కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/10 పేజీ 3
  • ప్రశ్నాభాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగం
  • మన రాజ్య పరిచర్య—2010
  • ఇలాంటి మరితర సమాచారం
  • సవరించబడిన బహిరంగ ప్రసంగాలనుండి ప్రయోజనం పొందుట
    మన రాజ్య పరిచర్య—1995
  • ప్రశ్నా భాగము
    మన రాజ్య పరిచర్య—1990
  • పురోభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగండి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఆడియో రికార్డింగ్‌లను ఎలా ఉపయోగించాలి?
    మన రాజ్య పరిచర్య—2015
మన రాజ్య పరిచర్య—2010
km 4/10 పేజీ 3

ప్రశ్నాభాగం

◼ రికార్డు చేసుకున్న ప్రసంగాలను లేదా రాసిపెట్టుకున్న కాపీలను యెహోవాసాక్షులు ఇతరులకు పంచిపెట్టడం సరైనదేనా?

బైబిలు ప్రసంగాలు విని మనం ప్రోత్సహించబడతాం, బలపర్చబడతాం. (అపొ. 15:32) అందువల్ల, అలాంటి ప్రోత్సాహకరమైన ప్రసంగాలకు రాలేకపోయినవారితో వాటిలోని అంశాలను పంచుకోవాలనుకోవడం సహజం. రికార్డు చేయగల వివిధ పరికరాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, ఒక ప్రసంగాన్ని రికార్డుచేసి దానిని ఇతరులకు ఇవ్వడం పెద్ద పనేమీ కాదు. చాలా సంవత్సరాల క్రితం ఇచ్చిన ప్రసంగాలతోపాటు, ఇటీవల ఇచ్చిన చాలా ప్రసంగాలు కొందరి దగ్గరున్నాయి. వాళ్లు సదుద్దేశంతోనే వాటిని తమ స్నేహితులు వినడానికి ఇస్తున్నారు లేదా కాపీ చేసి ఇస్తున్నారు. ఇంకొందరైతే వెబ్‌సైట్లు క్రియేట్‌చేసి, కావాలనుకుంటే ఎవరైనా సరే డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలుగా వాటిని ఆ వెబ్‌సైట్లలో పెడుతున్నారు.

వ్యక్తిగతంగా మళ్ళీ వినడానికో లేదా మన కుటుంబ సభ్యుల కొరకో ఆ ప్రసంగాలను రికార్డు చేసుకోవచ్చు. అంతేకాక, కూటాలకు హాజరు కాలేకపోతున్న వృద్ధుల కోసం, సంఘ పెద్దలు ప్రసంగాలను రికార్డుచేసే ఏర్పాటు చేయవచ్చు. అయితే, రికార్డు చేసిన ప్రసంగాలను గానీ, రాసిపెట్టుకున్న కాపీలను గానీ ఇతరులకు పంచిపెట్టకుండా ఉండేందుకు సరైన కారణాలే ఉన్నాయి.

ప్రసంగాలు తరచూ స్థానిక అవసరాలకు అనుగుణంగా ఇవ్వబడతాయి. అవి ఏ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ఇవ్వబడ్డాయో మనకు తెలియదు. కాబట్టి, రికార్డు చేసిన ప్రసంగాలను ఇతరులకు ఇవ్వడం ద్వారా వాళ్లు ఆ ప్రసంగాలను తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదముంది. అలాగే ఆ ప్రసంగాల్లోని అంశాలు తాజాగా, ఖచ్చితంగా ఉన్నాయని నమ్మేందుకు ఆ ప్రసంగాలను ఎవరు, ఎప్పుడు ఇచ్చారో మనం తెలుసుకోవడం కష్టం. (లూకా 1:1-4) అంతేకాక, రికార్డుచేసిన ప్రసంగాలను లేదా రాసిపెట్టుకున్న కాపీలను పంచిపెట్టడంవల్ల, కొందరు వారిని అమితంగా గౌరవించాలనుకునే ప్రమాదముంది. అలాగే ఆ ప్రసంగాలు ఇచ్చినవారు కూడా అలాంటి గౌరవాన్ని కోరుకునే ప్రమాదమూ ఉంది.—1 కొరిం. 3:5-7.

“తగిన కాలమున” ఆధ్యాత్మిక “ఆహారము” అందించడానికి నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు కష్టపడి పనిచేస్తున్నాడు. (లూకా 12:42) దీనిలో స్థానిక యెహోవాసాక్షుల సంఘాల్లో ఇచ్చే ప్రసంగాలతో పాటు, jw.org అధికారిక వెబ్‌సైట్‌ నుండి ఆడియో రికార్డులను డౌన్‌లోడ్‌ చేసుకునే ఏర్పాటు కూడా ఉంది. విశ్వాసంలో మనం స్థిరంగా ఉండేందుకు కావాల్సిన వాటిని నమ్మకమును బుద్ధిమంతుడునైన దాసుడు, ఆ దాసునికి ప్రాతినిథ్యంగావున్న పరిపాలక సభ అందిస్తుందనే నమ్మకంతో ఉండవచ్చు.—అపొ. 16:4, 5.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి