ఆచరణాత్మకమైన కుటుంబ కార్యక్రమ పట్టికను తయారు చేసుకోండి
1 కొండమీది ప్రసంగంలో యేసు తన శ్రోతలకు ఇలా ఉద్బోధించాడు: ‘మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి.’ (మత్త. 6:33) ఆధ్యాత్మిక విషయాలకు ప్రాముఖ్యతనిచ్చే విధంగా కుటుంబ కార్యకలాపాలను ప్రణాళిక వేసుకొనేందుకు ఒక ఆచరణాత్మకమైన మార్గం, వ్రాతపూర్వకమైన కార్యక్రమ పట్టికను తయారు చేసుకోవడమే. 6వ పేజీలోని ఖాళీ పట్టికను ఉపయోగించి మీ వారపు కుటుంబ కార్యక్రమ పట్టికను తయారు చేసుకోవడానికి కొన్ని నిమిషాలు వెచ్చించండి. కుటుంబ ప్రణాళికలో భాగంగా కొందరు పట్టికలో ఉన్న కార్యకలాపాలకు సంబంధించి ఉన్న వివరాల ముక్కలను కత్తిరించి పట్టికలో అంటించడానికి ఇష్టపడుతుండవచ్చు. మరికొందరు కార్యకలాపాలను వ్రాసుకోవడానికి ఇష్టపడుతుండవచ్చు.
2 మీ పట్టికను తయారు చేసుకోవడానికి క్రింద చూపించిన నమూనా పట్టిక మీకు సహాయపడవచ్చు. ఆ పట్టికలో కేవలం నాలుగు ప్రాథమిక కార్యకలాపాలు ఉన్నట్లు మీరు గమనిస్తారు: (1) సంఘ కూటాలకు హాజరు కావడం, (2) కుటుంబ క్షేత్ర సేవ (3) కుటుంబ అధ్యయనం (4) ప్రతిదినం లేఖనాలను పరిశీలించడం. ఈ అంశాలను మీ కార్యక్రమ పట్టికలో చేర్చడం ‘శ్రేష్ఠమైన కార్యములను వివేచించడానికి’ మీకు సహాయకరంగా ఉండగలదు. (ఫిలి. 1:9-11) ఆ నాలుగు కార్యకలాపాల మీద అదనపు సూచనలు 4-5 పేజీల్లో ఉన్నాయి.
3 మీ కుటుంబ కార్యక్రమ పట్టిక ఆ నాలుగు కార్యకలాపాలకే పరిమితం కానవసరం లేదు. మీరు కుటుంబంగా కొన్ని కూటాలకు సిద్ధపడుతున్నట్లయితే మీ కార్యక్రమ పట్టికలో దానిని వ్రాసుకోండి. మీరు దినవచనం పరిశీలించిన తర్వాత లేక వేరే సమయంలో బైబిలులోని ఒక భాగాన్ని కలిసి చదువుతుంటే కార్యక్రమ పట్టికలో దానిని కూడా వ్రాసుకోండి. మీరు ఏదో ఒక విధమైన ఉల్లాస కార్యకలాపాల్లో సాధారణంగా పాల్గొంటున్నట్లయితే మీ కార్యక్రమ పట్టికలో దానిని కూడా చేర్చడానికి ఇష్టపడవచ్చు.
4 మీ కుటుంబ కార్యక్రమ పట్టికను కుటుంబ సభ్యులందరి అవసరాలకు, పరిస్థితులకు తగినట్లు ఉండేలా మలుచుకోండి. అది ఎంత ఫలభరితమైందో అప్పుడప్పుడు విశ్లేషించుకొని అవసరమైన మార్పులు చేసుకోండి.
[3వ పేజీలోని చిత్రం]
కుటుంబ కార్యక్రమ పట్టికకు నమూనా
ఉదయం మధ్యాహ్నం సాయంత్రం
ఆది. దినవచనం
బహిరంగ ప్రసంగం
కావలికోట అధ్యయనం
సోమ. దినవచనం కుటుంబ అధ్యయనం
మంగళ. దినవచనం సంఘ
పుస్తక అధ్యయనం
బుధ. దినవచనం
గురు. దినవచనం దైవపరిపాలనా
పరిచర్య పాఠశాల
సేవా కూటం
శుక్ర. దినవచనం
శని. దినవచనం
కుటుంబ
క్షేత్రసేవ
(పత్రికా దినం)
[6వ పేజీలోని చిత్రం]
కుటుంబ కార్యక్రమ పట్టిక
ఉదయం మధ్యాహ్నం సాయంత్రం
ఆది.
సోమ.
మంగళ.
బుధ.
గురు.
శుక్ర.
శని.
..............................................
దినవచనం దినవచనం దినవచనం దినవచనం దినవచనం దినవచనం దినవచనం
బహిరంగ దైవపరిపాలనా సంఘ కుటుంబ కుటుంబ కుటుంబ కుటుంబ
ప్రసంగం, పరిచర్య పుస్తక అధ్యయనం క్షేత్ర సేవ బైబిలు ఉల్లాస
కావలికోట పాఠశాల, అధ్యయనం పఠనం కార్యకలాపాలు
అధ్యయనం సేవా కూటం