ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
జూలైలో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“ప్రజలు బైబిలును పరిశుద్ధ గ్రంథంగా గౌరవిస్తారు. బైబిలు గ్రంథకర్త ఎవరని మీరు అనుకుంటున్నారు? [వాళ్లేమి చెప్తారో వినండి.] దాని గ్రంథకర్త గురించి, అదెందుకు రాయబడింది అనేదాని గురించి స్వయంగా బైబిలు ఏమి చెబుతోందో మీకు చూపించమంటారా?” గృహస్థులు ఆసక్తి చూపిస్తే 2 తిమోతి 3:16, 17 చదవండి. తర్వాత, జూలై - సెప్టెంబరు కావలికోటను గృహస్థునికి ఇచ్చి 15వ పేజీలోని నాలుగవ ఉపశీర్షిక కిందవున్న సమాచారాన్ని చదివి, కలిసి చర్చించండి. పత్రిక తీసుకుంటారేమో అడిగి, మళ్లీ వచ్చి తర్వాతి ప్రశ్నకు జవాబు పరిశీలించడానికి ఏర్పాట్లు చేసుకోండి.
కావలికోట జూలై - సెప్టెంబరు
“ఈ రోజుల్లో విడాకులు తీసుకోవడం చాలా మామూలు విషయమైపోయింది. దీనికి ముఖ్య కారణం ఏమైవుంటుందని మీరు అనుకుంటున్నారు? [వాళ్లేమి చెప్తారో వినండి.] సహాయకరంగా ఉన్నట్లు చాలామంది దంపతులు తెలుసుకున్న ఒక సలహాను చూపించమంటారా? [గృహస్థులు ఒప్పుకుంటే, 1 కొరింథీయులు 10:24 చదవండి.] ఈ పత్రిక, భార్యాభర్తలు సాధారణంగా చేసే ఆరు ఫిర్యాదుల గురించి ప్రస్తావిస్తుంది. అంతేకాదు, వాటికి సంబంధించిన లేఖన సూత్రాలను పాటించడం ఎలా సహాయకరంగా ఉంటుందో చూపిస్తుంది.”