జ్ఞాపకార్థ ఆచరణకు సంబంధించిన జ్ఞాపికలు
ఈ సంవత్సరం ఏప్రిల్ 2, సోమవారం జ్ఞాపకార్థ ఆచరణ జరుగుతుంది. పెద్దలు ఈ క్రింది విషయాలమీద దృష్టి నిలపాలి:
◼ కూటం జరిగే సమయం నిర్ణయిస్తున్నప్పుడు, సూర్యాస్తమయానికి ముందే చిహ్నాలు అందించబడకుండా చూడండి.
◼ ప్రసంగీకునితోపాటు ప్రతి ఒక్కరికీ ఈ ఆచరణ జరిగే ఖచ్చితమైన సమయాన్నీ, స్థలాన్నీ తెలియజేయాలి.
◼ జ్ఞాపకార్థ ఆచరణకు తగిన రొట్టెనూ, ద్రాక్షారసాన్నీ సేకరించి, సిద్ధంగా ఉంచుకోవాలి.—కావలికోట ఫిబ్రవరి 15, 2003 14-15 పేజీలు చూడండి.
◼ ప్లేట్లూ, గ్లాసులూ, అనుకూలమైన టేబుల్, టేబుల్క్లాత్ ఇవన్నీ ఆచరణ జరిగే స్థలానికి ముందే తీసుకొచ్చి, వాటిని వాటి సంబంధిత స్థలంలో పెట్టుకోవాలి.
◼ రాజ్యమందిరాన్ని లేదా కూటం జరిగే స్థలాన్ని ముందుగానే బాగా శుభ్రపరచాలి.
◼ అటెండెంట్లనూ, చిహ్నాలు అందించే వారినీ ఎంపిక చేసుకొని వారు చేయవలసిన పనుల గురించి, అనుసరించవలసిన సరైన పద్ధతి గురించి, వస్త్రధారణ, కనబడే తీరు గౌరవప్రదంగా ఉండవలసిన అవసరత గురించి వారికి ముందుగానే చెప్పాలి.
◼ అనారోగ్యంతో ఉండి, హాజరవలేని స్థితిలోవున్న అభిషిక్తులు ఎవరైనా ఉంటే వారికి చిహ్నాలు అందించేలా తగిన ఏర్పాట్లు చేయాలి.
◼ ఒకే రాజ్యమందిరాన్ని ఒకటికన్నా ఎక్కువ సంఘాలు ఉపయోగించుకుంటున్నప్పుడు వరండాలో లేదా ప్రవేశ మార్గాల్లో, ఫుట్పాత్లపైనా, పార్కింగ్ స్థలాల్లోనూ అనవసర రద్దీలేకుండా జాగ్రత్తపడేందుకు సంఘాల మధ్య మంచి సమన్వయం ఉండాలి.