సంఘంలోవున్న పాత ప్రచురణలను ఉపయోగించుకోండి
చాలా సంఘాల్లో పాత ప్రచురణలు అలాగే ఉండిపోయాయి. వాటిని మీ సొంత దైవపరిపాలనా లైబ్రరీలో ఉంచుకోవడానికి ఎందుకు తీసుకోకూడదు? మీరు మంచి అభివృద్ధి సాధిస్తున్న విద్యార్థితో బైబిలు అధ్యయనం నిర్వహిస్తున్నారా? అయితే, వాళ్లను కూడా ఈ పాత ప్రచురణలు తీసుకుని, తమ సొంత లైబ్రరీని తయారు చేసుకోమని ప్రోత్సహించండి. దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పర్యవేక్షకుడు సంఘంలో నిలవ ఉండిపోయిన పాత ప్రచురణలు రాజ్యమందిరంలోని లైబ్రరీలో ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఈ ప్రచురణలకున్న విలువ తగ్గిపోలేదు. వాటిని సంఘంలోని సాహిత్య విభాగంలో ఉంచేసే బదులు, మనం వాటిని ఉపయోగించుకోగలిగితే మంచిది.