నాకు ప్రకటించే సామర్థ్యముందా?
1. ప్రకటించే సామర్థ్యం మనకు లేదని ఎందుకు అనుకోకూడదు?
1 మీకెప్పుడైనా అలా అనిపిస్తే, నిరుత్సాహపడకండి! ఎక్కువ చదువుకోవడంవల్లనో లేదా పుట్టుకతో వచ్చే ప్రత్యేకమైన సామర్థ్యంవల్లనో మనం పరిచారకులం కాము. తొలి శిష్యుల్లో కొంతమందిని “విద్యలేని పామరులు” అన్నారు. అయినప్పటికీ, వాళ్లు సువార్తను ఎంతో చక్కగా ప్రకటించగలిగారు. ఎందుకంటే, వాళ్లు యేసుక్రీస్తు చేసినట్లు చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నారు.—అపొ. 4:13; 1 పేతు. 2:21.
2. యేసు బోధించే తీరు ఎలా ఉండేది?
2 యేసు ఎలా బోధించాడు? ఆయన సరళంగా, సాధారణ ప్రజలకు ఉపయోగపడేలా, సులభంగా అర్థమయ్యేలా బోధించాడు. ఆయన ప్రశ్నలు అడిగేవాడు, ఉపమానాలు చెప్పేవాడు, ఏదైనా బోధించే ముందు అందరికీ అర్థమయ్యే ఉపోద్ఘాతంతో మొదలుపెట్టేవాడు అందుకే ప్రజలు ఆయన చెప్పేది వినడానికి ఇష్టపడేవారు. (మత్త. 6:26) ఆయన ప్రజలమీద నిజమైన ఆసక్తి చూపించాడు. (మత్త. 14:14) అంతేకాదు, యెహోవా తనకు ఈ పని అప్పజెప్పాడని, దాన్ని పూర్తి చేయడానికి శక్తినిచ్చాడని యేసుకు తెలుసు కాబట్టి ఆయన ధైర్యంగా, అధికారపూర్వకంగా మాట్లాడాడు.—లూకా 4:18.
3. మనం చక్కగా పరిచర్య చేయడానికి యెహోవా ఎలా సహాయం చేస్తున్నాడు?
3 యెహోవా సహాయం చేస్తాడు: మన మహోపదేశకుడు, సువార్త చక్కగా ప్రకటించడానికి మనకు కావాల్సిన శిక్షణను తన వాక్యం ద్వారా, సంస్థ ద్వారా ఇస్తున్నాడు. (యెష. 54:13) యేసు బోధించిన తీరు ఎలా ఉండేదో యెహోవా రాయించి పెట్టాడు కాబట్టి, ఇప్పుడు మనం దాన్ని అర్థంచేసుకుని ఆయన చేసినట్లు చేయగల్గుతున్నాం. యెహోవా తన పరిశుద్ధాత్మనిస్తూ, సంఘ కూటాల ద్వారా మనకు శిక్షణనిస్తున్నాడు. (యోహా. 14:26) వీటితోపాటు, మనం ఇంకా చక్కగా ప్రకటించడానికి, అనుభవమున్న ప్రచారకుల ద్వారా కూడా సహాయం చేస్తున్నాడు.
4. ప్రజలకు సువార్త ప్రకటించే సామర్థ్యం మనకుందని మనం ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?
4 మనకు ప్రకటించే సామర్థ్యముందని మనం నమ్మకంతో ఉండొచ్చు. ఎందుకంటే ‘మన సామర్థ్యం దేవునివలనే కలిగింది.’ (2 కొరిం. 3:5) మనం యెహోవా మీద ఆధారపడుతూ, ఆయన చేసిన ఏర్పాట్లన్నిటినీ సరిగ్గా ఉపయోగించుకుంటే మనం ‘సన్నద్ధులమై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడివుంటాం.’—2 తిమో. 3:16, 17.