కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 11/10 పేజీలు 1-2
  • పొలాలు తెల్లబారి కోతకు వచ్చాయి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పొలాలు తెల్లబారి కోతకు వచ్చాయి
  • మన రాజ్య పరిచర్య—2010
  • ఇలాంటి మరితర సమాచారం
  • కోతపనిలో పట్టుదలతో ముందుకు కొనసాగండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ఆనందభరితులైన కోత పనివారిగా ఉండండి!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2001
  • ప్రకటనా పనికి వచ్చిన ఫలితాలు—“పొలాల్ని చూడండి, అవి కోతకు సిద్ధంగా ఉన్నాయి”
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • గొప్ప ఆధ్యాత్మిక కోతపనిలో పూర్తిగా భాగం వహించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2010
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2010
km 11/10 పేజీలు 1-2

పొలాలు తెల్లబారి కోతకు వచ్చాయి

1. ఇప్పుడు ఏ ముఖ్యమైన పని జరుగుతోంది?

1 యేసు ఒక సమరయ స్త్రీకి సాక్ష్యమిచ్చిన తర్వాత తన శిష్యులకు ఇలా చెప్పాడు, “మీ కన్నులెత్తి పొలములను చూడుడి; అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చియున్నవి.” (యోహా. 4:35, 36) అప్పుడు ఆధ్యాత్మిక కోత పని మొదలైంది, ఆ పని ప్రపంచవ్యాప్తంగా ఎంత విస్తృతంగా జరగబోతోందో యేసు గ్రహించాడు. ఆయన పరలోకంలో తాను ఉన్న స్థానం నుండి ఇప్పటికీ కోత పనిని పర్యవేక్షిస్తున్నాడు. (మత్త. 28:19, 20) ఈ పని ముగింపుకు వస్తుండగా, మరింత ఊపందుకుంటుందని అనడానికి ఎలాంటి సూచనలు ఉన్నాయి?

2. ప్రపంచవ్యాప్తంగా కోతపని ఊపందుకుంటోందని ఏవి చూపిస్తున్నాయి?

2 భూగోళవ్యాప్తంగా జరుగుతున్న కోత: 2009 సేవా సంవత్సరంలో, ప్రపంచవ్యాప్తంగా ప్రచారకుల సంఖ్య 3.2 శాతం పెరిగింది. ప్రకటనా పని నిషేధించబడిన ప్రాంతాల్లో 14 శాతం అభివృద్ధి జరిగింది. ప్రతీ నెల 76,19,000 కంటే ఎక్కువ గృహ బైబిలు అధ్యయనాలు నిర్వహించబడుతున్నాయి. ఈ సంఖ్య గత సంవత్సర ప్రచారకుల సంఖ్య కన్నా ఎంతో ఎక్కువ. అలాగే పోయిన సంవత్సరంలో నివేదించబడిన అధ్యయనాల సంఖ్య కన్నా ఇది దాదాపు ఐదు లక్షలు ఎక్కువ. ఎన్నో ప్రాంతాల్లో పని చాలా వేగంగా విస్తరిస్తోంది కాబట్టి శిక్షణ పొందిన పయినీర్లను పంపించమని చాలామంది కోరుతున్నారు. చాలా దేశాల్లో వేరే భాషలు మాట్లాడేవాళ్లు ఎంతోమంది సత్యంలోకి వస్తున్నారు. కోత ముగింపుకు రాబోతున్న సమయంలో యెహోవా ఈ పనిని వేగిరం చేస్తున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. (యెష. 60:22) మీ “పొలాల” గురించి మీరు సానుకూలంగా ఆలోచిస్తారా?

3. తమ క్షేత్రంలోని కోత పని గురించి కొంతమంది ఏమని అనుకుంటున్నారు?

3 మీ క్షేత్రంలో కోత పని: “మా క్షేత్రం అంత ఫలవంతంగా లేదు” అని కొందరు అనొచ్చు. కొన్ని క్షేత్రాలు వేరే క్షేత్రాలంత ఫలవంతంగా ఉన్నట్లు అనిపించకపోవచ్చు లేదా ఒకప్పుడు ఉన్నంత ఫలవంతంగా ఇప్పుడు లేనట్లు అనిపించవచ్చు. అందుకే కొంతమంది సాక్షులు, అలాంటి ప్రాంతాల్లో కోత పని అయిపోయిందనో, అక్కడక్కడ మిగిలివున్న ఆసక్తిగల కొంతమందిని సత్యంలోకి తీసుకువచ్చే పని మాత్రమే ఉందనో అనుకుంటారు. పరిస్థితి నిజంగా అలాగే ఉందా?

4. మన పరిచర్య పట్ల మనం ఎలాంటి సానుకూల దృక్పథాన్ని పెంచుకోవాలి, ఎందుకు?

4 కోతపని మొదలైనప్పటి నుండి అది ముగిసే వరకు ఎంతో పనివుంటుంది. “కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు. గనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి” అని యేసు చెప్పిన మాటల్ని బట్టి ఈ పని ఎంత వేగంగా చేయాలో తెలుస్తోంది. (మత్త. 9:37, 38) ఎప్పుడైనా, ఎక్కడైనా పంట విస్తారంగా ఉందంటే, దానికి పంట యజమాని అయిన యెహోవాయే కారణం. (యోహా. 6:44; 1 కొరిం. 3:6-8) అయితే, మనం చేయాల్సింది ఏమిటి? దానికి బైబిలు ఇలా చెప్తోంది, “ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తియ్యక విత్తుము.” (ప్రసం. 11:4-6) కోత పని ముగింపుకు చేరుకునే సమయం మనం ఖాళీగా ఉండాల్సిన సమయం కాదు!

5. ప్రజలు అంతగా స్పందించనట్టు కనిపించే క్షేత్రంలో మనమెందుకు ఆసక్తితో ప్రకటిస్తూ ఉండాలి?

5 కోత పని చేస్తూ ఉండండి: మన క్షేత్రాన్ని ఎన్నోసార్లు పూర్తి చేసినా, ప్రజలు అంతగా ఆసక్తి చూపించడం లేదన్నట్లు అనిపించినా మనం ఆసక్తితో, అత్యవసర భావంతో కోత పని చేయడానికి తగిన కారణాలున్నాయి. (2 తిమో. 4:2) ప్రపంచంలో అకస్మాత్తుగా చోటుచేసుకుంటున్న సంఘటనల వల్ల ప్రజల ఆలోచనా తీరులో మార్పు వస్తుంది, వాళ్లు భవిష్యత్తు గురించి గంభీరంగా ఆలోచించడం మొదలుపెడతారు. యౌవనస్థులు పెద్దవాళ్లవుతుండగా భద్రతను, మనశ్శాంతిని కోరుకుంటారు. ఇంకా కొంతమంది మనం పట్టుదలతో వెళ్లడం చూసి సత్యం తెలుసుకోవాలనుకోవచ్చు. ఒకప్పుడు ఆసక్తి చూపించని వాళ్లు ఆ తర్వాత వినడానికి ఇష్టపడవచ్చు. కావాలనే మన సందేశాన్ని వినని వాళ్లను కూడా హెచ్చరించడం అవసరం. అయితే, ఒకవేళ చాలా ప్రాంతాల్లో ప్రజలు సువార్త వినకపోవడమే కాదు మనల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లయితే, మనం ఎంతో జాగ్రత్తగా ఉండడం అవసరం.—యెహె. 2:4, 5; 3:19.

6. మన క్షేత్రంలో ప్రకటించడం కష్టంగా ఉంటే, ఆసక్తిగా ప్రకటించడానికి మనకేది సహాయం చేస్తుంది?

6 మన క్షేత్రంలో ప్రకటించడం కష్టంగా ఉంటే, ఆసక్తిగా ప్రకటించడానికి మనకేది సహాయం చేస్తుంది? ఇంటింటి పరిచర్య కాకుండా, మనం వేరే విధాలుగా అంటే దుకాణాల్లో, ఫోన్‌లో ప్రకటనా పని చేయవచ్చు. అంతేకాదు మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా వేర్వేరు విధాలుగా మాట్లాడవచ్చు. ‘నిత్యజీవంపట్ల సరైన మనోవైఖరిగల వాళ్ల’ కోసం వెదుకుతున్నప్పుడు మనం నేర్పుతో, వివేచనతో వ్యవహరించవచ్చు. (అపొ. 13:48, NW) మనం వేర్వేరు సమయాల్లో అంటే సాయంకాలాల్లో లేదా ప్రజలు ఎక్కువగా ఇళ్లల్లో ఉండే సమయాల్లో పరిచర్య చేయవచ్చు. ఎక్కువమందికి సువార్త చెప్పడానికి మనం ఒక కొత్త భాష నేర్చుకోవడానికి ప్రయత్నించవచ్చు. క్రమంగా పయినీరు సేవ చేస్తే మనం ఎక్కువగా పరిచర్య చేయగలుగుతాం. ప్రచారకులు ఎక్కువగా లేని ప్రాంతాలకు కూడా మనం వెళ్లవచ్చు. కోతపని పట్ల మనకు సరైన దృక్పథముంటే ఈ ప్రాముఖ్యమైన పనిని మనం వీలైనంత ఎక్కువగా చేయడానికి ప్రయత్నిస్తాం.

7. మనం ఎప్పటివరకు సమకూర్చే పనిచేయాలి?

7 పంట కూర్చడానికి రైతులకు ఎక్కువ సమయముండదు. కాబట్టి ఆ పని పూర్తయ్యేవరకు వాళ్లు తీరిగ్గా కూర్చోరు, లేదా మెల్లగా చేస్తూ ఉండరు. ఆధ్యాత్మిక కోత పనికి కూడా ఇదే వర్తిస్తుంది. మనం ఎప్పటివరకు సమకూర్చే పనిచేయాలి? “యుగసమాప్తి” కాలం అంతట్లో, “అంతము” వరకు చేస్తూనే ఉండాలి. (మత్త. 24:14; 28:20) యెహోవా ప్రధాన సేవకునిలా మనం కూడా మనకు అప్పగించబడిన పనిని పూర్తిచేయాలని కోరుకుంటాం. (యోహా. 4:34; 17:4) కాబట్టి మనందరం అంతం వచ్చేవరకు ఆసక్తితో, సానుకూల దృక్పథంతో, సంతోషంగా పరిచర్య చేద్దాం. (మత్త. 24:13) కోత పని ఇంకా పూర్తి కాలేదని మనందరం గుర్తుంచుకోవాలి.

[2వ పేజీలోని బ్లర్బ్‌]

కోతపని మొదలైనప్పటి నుండి అది ముగిసే వరకు ఎంతో పనివుంటుంది

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి