కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/05 పేజీలు 3-6
  • ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం
  • మన రాజ్య పరిచర్య—2005
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • సిఫారసు చేయబడిన ప్రచురణలు
  • సిద్ధపడే విధానం
  • పాఠాన్ని విద్యార్థి అవసరానికి అనుగుణంగా మలచండి
  • దేవుని వాక్యం నుండి బోధించండి
  • అండర్‌లైన్‌ చేసుకోవడం, మార్జిన్‌లలో వివరణలు రాసుకోవడం
  • సమీక్ష, పునఃసమీక్ష
  • బలమైన విశ్వాసాన్ని పెంపొందించండి
  • ముఖ్యాంశానికి హత్తుకొని ఉండండి
  • వివేచనను ఉపయోగించండి
  • వినయం కనబరచండి:
  • ప్రార్థనను ఎలా పరిచయం చేయాలి
  • ప్రార్థనలో ఏమేమి చేర్చవచ్చు
  • సంఘ కూటాలు
  • కృతజ్ఞతను పెంచేందుకు వీడియోలను ఉపయోగించండి
  • సాక్ష్యమిచ్చేందుకు వారిని ప్రోత్సహించండి
  • తమ నమ్మకాల గురించి మాట్లాడడానికి శిక్షణ ఇవ్వండి
  • కలిసి సిద్ధపడడం
  • కలిసి ప్రకటించడం
  • పునర్దర్శనాలు చేయడానికి సిద్ధపడడం
  • పట్టుదలతో పునర్దర్శించండి
  • బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించడం
  • బోధకులుగా ఉండేందుకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం
  • విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు?​— 1వ భాగం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • మీ బైబిలు విద్యార్థులు బాప్తిస్మం తీసుకునేలా సహాయం చేయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • విద్యార్థి బాప్తిస్మం తీసుకునేలా బైబిలు స్టడీ ఎలా చేయవచ్చు?​— 2వ భాగం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2020
  • బోధించడానికి చక్కగా సిద్ధపడి ఉండండి
    మన రాజ్య పరిచర్య—2009
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2005
km 9/05 పేజీలు 3-6

భద్రపరచుకోండి

ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం

ఈ అనుబంధం, ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం గురించి మన రాజ్య పరిచర్యలో వరుసగా వచ్చిన ఆర్టికల్స్‌లోని కీలకాంశాల సంకలనం. దీనిని భద్రపరచుకొని బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తున్నప్పుడు ఉపయోగించాలని అందరూ ప్రోత్సహించబడుతున్నారు. అంతేకాక దీనిలోని అంశాలను క్షేత్రసేవ కోసం నిర్వహించే కూటాల్లో నొక్కిచెప్పవచ్చు, సేవా పైవిచారణకర్తలు పుస్తక అధ్యయన గుంపులను సందర్శిస్తున్నప్పుడు దీనిని ఆధారంగా చేసుకొని ప్రసంగాలు ఇవ్వవచ్చు.

1వ భాగం: బైబిలు అధ్యయనం అంటే ఏమిటి?

మీరు బైబిలుతోపాటు ఒక ప్రచురణను ఉపయోగిస్తూ క్లుప్తంగానే అయినా క్రమంగా ఒక పద్ధతి ప్రకారం బైబిలు చర్చలను నిర్వహిస్తుంటే, మీరొక బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నట్లే. అధ్యయనం ఎలా నిర్వహించబడుతుందో ప్రదర్శించిన తర్వాత రెండుసార్లు అధ్యయనాన్ని నిర్వహిస్తే, అది అలా కొనసాగుతుందనే నమ్మకం మనకుంటే దానిని ఒక అధ్యయనంగా రిపోర్టు చేయవచ్చు.—km 7/04 1వ పేజీ.

సిఫారసు చేయబడిన ప్రచురణలు

◼ దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?

◼ నిత్యజీవానికి నడిపించే జ్ఞానము

◼ అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి

◼ పరిమిత విద్య లేక చదివే సామర్థ్యం ఉన్న వ్యక్తులతో అధ్యయనం చేయడానికి మీరు దేవుని స్నేహితులు కాగలరు! (ఆంగ్లం) అనే బ్రోషుర్‌ను ఉపయోగించవచ్చు.

2వ భాగం: అధ్యయనం నిర్వహించడానికి సిద్ధపడడం

విద్యార్థి హృదయాన్ని పురికొల్పే విధంగా సమాచారాన్ని అందించాలి. అలా చేయాలంటే ఆ విద్యార్థిని మనస్సులో ఉంచుకొని సమగ్రంగా సిద్ధపడడం అవసరం.—km 8/04 1వ పేజీ.

సిద్ధపడే విధానం

◼ అధ్యాయం లేక పాఠంలోని శీర్షికను, ఉపశీర్షికలను, చిత్రాలేమైనా ఉంటే వాటినీ క్లుప్తంగా పరిశీలించండి.

◼ ముద్రించబడిన ప్రశ్నలకు జవాబులను గుర్తించండి, కీలకమైన పదాలకు, పదబంధాలకు మాత్రమే గుర్తులు పెట్టుకోండి.

◼ అధ్యయనం చేస్తున్నప్పుడు అందులో ఉదాహరించబడిన ఏ లేఖనాలను చదవాలో నిర్ణయించుకోండి. ప్రచురణలోని మార్జిన్‌లో క్లుప్తంగా నోట్సు వ్రాసుకోండి.

◼ ముఖ్యాంశాల క్లుప్త పునఃసమీక్షను సిద్ధం చేసుకోండి.

పాఠాన్ని విద్యార్థి అవసరానికి అనుగుణంగా మలచండి

◼ విద్యార్థి గురించి, అతని అవసరాల గురించి ప్రార్థించండి.

◼ విద్యార్థి అర్థం చేసుకోవడానికి లేదా స్వీకరించడానికి కష్టంగా అనిపించే అంశాల గురించి ముందే ఆలోచించండి.

◼ వీటి గురించి ఆలోచించండి: ఆధ్యాత్మిక అభివృద్ధి సాధించడానికి ఆయన ఏ విషయాన్ని అర్థం చేసుకోవాలి లేదా ఎక్కడ మెరుగవ్వాలి? విషయం ఆయన హృదయానికి చేరేలా నేనెలా వివరించగలను?

◼ విద్యార్థి ఒక అంశాన్ని లేదా ఒక లేఖనాన్ని అర్థం చేసుకోవడానికి అవసరమైన విధంగా ఒక ఉపమానాన్ని, ఒక వివరణను లేదా కొన్ని ప్రశ్నలను సిద్ధం చేసుకోండి.

3వ భాగం: లేఖనాలను సమర్థవంతంగా ఉపయోగించడం

ప్రజలు దేవుని వాక్య బోధలను గ్రహించి, అంగీకరించి, వాటిని తమ జీవితాల్లో అన్వయించుకొనేలా సహాయం చేయడం ద్వారా వారిని ‘శిష్యులను చేయడమే’ మనం బైబిలు అధ్యయనాలను నిర్వహించడానికిగల ఉద్దేశం. (మత్త. 28:19, 20; 1 థెస్స. 2:13) కాబట్టి అధ్యయనం లేఖనాలపై కేంద్రీకృతమై ఉండాలి.—km 11/04 4వ పేజీ.

దేవుని వాక్యం నుండి బోధించండి

◼ విద్యార్థికి తన బైబిల్లో నిర్దిష్ట లేఖనాలను ఎలా కనుగొనాలో చూపించండి.

◼ మన నమ్మకాలకు ఆధారంగా ఉండే బైబిలు వచనాలు చూపించి, చర్చించండి.

◼ ప్రశ్నలను ఉపయోగించండి. విద్యార్థికి బైబిలు వచనాలను వివరించే బదులు విద్యార్థే వాటిని మీకు వివరించేలా చేయండి.

◼ సరళంగా ఉంచండి. ఒక లేఖనానికి సంబంధించిన ప్రతీ అంశాన్ని వివరించే ప్రయత్నం చేయకండి. పరిశీలనలో ఉన్న విషయాన్ని స్పష్టం చేసే అంశాన్ని మాత్రమే వివరించండి.

◼ ఆచరణాత్మకంగా ఎలా అన్వయించుకోవాలో చెప్పండి. బైబిలు లేఖనాలు తనకు వ్యక్తిగతంగా ఎలా వర్తిస్తాయో తెలుసుకోవడానికి విద్యార్థికి సహాయం చేయండి.

4వ భాగం: సిద్ధపడేందుకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం

పాఠాన్ని ముందే చదివి, జవాబులను అండర్‌లైన్‌ చేసుకుని, వాటిని తన సొంత మాటల్లో ఎలా వ్యక్తం చేయాలో ఆలోచించే విద్యార్థి సాధారణంగా త్వరితగతిన ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధిస్తాడు. కాబట్టి ఒకసారి క్రమమైన అధ్యయనం ప్రారంభమైన తర్వాత, పాఠాన్ని ఎలా సిద్ధపడాలో చూపేందుకు విద్యార్థితో కలిసి ఒక పాఠాన్ని సిద్ధపడండి. చాలామంది విద్యార్థుల విషయంలో మొత్తం అధ్యాయాన్ని లేక పాఠాన్ని వారితో కలిసి సిద్ధపడడం సహాయకరంగా ఉంటుంది.—km 12/04 1వ పేజీ.

అండర్‌లైన్‌ చేసుకోవడం, మార్జిన్‌లలో వివరణలు రాసుకోవడం

◼ ముద్రిత ప్రశ్నలకు సూటియైన జవాబులు ఎలా కనుగొనాలో వివరించండి.

◼ అధ్యయనం చేస్తున్న ప్రచురణలో కేవలం కీలకమైన పదాలను లేక పదబంధాలను అండర్‌లైన్‌ చేసుకున్న మీ ప్రచురణ ప్రతిని విద్యార్థికి చూపించండి.

◼ ఉదాహరించబడిన ప్రతీ లేఖనం పేరాలోని ఒక అంశాన్ని సమర్థిస్తుందని తెలుసుకొనేందుకు ఆయనకు సహాయం చేయండి. అధ్యయనం చేస్తున్న ప్రచురణలో క్లుప్తమైన వివరణలను తన ప్రతిలోని మార్జిన్‌లో ఎలా రాసుకోవాలో ఆయనకు చూపించండి.

సమీక్ష, పునఃసమీక్ష

◼ విద్యార్థి అధ్యయనం చేస్తున్న సమాచారపు అన్ని వివరాలను పరిశీలిస్తూ సంపూర్ణంగా సిద్ధపడడానికి ఆరంభించే ముందు, అధ్యాయాన్ని లేక పాఠానికి సంబంధించిన శీర్షికను, ఉపశీర్షికలను, చిత్రాలను ఎలా పరిశీలించాలో విద్యార్థికి చూపించండి.

◼ సిద్ధపడడం ముగించే ముందు, ముఖ్యాంశాలను పునఃసమీక్షించుకొమ్మని విద్యార్థిని ప్రోత్సహించండి.

5వ భాగం: ఎంత సమాచారాన్ని చర్చించాలో నిర్ణయించుకోవడం

ఎంత సమాచారం పరిశీలించవచ్చు అనే విషయం అధ్యయన నిర్వాహకుడి సామర్థ్యాలూ పరిస్థితులతోపాటు విద్యార్థి సామర్థ్యాలూ పరిస్థితులపై కూడా ఆధారపడి ఉంటుంది.—km 1/05 1వ పేజీ.

బలమైన విశ్వాసాన్ని పెంపొందించండి

◼ తక్కువ సమయంలో ఎక్కువ సమాచారాన్ని పూర్తి చేయడంకన్నా విద్యార్థి సమాచారాన్ని స్పష్టంగా అర్థం చేసుకొనేందుకే మనం సహాయం చేయడం ఎంతో ప్రాముఖ్యం.

◼ విద్యార్థి తాను నేర్చుకుంటున్న విషయాలను గ్రహించేందుకు, వాటిని అంగీకరించేందుకు సహాయం చేయడానికి అవసరమైన సమయాన్ని ఆయనతో గడపండి.

◼ బోధలకు ఆధారమైన కీలకమైన లేఖనాలను పరిశీలించేందుకు తగిన సమయాన్ని తీసుకోండి.

ముఖ్యాంశానికి హత్తుకొని ఉండండి

◼ ఒక విద్యార్థి తన వ్యక్తిగత విషయాల గురించి ఎక్కువగా మాట్లాడేందుకు మొగ్గు చూపుతున్నట్లయితే, అధ్యయనం తరువాత వాటిని చర్చించేందుకు ఏర్పాటు చేయవచ్చు.

◼ అధ్యయనం చేస్తున్నప్పుడు ఎక్కువగా మాట్లాడకండి. విద్యార్థి ప్రాథమిక బైబిలు బోధలకు సంబంధించిన ఖచ్చితమైన జ్ఞానాన్ని సంపాదించుకోవడంలో ఆటంకం కలగకుండా ఉండే విధంగా అదనపు అంశాలు, అనుభవాల చర్చను పరిమితం చేయండి.

6వ భాగం: విద్యార్థి ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు ఏమి చేయాలి?

ఒకసారి బైబిలు అధ్యయనాన్ని క్రమంగా ఏర్పాటు చేసిన తర్వాత, పొంతన లేని అంశాలను ఒకదాని తర్వాత మరొకటి చర్చించే బదులు క్రమమైన రీతిలో బైబిలు బోధలను పరిశీలించడం సాధారణంగా శ్రేష్ఠమైనది. ఈ విధంగా చేయడం, విద్యార్థి ఖచ్చితమైన పరిజ్ఞానానికి సంబంధించిన తన పునాదిని బలపరచుకోవడానికి, ఆధ్యాత్మికంగా పురోభివృద్ధి సాధించడానికి సహాయం చేస్తుంది.—km 2/05 6వ పేజీ.

వివేచనను ఉపయోగించండి

◼ అధ్యయనం చేస్తున్న సమాచారానికి సంబంధించిన ప్రశ్నలకు సాధారణంగా అప్పటికప్పుడే సమాధానం ఇవ్వవచ్చు.

◼ అధ్యయనం చేస్తున్న సమాచారంతో సంబంధం లేని ప్రశ్నలను లేదా సరైన జవాబు ఇవ్వడానికి పరిశోధన అవసరమయ్యే ప్రశ్నలను మరొక సమయంలో పరిశీలించవచ్చు. అలాంటి ప్రశ్నను రాసుకోవడం సహాయకరంగా ఉండవచ్చు.

◼ బైబిలు విద్యార్థికి ఒక ప్రత్యేక బోధను అంగీకరించడం కష్టంగా ఉంటే, ఆ విషయాన్ని విపులంగా చర్చించే అదనపు సమాచారాన్ని పరిశీలించండి.

◼ అప్పటికీ విద్యార్థికి నమ్మకం కలగకపోతే, ఆ విషయాన్ని వేరే సమయంలో చర్చిద్దామని చెప్పి అధ్యయనాన్ని కొనసాగించండి.

వినయం కనబరచండి:

◼ మీకు ఒక ప్రశ్నకు జవాబు తెలియకపోతే, మీ వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పకండి.

◼ పరిశోధన ఎలా చేయాలో విద్యార్థికి క్రమంగా నేర్పించండి.

7వ భాగం: అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రార్థించడం

బైబిలు విద్యార్థులు ఆధ్యాత్మిక పురోభివృద్ధి సాధించాలంటే, యెహోవా ఆశీర్వాదం ఆవశ్యకం. అందుకే అధ్యయనం ప్రార్థనతో ప్రారంభించి, ప్రార్థనతో ముగించడం సముచితంగా ఉంటుంది.—km 3/05 8వ పేజీ.

ప్రార్థనను ఎలా పరిచయం చేయాలి

◼ మతసంబంధమైన ఆసక్తి ఉన్నవారితో మొదటిసారిగా అధ్యయనం చేస్తున్నప్పుడే మనం ప్రార్థించవచ్చు.

◼ ఇతర విద్యార్థుల విషయంలో అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రార్థించడానికి సరైన సమయాన్ని మనం గుర్తించాల్సి రావచ్చు.

◼ మనం ఎందుకు ప్రార్థిస్తామో వివరించడానికి కీర్తన 25:4, 5; 1 యోహాను 5:14 లను ఉపయోగించవచ్చు.

◼ మనం యేసుక్రీస్తు ద్వారా యెహోవాకు ప్రార్థించాలని వివరించేందుకు యోహాను 15:16 ను ఉపయోగించవచ్చు.

ప్రార్థనలో ఏమేమి చేర్చవచ్చు

◼ ఉపదేశానికి మూలమైన యెహోవాను స్తుతించడం సముచితంగా ఉంటుంది.

◼ విద్యార్థి మీద ఉన్న నిజమైన ఆసక్తిని వ్యక్తం చేయండి.

◼ యెహోవా ఉపయోగిస్తున్న సంస్థపట్ల కృతజ్ఞతను వ్యక్తం చేయండి.

◼ విద్యార్థి తాను నేర్చుకుంటున్న వాటిని పాటించడానికి చేస్తున్న ప్రయత్నాల మీద యెహోవా ఆశీర్వాదాలను అడగండి.

8వ భాగం: విద్యార్థులను సంస్థ వైపుకు నడిపించడం

బైబిలు అధ్యయనాలను నిర్వహించడంలోని మన లక్ష్యం, కేవలం విద్యార్థులకు సిద్ధాంతపరమైన సమాచారాన్ని బోధించడమే కాక, వారు క్రైస్తవ సంఘంలో భాగం అయ్యేందుకు వారికి సహాయం చేయడం కూడా. ప్రతీ వారం అధ్యయనం నిర్వహిస్తున్నప్పుడు యెహోవా సంస్థ గురించిన ఒక అంశాన్ని బోధించడానికి కొన్ని నిమిషాలు వెచ్చించండి.—km 4/05 8వ పేజీ.

సంఘ కూటాలు

◼ ప్రతీ కూటం గురించి వివరించండి. వారితో మొదటి అధ్యయనం చేసినప్పటి నుండి వారిని కూటాలకు హాజరవమని ఆహ్వానించండి.

◼ కూటాల్లో అందించిన విశేషాంశాలను పంచుకోండి.

◼ జ్ఞాపకార్థ ఆచరణ, సమావేశాలు, ప్రాంతీయ పైవిచారణకర్త సందర్శనం వంటి వాటిపట్ల ఉత్సాహం పెంచండి.

◼ వారు కూటాల్లో జరిగేవాటిని మనసులో చిత్రీకరించుకొనేందుకు సహాయం చేయడానికి మన ప్రచురణల్లోని చిత్రాలను ఉపయోగించండి.

◼ యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి? అనే బ్రోషుర్‌ను చదవమని వారిని ప్రోత్సహించండి.

కృతజ్ఞతను పెంచేందుకు వీడియోలను ఉపయోగించండి

◼ యెహోవాసాక్షులు—ఆ పేరు వెనుకనున్న సంస్థ (ఆంగ్లం)

◼ విశ్వవ్యాప్తంగా ఉన్న మన సౌభ్రాతృత్వం (ఆంగ్లం)

◼ దైవిక బోధ ద్వారా ఐక్యమయ్యారు (ఆంగ్లం)

◼ భూదిగంతముల వరకు (ఆంగ్లం)

9వ భాగం: అనియత సాక్ష్యం ఇచ్చేందుకు విద్యార్థులను సిద్ధం చేయడం

బైబిలు విద్యార్థులు తాము నేర్చుకుంటున్న వాటిని విశ్వసించడం ప్రారంభించగానే, దాని గురించి ఇతరులకు చెప్పేందుకు వారు ప్రేరణ పొందుతారు.—km 5/05 1వ పేజీ.

సాక్ష్యమిచ్చేందుకు వారిని ప్రోత్సహించండి

◼ అధ్యయనం చేస్తున్నప్పుడు తమతోపాటు కూర్చోవడానికి వారికి స్నేహితులు, కుటుంబ సభ్యులు ఉన్నారా?

◼ వారి సహోద్యోగులు, తోటి విద్యార్థులు లేక పరిచయస్థులు ఎవరైనా సువార్త విషయంలో ఆసక్తి వ్యక్తం చేశారా?

తమ నమ్మకాల గురించి మాట్లాడడానికి శిక్షణ ఇవ్వండి

◼ అధ్యయనంలోని ప్రత్యేకమైన అంశాలను చర్చిస్తున్నప్పుడు, విద్యార్థిని ఇలా అడగండి, “మీ కుటుంబానికి ఈ సత్యాన్ని వివరించడానికి మీరు బైబిలును ఎలా ఉపయోగిస్తారు?”

◼ దేవుని గురించి, ఆయన సంకల్పాల గురించి ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు మర్యాదతో, దయతో వ్యవహరించాల్సిన అవసరాన్ని గుర్తించేందుకు విద్యార్థికి సహాయం చేయండి.

◼ యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి? అనే బ్రోషుర్‌ను, మన బైబిలు ఆధారిత నమ్మకాలను, కార్యకలాపాలను తమ స్నేహితులు, కుటుంబ సభ్యులు అర్థం చేసుకొనేలా సహాయం చేయడానికి విద్యార్థులు ఉపయోగించవచ్చు.

10వ భాగం: ఇంటింటి పరిచర్యలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం

ఒక బైబిలు విద్యార్థి బాప్తిస్మం తీసుకొనని ప్రచారకునిగా అయ్యేందుకు అర్హుడని పెద్దలు నిర్ణయించినప్పుడు, ఆయన సంఘంతో కలిసి బహిరంగ ప్రకటనా పనిలో భాగం వహించడం ప్రారంభించవచ్చు.—km 6/05 1వ పేజీ.

కలిసి సిద్ధపడడం

◼ సూచించబడిన ప్రతిపాదనలను తాను ఎక్కడ కనుగొనవచ్చో క్రొత్త విద్యార్థికి చూపించండి.

◼ స్థానిక క్షేత్రానికి ఉపయోగపడే సరళమైన ప్రతిపాదనను ఎంపిక చేసుకోవడానికి ఆయనకు సహాయం చేయండి.

◼ తన పరిచర్యలో బైబిలును ఉపయోగించమని ఆయనను ప్రోత్సహించండి.

◼ కలిసి పూర్వాభ్యాసం చేయండి. సాధారణంగా ఎదురయ్యే ప్రతిస్పందనలతో నేర్పుగా ఎలా వ్యవహరించాలో చూపించండి.

కలిసి ప్రకటించడం

◼ మీరిద్దరూ కలిసి సిద్ధపడిన ప్రతిపాదనను మీరు నిర్వహిస్తున్నప్పుడు విద్యార్థిని గమనించనివ్వండి.

◼ విద్యార్థి వ్యక్తిత్వాన్ని, సామర్థ్యాలను పరిగణలోకి తీసుకోండి. కొన్ని సందర్భాలలో ఆయన ప్రతిపాదనను కొంత భాగం వరకే నిర్వహించడం మంచిది కావచ్చు.

◼ క్రొత్త ప్రచారకుడు పరిచర్యలో భాగం వహించేలా ఒక క్రమ పట్టికను ఏర్పరచుకోవడానికి సహాయం చేయండి.

11వ భాగం: పునర్దర్శనాలు చేయడానికి క్రొత్త ప్రచారకులకు సహాయం చేయడం

పునర్దర్శనాల కోసం సిద్ధపడడం మొదటి సందర్శనంతోనే ప్రారంభమవుతుంది. ఆయన మాట్లాడుతున్నవారిపట్ల నిజమైన ఆసక్తి చూపించమని విద్యార్థిని ప్రోత్సహించండి. గృహస్థులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేయమని ప్రోత్సహించడానికి, వారి వ్యాఖ్యానాలను వినడానికి, వారిని కలవరపెడుతున్న విషయాలను గమనించడానికి ఆ విద్యార్థికి క్రమంగా శిక్షణ ఇవ్వండి.—km 7/05 1వ పేజీ.

పునర్దర్శనాలు చేయడానికి సిద్ధపడడం

◼ మొదటి సందర్శనాన్ని సమీక్షించి గృహస్థుడిని ఆకర్షించే రాజ్య సందేశానికి సంబంధించిన అంశాన్ని ఎంపిక చేసుకోవడానికి విద్యార్థికి సహాయం చేయండి.

◼ ఒక బైబిలు లేఖనంతోపాటు అధ్యయన ప్రచురణలోని ఒక పేరా ఉండే క్లుప్త ప్రతిపాదనకు సిద్ధపడండి.

◼ చర్చ ముగింపులో అడిగేందుకు ఒక ప్రశ్నను సిద్ధపడండి.

పట్టుదలతో పునర్దర్శించండి

◼ ఆసక్తి చూపించినవారందరినీ వెంటనే తిరిగి కలుసుకోమని విద్యార్థిని ప్రోత్సహించండి.

◼ ఇంటి దగ్గర కలవడం కష్టంగా ఉండేవారిని కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పట్టుదల అవసరమని విద్యార్థి గ్రహించడానికి సహాయం చేయండి.

◼ గృహస్థులను తిరిగి కలుసుకోవడానికి ఎలా ఏర్పాట్లు చేసుకోవచ్చో క్రొత్త ప్రచారకునికి చూపించి, మాటిచ్చిన విధంగా తిరిగి కలుసుకోవాల్సిన అవసరాన్ని ఆయన గ్రహించేందుకు సహాయం చేయండి.

12వ భాగం: బైబిలు అధ్యయనాలను ప్రారంభించి వాటిని నిర్వహించడానికి విద్యార్థులకు సహాయం చేయడం

పరిచర్యలో మంచి మాదిరిగా ఉండడం ద్వారా మీరు యేసును అనుకరించడం చాలా ప్రాముఖ్యం. మీ విద్యార్థి పరిచర్యలో మీ మాదిరిని గమనిస్తున్నప్పుడు, పునర్దర్శనాలు చేయడంలోని ఉద్దేశం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికే అని ఆయన గ్రహిస్తాడు.—km 8/05 1వ పేజీ.

బైబిలు అధ్యయనాన్ని ప్రతిపాదించడం

◼ సాధారణంగా అధ్యయన ఏర్పాటును విపులంగా చెప్పాల్సిన అవసరంలేదని విద్యార్థికి వివరించండి.

◼ అధ్యయనం చేసే ప్రచురణ నుండి ఒకటి లేక రెండు పేరాలను ఉపయోగిస్తూ అధ్యయనాన్ని ప్రదర్శించడం మంచిది.

◼ బైబిలు అధ్యయనాలను ప్రారంభించడానికి ఇవ్వబడిన సూచనలలో ఒకదానిని సమీక్షించండి, పూర్వాభ్యాసం చేయండి.—km 8/05 8వ పేజీ; km 1/02 6వ పేజీ.

బోధకులుగా ఉండేందుకు విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం

◼ దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో చేరమని విద్యార్థులను ప్రోత్సహించండి.

◼ క్రొత్త ప్రచారకులు బోధించడంలో కొద్దిమేరకు భాగం వహించే విధంగా వారు ఇతర బైబిలు అధ్యయనాలకు మీతోపాటు రావడానికి ఏర్పాటు చేయండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి