కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/10 పేజీలు 1-3
  • “మీరు కూడా పయినీరు సేవ చేయవచ్చు!”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “మీరు కూడా పయినీరు సేవ చేయవచ్చు!”
  • మన రాజ్య పరిచర్య—2010
  • ఇలాంటి మరితర సమాచారం
  • పయినీర్లు అర్పించి, ఆశీర్వాదాలను పొందుతారు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • పయినీరు సేవ—మీరు చేయగలరా?
    మన రాజ్య పరిచర్య—1998
  • పయినీరు పరిచర్యలోని ఆశీర్వాదాలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
  • ప్రకటించవలసిన సమయం ఇదే!
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2010
km 5/10 పేజీలు 1-3

“మీరు కూడా పయినీరు సేవ చేయవచ్చు!”

1. ఒక సహోదరి తన పయినీరు సేవ గురించి ఏమి చెప్పింది?

1 “యెహోవాతో ఎల్లప్పుడూ సన్నిహితంగా ఉండడానికి పయినీరు సేవ నాకు తోడ్పడుతోంది. మనకోసం యెహోవా, ఆయన కుమారుడు చేసిన దానికి కృతజ్ఞత చూపించే గొప్ప అవకాశంగా నేను దానిని పరిగణిస్తాను. జీవితంలో ఆనందాన్ని, సంతృప్తిని పొందడానికి అది నాకు సహాయం చేస్తోంది” అని మేరీ చెప్పింది. ఆమె 42 సంవత్సరాల పాటు నిస్వార్థ పయినీరుగా సేవచేస్తూ ఇండియాలోని వేర్వేరు ప్రాంతాల్లో సాక్ష్యమిచ్చింది. పూర్తికాల సేవలో ఉన్నవారి ఫలభరితమైన జీవితం గురించి ఆలోచిస్తూ, “మీరు కూడా పయినీరు సేవ చేయవచ్చు” అని ఎవరో ఒకరు మీతో అనే ఉంటారు.

2. ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల మనకెందుకు అధిక సంతృప్తి కలుగుతుందో వివరించండి.

2 సంతృప్తికరమైన జీవితం: మన మాదిరికర్తయైన యేసు తన తండ్రి చిత్తం చేస్తూ, ఎంతో సేదదీర్పును పొందాడు. (యోహా. 4:34) కాబట్టి యెహోవా ఆరాధనకు సంబంధించిన పనులు చేయడంలోనే నిజమైన సంతృప్తి ఉంటుందని యేసు తన శిష్యులకు హృదయపూర్వకంగా చెప్పాడు. యెహోవా ఆమోదించే పనులు చేస్తే మనకు సంతృప్తి కలుగుతుంది. అంతేగాక ఇతరులకు సహాయపడడానికి మన సమయాన్ని, శక్తిని, వనరుల్ని ఉపయోగిస్తే మన ఆనందం రెట్టింపవుతుంది.—అపొ. 20:31, 35.

3. పరిచర్యలో ఎక్కువ సమయం గడిపితే ఎలాంటి ఆనందాన్ని పొందవచ్చు?

3 మనం పరిచర్యలో ఎంత ఎక్కువ సమయం గడిపితే, బైబిలు అధ్యయనాలు ప్రారంభించి, వాటిని నిర్వహించే ఆనందాన్ని అనుభవించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. మన క్షేత్రంలోని గృహస్థులకు ఆసక్తి లేదని మనకు అనిపించినా, పయినీరు సేవ ప్రారంభించి అనుభవం, ప్రావీణ్యం సంపాదించేకొద్దీ అదే క్షేత్రం మనకు మరింత ఫలవంతంగా ఉన్నట్లు అనిపించవచ్చు. పయినీరు సేవ మొదలుపెట్టిన ఒక సంవత్సరం తర్వాత హాజరయ్యే పయినీరు సేవా పాఠశాలలో నేర్చుకున్న అన్ని రకాల పద్ధతులను పయినీర్లు ఉపయోగించవచ్చు. (2 తిమో. 2:15) మనం పట్టుదలతో కొనసాగితే, ఆ తర్వాత చక్కని ఫలాలనిచ్చే సత్యపు విత్తనాలను విత్తవచ్చు.—ప్రసం. 11:6.

4. ఉత్తీర్ణులైన తర్వాత యౌవనులు దేని గురించి ఆలోచించాలి?

4 యౌవనులు: మీ హైస్కూలు విద్య ముగిసిన తర్వాత మీరేమి చేయాలో ఆలోచించారా? స్కూల్లో ఉన్నంత వరకు మీరు ఎక్కువగా స్కూలు విద్యకు సంబంధించిన వాటికే ఎక్కువ సమయం వెచ్చించారు. మీరు ఉత్తీర్ణులైన తర్వాత అప్పటివరకు స్కూలు విద్యకు కేటాయించిన సమయాన్ని ఎలా ఉపయోగించాలనుకుంటున్నారు? మీ యౌవన శక్తిని ఉద్యోగం చేయడానికి వెచ్చించే బదులు క్రమ పయినీరు సేవను లక్ష్యంగా పెట్టుకోవడానికి ప్రార్థనాపూర్వకంగా ఎందుకు ఆలోచించకూడదు? మీరు పయినీరు సేవలో, రకరకాల నేపథ్యాల నుండి వచ్చిన ప్రజలకు సాక్ష్యమివ్వడం, సమస్యలను అధిగమించడం, స్వయం క్రమశిక్షణను అలవర్చుకోవడం, బోధనా సామర్థ్యాన్ని పెంపొందించుకోవడం వంటి నైపుణ్యాలను సంపాదించుకుంటారు అవి మీ జీవితంలో ఎన్నో విధాలుగా ప్రయోజనం చేకూరుస్తాయి.

5. తల్లిదండ్రులు, సంఘంలోని వారు పయినీరు సేవ చేపట్టేలా ఎలా ప్రోత్సహించవచ్చు?

5 తల్లిదండ్రులారా, పూర్తికాల సేవను ఎంచుకునేందుకు మీరు మీ పిల్లలకు సహాయం చేస్తున్నారా? పూర్తికాల సేవ గురించి మీరు చెప్పేది, మీ మాదిరి రాజ్యసంబంధ విషయాలకు మొదటి స్థానమిచ్చేలా వారికి సహాయం చేస్తాయి. (మత్త. 6:33) స్కూలు విద్య ముగించిన వెంటనే పయినీరు సేవ చేపట్టిన సంజయ్‌ అనే సహోదరుడు ఇలా గుర్తుచేసుకుంటున్నాడు: “పయినీరు సేవ అత్యంత సంతృప్తికరమైన సేవ అని నా తల్లిదండ్రులు ఎల్లప్పుడూ అనుకునేవారు.” సంఘంలోని ప్రతీ ఒక్కరూ తమ మాటల ద్వారా, మద్దతు ద్వారా ఇతరులను ప్రోత్సహించవచ్చు. స్పెయిన్‌ దేశానికి చెందిన హోసే, “మా సంఘంలోని వారు, పయినీరు సేవ యౌవనులు చేయగల అత్యుత్తమ పని అనే భావాన్ని కలిగించారు. పయినీరు సేవ గురించి వారు చేసే వ్యాఖ్యానాలు, దాని పట్ల వారికున్న మెప్పు వాటితో పాటు వారు అందించిన ఆచరణాత్మక సహాయం వల్ల నేను సులభంగా పయినీరు సేవ ప్రారంభించగలిగాను” అని చెప్పాడు.

6. ప్రస్తుతం మనకు పయినీరు సేవ చేయాలని లేకపోతే ఏమి చేయవచ్చు?

6 ఆటంకాలను అధిగమించడం: ‘నాకు పయినీరు సేవ చేయాలని లేదు’ అని ఒకవేళ మీకు అనిపించవచ్చు. మొదట్లో అలా అనిపించినా, మీకెందుకు అలా అనిపిస్తుందో యెహోవాకు చెబుతూ, ‘పయినీరు సేవ చేయాలో వద్దో తెలియడం లేదు, కానీ నాకైతే నీ హృదయాన్ని సంతోషపెట్టాలని ఉంది’ అని ప్రార్థించండి. (కీర్త. 62:8; సామె. 23:26) ఆ తర్వాత దేవుని వాక్యం, ఆయన సంస్థ ఇచ్చే నిర్దేశాన్ని చూడండి. ఇప్పుడు క్రమ పయినీర్లుగా ఉన్న చాలామంది ముందు సహాయ పయినీరు సేవ చేస్తూ దాని “రుచి” ఏమిటో తెలుసుకున్నారు. ఆ సేవలో వారు పొందిన ఆనందం పూర్తికాల సేవను చేపట్టేలా వారిని ప్రోత్సహించింది.—కీర్త. 34:8.

7. నెలకు 70 గంటలు రిపోర్టు చేయగలుగుతామో లేదో అనే సందేహాలుంటే వాటిని మనమెలా అధిగమించవచ్చు?

7 నెలకు 70 గంటలు రిపోర్టు చెయ్యాలి కాబట్టి అలా చేయగలుగుతారో లేదో అని మీకు సందేహముంటే అప్పుడేమి చేయాలి? మీలాంటి పరిస్థితుల్లోనే ఉన్న ఇతర పయినీర్లను ఎందుకు అడగకూడదు? (సామె. 15:22) మీకు అనువుగా ఉండగల వివిధ రకాల షెడ్యూల్స్‌ వేసుకోండి. అప్పుడు సమయాన్ని అనవసరమైన పనులకు వ్యర్థం చేయకుండా, పరిచర్య కోసం సద్వినియోగం చేసుకోవడం మీరనుకున్న దానికన్నా సులభంగా ఉన్నట్లు మీరు గ్రహిస్తారు.—ఎఫె. 5:15, 16.

8. మనం అప్పుడప్పుడూ మన పరిస్థితులను ఎందుకు పరిశీలించుకుంటూ ఉండాలి?

8 మీ పరిస్థితులను మళ్ళీ ఒకసారి పరిశీలించుకోండి: మీ వ్యక్తిగత పరిస్థితులు తరచూ మారుతుంటాయి. అప్పుడప్పుడూ మీ పరిస్థితిని పరిశీలించి చూసుకోవడం మంచిది. ఉదాహరణకు మీరు త్వరలో ఉద్యోగ విరమణ పొందనైయున్నారా? పయినీరు సేవచేయడానికి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టిన కృష్ణన్‌, “నేను తీసుకున్న నిర్ణయం, నా భార్యతో కలిసి క్రమ పయినీరు సేవ ప్రారంభించేందుకు నాకు సహాయపడింది, అలాగే అవసరం ఎక్కువగా ఉన్న ప్రదేశానికి వెళ్ళి అక్కడ సేవచేసేందుకు మాకు అవకాశాన్నిచ్చింది. నేను మరే పనిలోనైనా ఇంతటి ఆధ్యాత్మిక ప్రతిఫలాన్ని లేదా ఆనందాన్ని పొందేవాణ్ణి కాదు” అని అన్నాడు.

9. వివాహ దంపతులు ఏ విషయం గురించి ఆలోచించవచ్చు?

9 కొంతమంది దంపతులు తమ పరిస్థితులను జాగ్రత్తగా పరిశీలించుకున్న తర్వాత, తమలో ఒకరు ఉద్యోగం చేస్తే సరిపోతుందనే నిర్ధారణకు వచ్చారు. నిజమే, అలా చేయాలంటే కుటుంబ సభ్యులు నిరాడంబరంగా జీవించాల్సివుంటుంది అయినా అది త్యాగార్హమే. జాన్‌ అనే ఆయన భార్య పరిచర్యలో ఎక్కువ సమయం గడపడం కోసం ఈ మధ్యే తన ఉద్యోగం విడిచిపెట్టింది. ఆయనిలా అంటున్నాడు: “నా భార్య రోజంతా ఆధ్యాత్మిక కార్యకలాపాల్లోనే మునిగివుంటుందనే విషయం కన్నా ఆనందం కలిగించేది నాకు మరేదీ లేదు.”

10. పయినీరు సేవ చేపట్టడానికి క్రైస్తవులను ఏది పురికొల్పుతుంది?

10 ప్రేమను, విశ్వాసాన్ని ప్రదర్శించడం: మనలో ఎవరమైనా చేయగల ప్రాముఖ్యమైన పనిగా యెహోవా ప్రకటనా పనిని ఏర్పాటు చేశాడు. ఈ పాత విధానం త్వరలో గతించిపోనైవుంది, యెహోవా నామాన్ని బట్టి ప్రార్థన చేసేవారు మాత్రమే రక్షించబడతారు. (రోమా. 10:13) ఆయన పట్ల హృదయపూర్వక ప్రేమ, ఆయన మన కోసం చేసిన వాటన్నింటి పట్ల కృతజ్ఞత ఉంటే, ఆయన కుమారుడు ఉత్సాహంగా ప్రకటించమని ఇచ్చిన ఆజ్ఞకు విధేయత చూపించడానికి మనం పురికొల్పబడతాం. (మత్త. 28:19, 20; 1 యోహా. 5:3) మనం అంత్యదినాల్లో జీవిస్తున్నామని నమ్మితే లోకాన్ని అమితంగా అనుభవించకుండా మిగిలివున్న సమయంలోనే పరిచర్యలో మనం చేయగలిగినదంతా చేయడానికి ప్రోత్సహించబడతాము.—1 కొరిం. 7:29-31.

11. ఎవరైనా మనతో, మీరు కూడా పయినీరు సేవ చేయవచ్చు అని అంటే దానిని ఎలా దృష్టించాలి?

11 క్రమ పయినీరు సేవ చేయడం అంటే సంస్థ నిర్దేశించిన గంటలను రిపోర్టు చేయడమని కాదుగానీ, దేవునిపై మనకు భక్తి ఉందని అర్థం. మీరు కూడా పయినీరు సేవ చేయవచ్చని ఎవరైనా మీతో అంటే దాన్ని ఒక ప్రశంసగా తీసుకొని ఇప్పటికే పయినీరు సేవలో సంతృప్తిని పొందుతున్న ఇతరుల్లాగే పయినీరు సేవ చేపట్టడానికి దాని గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి.

[2వ పేజీలోని బ్లర్బ్‌]

తల్లిదండ్రులారా, పూర్తికాల సేవను ఎంచుకునేందుకు మీరు మీ పిల్లలకు సహాయం చేస్తున్నారా?

[3వ పేజీలోని బ్లర్బ్‌]

మనలో ఎవరమైనా చేయగల ప్రాముఖ్యమైన పనిగా యెహోవా ప్రకటనా పనిని ఏర్పాటు చేశాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి