సంఘ పుస్తక అధ్యయనం—మనకెందుకు అవసరం
1. సంఘ పుస్తక అధ్యయన ఏర్పాటు ఎలా ప్రారంభమైంది?
1 అప్పట్లో బైబిలు విద్యార్థులని పిలువబడిన యెహోవాసాక్షుల అధ్యయన గుంపులు, 1895లో డాన్ సర్కిల్స్ ఫర్ బైబిల్ స్టడీ అని పిలువబడ్డాయి. మిల్లెనియల్ డాన్ సంపుటాలు అధ్యయనానికి ఆధారంగా ఉపయోగించబడేవి. ఆ తర్వాత, ఈ కూటాలు బెరొయన్ సర్కిల్స్ ఫర్ బైబిల్ స్టడీ అని పిలువబడ్డాయి. (అపొ. 17:11) తరచూ ఒక మోస్తరు ప్రజలున్న గుంపు, ఆ గుంపులోని వారందరికీ అనుకూలంగా ఉన్న సాయంకాలాన ఎవరో ఒకరి ఇంట్లో కలుసుకునేది. ఆ విధంగా సంఘ పుస్తక అధ్యయన ఏర్పాటు ప్రారంభమైంది.
2. పుస్తక అధ్యయనంలో ‘ఒకరి విశ్వాసముచేత ఒకరు ఆదరణ పొందడానికి’ మనం ఎలా దోహదపడవచ్చు?
2 ప్రోత్సాహం, సహాయం: పుస్తక అధ్యయన గుంపులు ఉద్దేశపూర్వకంగానే చిన్నగా ఉంచబడ్డాయి కాబట్టి, దానికి హాజరైనవారు తమ విశ్వాసాన్ని వ్యక్తం చేయడానికి వారికి ఎక్కువ అవకాశాలు లభిస్తాయి. తత్ఫలితంగా ‘ఒకరి విశ్వాసముచేత ఒకరు ఆదరణ పొందుతారు.’—రోమా. 1:11.
3, 4. పుస్తక అధ్యయన ఏర్పాటు మన పరిచర్యను నెరవేర్చడానికి మనకెలా సహాయం చేస్తుంది?
3 పుస్తక అధ్యయన పైవిచారణకర్త బోధనా విధానాన్ని గమనించడం ‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించడానికి’ మనకు సహాయం చేస్తుంది. (2 తిమో. 2:15) ఆయన సమాచారానికి లేఖనాధారాన్ని ఎలా నొక్కి చెబుతున్నాడో గమనించండి. పరిశీలించబడుతున్న ప్రచురణకు తగినదైతే, ఆయన కేవలం బైబిలును ఉపయోగిస్తూ, ముగింపు పునఃసమీక్ష ద్వారా ముఖ్యాంశాలను నొక్కిచెబుతాడు. ఆయన మంచి మాదిరి క్రైస్తవ పరిచర్యలో మన బోధను మెరుగుపరచుకోవడానికి సహాయం చేస్తుంది.—1 కొరిం. 11:1.
4 పుస్తక అధ్యయన పైవిచారణకర్త వారపు పాఠాన్ని నిర్వహించడమే కాకుండా సువార్తపనిలో నాయకత్వం వహిస్తాడు. సేవా పైవిచారణకర్త సహకారంతో ఆయన క్షేత్ర సేవ కోసం తగిన ఏర్పాట్లు చేస్తాడు. గుంపులోని వారందరూ సువార్త ప్రకటించి శిష్యులను చేయడమనే తమ క్రైస్తవ బాధ్యతను నెరవేర్చడానికి ఆయన వారికి సహాయం చేస్తాడు.—మత్త. 28:19, 20; 1 కొరిం. 9:16.
5. పుస్తక అధ్యయనం ద్వారా ఎలాంటి వ్యక్తిగత సహాయం అందుబాటులో ఉంది?
5 పుస్తక అధ్యయన పైవిచారణకర్త గుంపులోని ప్రతి ఒక్కరి ఆధ్యాత్మిక సంక్షేమం పట్ల శ్రద్ధ కలిగివుంటాడు. ఆయన ఈ శ్రద్ధను సంఘ కూటాల్లోనూ, వారితో క్షేత్ర సేవలో కలిసి పని చేసేటప్పుడూ చూపిస్తాడు. అంతేగాక ఆయన సహోదరులను వారి ఇళ్ళల్లో సందర్శించినప్పుడు వారిని ఆధ్యాత్మికంగా ప్రోత్సహించడానికి ఆ సందర్భాలను ఉపయోగించుకుంటాడు. కాబట్టి తమకు ఆధ్యాత్మిక సహాయం అవసరం ఉన్నప్పుడల్లా పుస్తక అధ్యయన పైవిచారణకర్తను సమీపించడానికి ఎవరూ సంకోచించకూడదు.—యెష. 32:1, 2.
6. (ఎ) కొన్ని దేశాల్లోని మన సహోదరులు చిన్న గుంపుల్లో కూడుకోవడం ద్వారా ఎలా బలపరచబడ్డారు? (బి) పుస్తక అధ్యయన ఏర్పాటు నుండి మీరు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనం పొందారు?
6 ఒకరినొకరు బలపరచుకోండి: దేవుని ప్రజల కార్యకలాపాలు నిషేధించబడిన దేశాల్లో సహోదరులు తరచూ చిన్న గుంపులుగా కలుసుకుంటారు. ఒక సహోదరుడు ఇలా జ్ఞాపకం చేసుకుంటున్నాడు: “మన క్రైస్తవ కార్యకలాపాలు నిషేధించబడినప్పటికీ, సాధ్యమైనప్పుడల్లా మేము 10 నుండి 15 మందిమి కూడుకొని వారపు కూటాలు జరుపుకునే వాళ్ళము. బైబిలు అధ్యయనం ద్వారానూ, అధ్యయనం తర్వాత సహవాసం ద్వారానూ మేము కూటాల నుండి ఆధ్యాత్మిక బలాన్ని పొందేవాళ్ళం. మేము ఒకరి అనుభవాలను మరొకరి అనుభవాలతో పోల్చుకొనేవాళ్ళం, ఇది మాలో ప్రతి ఒక్కరం ఒకేవిధమైన పోరాటం పోరాడుతున్నామని గ్రహించడానికి మాకు సహాయం చేసింది.” (1 పేతు. 5:9) పుస్తక అధ్యయన ఏర్పాటుకు పూర్తిగా మద్దతునివ్వడం ద్వారా మనం కూడా అలాగే ఒకరినొకరం బలపరచుకుందాం.—ఎఫె. 4:16.