసించడం ప్రాముఖ్యమని మర్చిపోకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • ప్రశంసించడం ద్వారా—వ్యక్తిగత ఆసక్తిని చూపించండి
    మన రాజ్య పరిచర్య—2006
  • ప్రోత్సాహకరంగా మాట్లాడండి
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2003
km 11/03 పేజీ 1

ప్రశంస ఉత్తేజాన్నిస్తుంది

1 ఒక చిన్న పాప రాత్రి పడుకునే సమయంలో వెక్కి వెక్కి ఏడుస్తూ, “ఈ రోజు నేను బుద్ధిగా ప్రవర్తించలేదా?” అని అడిగింది. ఆ ప్రశ్నకు ఆమె తల్లి నిర్ఘాంతపోయింది. ఆమె ఆ రోజున తన కూతురు చక్కగా ప్రవర్తించడానికి ఎంతగా కష్టపడిందో చూసినప్పటికీ, మెచ్చుకోలుగా ఒక్క మాటకూడా అనలేదు. ఆ చిన్నారి కన్నీళ్ళు, మనందరికీ—పెద్దలకైనా చిన్నలకైనా—ప్రశంస అవసరమనే విషయాన్ని గుర్తుచేయాలి. మన చుట్టూ ఉన్నవారు చేసే మంచి పనికి మనం వారిని ప్రశంసిస్తూ ఉత్తేజపరుస్తున్నామా?—సామె. 25:11.

2 తోటి క్రైస్తవులు తమను ప్రశంసించడానికి మనకెన్నో మంచి కారణాలను ఇస్తారు. పెద్దలు, పరిచర్య సేవకులు, పయినీర్లు తమ తమ బాధ్యతలను నెరవేర్చడానికి చాలా కష్టపడతారు. (1 తిమో. 4:10; 5:17) దైవభక్తిగల తల్లిదండ్రులు తమ పిల్లలను యెహోవా మార్గాల్లో పెంచేందుకు తమ శాయశక్తులా ప్రయత్నిస్తారు. (ఎఫె. 6:4) క్రైస్తవ యువత “లౌకికాత్మను” ఎదిరించడానికి పోరాడుతుంది. (1 కొరిం. 2:12; ఎఫె. 2:1-3) మరికొందరు పైబడుతున్న వయస్సు, ఆరోగ్య సమస్యలు లేదా ఇతర శోధనలు ఉన్నప్పటికీ యెహోవాను విశ్వసనీయంగా సేవిస్తారు. (2 కొరిం. 12:7) అలాంటి వారందరు ప్రశంసార్హులు. ప్రశంసనీయమైన వారి ప్రయత్నాలను మనం గుర్తిస్తున్నామా?

3 వ్యక్తిగతంగా, నిర్దిష్టంగా: వేదికపైనుండి ప్రశంసలు వినడం మనందరికీ నిజంగానే ఆనందంగా ఉంటుంది. అయితే ఆ ప్రశంస, వ్యక్తిగతంగా మనల్ని ఉద్దేశించి చేయబడినదైతే మరింత ఉత్తేజకరంగా ఉంటుంది. ఉదాహరణకు, పౌలు రోమీయులకు వ్రాసిన పత్రికలోని 16వ అధ్యాయంలో ఫీబే, ప్రిస్కిల్ల, అకుల, త్రుపైనా, త్రుఫోసా, పెర్సిసులను ప్రశంసిస్తూ వారి గురించి నిర్దిష్టంగా పేర్కొన్నాడు. (రోమా. 16:1-4, 12) ఆయన మాటలు ఆ విశ్వసనీయులను ఎంత ఉత్తేజపరచి ఉంటాయో కదా! అలాంటి ప్రశంస వల్ల మన సహోదరసహోదరీలు తమ అవసరముందనే హామీని పొందుతారు, మనం ఒకరికొకరం దగ్గరవుతాం. మీరు ఇటీవలి కాలంలో ఎవరినైనా వ్యక్తిగతంగా, నిర్దిష్టంగా ప్రశంసించారా?—ఎఫె. 4:29.

4 హృదయపూర్వకంగా: ప్రశంస నిజంగా ఉత్తేజపరిచేలా ఉండాలంటే అది యథార్థంగా ఉండాలి. మనం హృదయపూర్వకంగా అంటున్నామో లేక కేవలం “నాలుకతో ఇచ్చకములాడు”తున్నామో ప్రజలు చెప్పగలరు. (సామె. 28:23) మనం ఇతరులలోని మంచిని గుర్తించడంలో మనకు మనం శిక్షణనిచ్చుకున్నప్పుడు, ప్రశంసించేందుకు మన హృదయం పురికొల్పబడుతుంది. “సమయోచితమైన మాట యెంత మనోహరము!” అన్న విషయాన్ని గ్రహించి, యథార్థంగా ప్రశంసించడంలో ఔదార్యాన్ని చూపించుదాం.—సామె. 15:23.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి