ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
ఆగస్టులో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“దేవుడు ఉన్నాడని చాలామంది నమ్ముతారు. ఆయనకు ఒక పేరు ఉందని మీరు అనుకుంటున్నారా? [వాళ్లేమి చెప్తారో వినండి.] దాని గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో మీకు చూపించమంటారా? [గృహస్థులు ఆసక్తి చూపిస్తే కీర్తన 83:18 చదవండి.]” 22వ పేజీలోని మూడవ ఉపశీర్షిక కిందవున్న సమాచారాన్ని చదివి, కలిసి చర్చించండి.
కావలికోట జూలై - సెప్టెంబరు
“ఈ రోజుల్లో చాలామంది విడాకులు తీసుకుంటున్నారు, వివాహ జీవితం విజయవంతం అవడానికి ఏది సహాయం చేస్తుందంటారు? [వాళ్లేమి చెప్తారో వినండి.] వివాహానికి సంబంధించి లేఖనాల్లోవున్న ఒక సూత్రాన్ని మీకు చూపించమంటారా? [గృహస్థులు ఒప్పుకుంటే, మత్తయి 19:4-6 చదవండి.] తమ వివాహ జీవితంలో ఎదురయ్యే సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోవడానికి భార్యాభర్తలకు సహాయం చేసే లేఖన సూత్రాలను ఈ పత్రిక చర్చిస్తుంది.”