ప్రశ్నాభాగం
◼ గుమ్మం దగ్గరే బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రార్థించాలా?
బైబిలు అధ్యయనానికి ముందు, ముగించిన తర్వాత ప్రార్థన చేస్తే చాలా ప్రయోజనాలు ఉంటాయి. మన చర్చ మీద పరిశుద్ధాత్మ సహాయం ఇవ్వమని ప్రార్థనలో యెహోవాను అడుగుతాం. (లూకా 11:13) దానివల్ల, బైబిలు అధ్యయనాన్ని తను ఎంత గంభీరంగా తీసుకోవాలో, ఎలా ప్రార్థించాలో విద్యార్థి తెలుసుకుంటాడు. (లూకా 6:40) అందుకే వీలైనంత త్వరలోనే విద్యార్థితో కలిసి ప్రార్థించడం మంచిది. అయితే పరిస్థితులన్నీ ఒకేలా ఉండవు కాబట్టి గుమ్మం దగ్గరే బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు ప్రార్థించాలా వద్దా అనేది ప్రచారకుడు వివేచనతో నిర్ణయించుకోవాలి.
పరిసరాలను మనసులో ఉంచుకోవడం చాలా అవసరం. కొంత ఏకాంతత ఉంటే క్రమంగా జరిగే బైబిలు అధ్యయనం మొదట్లో, చివర్లో నేర్పుతో చిన్న ప్రార్థన చేయవచ్చు. అలా చేస్తున్నప్పుడు ఇతరుల దృష్టి మళ్లే అవకాశమున్నా లేదా విద్యార్థికి ఇబ్బందిగా ఉంటుందని అనిపించినా, ఇంకాస్త ఏకాంత ప్రదేశంలో అధ్యయనం జరిగేంతవరకు ప్రార్థించకపోవడమే మంచిది. అధ్యయనం ఎక్కడ జరుగుతున్నా ఎప్పుడు ప్రార్థన చేయడం మొదలుపెట్టాలో నిర్ణయించడానికి మంచి వివేచన అవసరం.—మార్చి 2005 మన రాజ్య పరిచర్యలోని 8వ పేజీ చూడండి.