కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/11 పేజీ 1
  • ‘కరుణాచిత్తులుగా’ ఉండండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ‘కరుణాచిత్తులుగా’ ఉండండి
  • మన రాజ్య పరిచర్య—2011
  • ఇలాంటి మరితర సమాచారం
  • “కరుణాచిత్తులై” ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • వాత్సల్యంతో కూడిన కనికరంగలవారై ఉండండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • యెహోవాలా కనికరం చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2017
  • యెహోవా కనికరముతో పరిపాలిస్తాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1997
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2011
km 7/11 పేజీ 1

‘కరుణాచిత్తులుగా’ ఉండండి

1. ప్రజలు నేడు దేని కోసం పరితపిస్తున్నారు?

1 చరిత్రలో ఎన్నడూ లేనంతగా నేడు చాలామంది, కనికరంతో చేసే సహాయం కోసం పరితపిస్తున్నారు. లోక పరిస్థితులు రోజురోజుకీ దిగజారడం వల్ల ఎక్కువమందిలో అసంతోషం, కృంగుదల, నిరాశ చోటుచేసుకుంటున్నాయి. కోట్లాదిమందికి సహాయం అవసరం. క్రైస్తవులముగా మనం పొరుగువాళ్ల పట్ల నిజమైన శ్రద్ధ చూపించే స్థితిలో ఉన్నాం. (మత్త. 22:39; గల. 6:10) నిజమైన శ్రద్ధ ఎలా చూపించవచ్చు?

2. మనం కనికరాన్ని శ్రేష్ఠమైన విధంగా ఎలా చూపించవచ్చు?

2 కనికరంతో కూడిన పని: దేవుడు మాత్రమే నిజమైన, శాశ్వతమైన ఓదార్పు ఇవ్వగలడు. (2 కొరిం. 1:3, 4) మనం కూడా తనలా ‘కరుణాచిత్తులుగా’ ఉండాలని యెహోవా కోరుతున్నాడు, పొరుగువాళ్లకు రాజ్య సువార్త చెప్పమని ఆయన మనకు ఆజ్ఞాపించాడు. (1 పేతు. 3:8) బాధలు అనుభవిస్తున్న మానవులకు దేవుని రాజ్యమే నిజమైన నిరీక్షణ. కాబట్టి దాని గురించి మనం ఆసక్తిగా ప్రకటించడం ద్వారా మాత్రమే “నలిగిన హృదయముగలవారిని” శ్రేష్ఠమైన విధంగా ఓదార్చగలుగుతాం. (యెష. 61:1) తన ప్రజల మీద కనికరంతో యెహోవా త్వరలో దుష్టత్వాన్ని పూర్తిగా తీసివేసి నీతి నివసించే నూతన లోకాన్ని స్థాపిస్తాడు.—2 పేతు. 3:13.

3. మనం ప్రజలను యేసు చూసినట్లే ఎలా చూడవచ్చు?

3 ప్రజలను యేసు చూసినట్లు చూడండి: పెద్ద జనసమూహాలకు ప్రకటిస్తున్నప్పుడు కూడా యేసు వాళ్లను కేవలం ఒక గుంపులా చూడలేదు. వాళ్లలో ప్రతి ఒక్కరికీ దేవునితో మంచి సంబంధాన్ని ఏర్పర్చుకోవడానికి సహాయం అవసరమని ఆయన అర్థం చేసుకున్నాడు. సరైన దారిలో నడిపించేందుకు కాపరిలేని గొర్రెల్లా వాళ్లు ఉన్నారు. ఆయన వాళ్లను చూసి చలించిపోయాడు, అందుకే ఓపిగ్గా వాళ్లకు బోధించాడు. (మార్కు 6:34) ప్రజలను మనం యేసు చూసినట్లు చూస్తే వ్యక్తిగతంగా వాళ్ల మీద నిజమైన కనికరం చూపించాలని కోరుకుంటాం. అది మన మాటల్లో, హావభావాల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. మనం ప్రకటనా పనికే ప్రాధాన్యతనిస్తాం, వ్యక్తుల అవసరాలకు తగ్గట్టుగా మాట్లాడతాం.—1 కొరిం. 9:19-23.

4. మనం కనికరాన్ని ఎందుకు చూపించాలి?

4 అన్ని జనాంగాల నుండి వచ్చిన పెద్ద జనసమూహం రాజ్య సందేశానికి చక్కగా స్పందిస్తోంది. వాళ్ల మీద చూపిస్తున్న శ్రద్ధను బట్టి సేదదీర్పు పొందుతున్నారు. మనం కనికరం చూపిస్తూవుంటే, కనికరంగల మన దేవుడైన యెహోవాకు ఘనత తీసుకొస్తాం, ఆయనను సంతోషపరుస్తాం.—కొలొ. 3:12.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి