ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
మే నెలలో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“మీరు రోజూ దేవునికి ప్రార్థిస్తారా?” వాళ్లేమి చెప్తారో వినండి. వాళ్లకు ఆసక్తి ఉందనిపిస్తేనే చర్చను కొనసాగించండి. “దేవునికి దగ్గరవ్వడానికి ప్రార్థన ఎలా సహాయం చేస్తుందో మీకు తెలుసుకోవాలని ఉందా?” వాళ్లేమి చెప్తారో వినండి. తర్వాత, కావలికోట ఏప్రిల్ - జూన్ సంచికను చూపించి, 18వ పేజీలోని మొదటి ఉపశీర్షిక కిందవున్న సమాచారాన్ని, అక్కడ ఉన్న లేఖనాల్లో కనీసం ఒకదాన్ని పరిశీలించండి. పత్రిక ఇచ్చి, తర్వాతి ప్రశ్న చర్చించడానికి ఏర్పాటు చేసుకోండి.
కావలికోట ఏప్రిల్ - జూన్
“ఈ మధ్యకాలంలో ప్రకృతి విపత్తులు ఎడతెరిపి లేకుండా సంభవిస్తున్నాయి, ఎందుకని మీరనుకుంటున్నారు? [వాళ్లేమి చెప్తారో వినండి.] ఆసక్తికరమైన విషయమేమిటంటే, ప్రకృతి విపత్తులు ఎక్కువగా ఉండే కాలం గురించి బైబిలు ముందే చెప్పింది. దానిని మీకు చదివి వినిపించమంటారా? [గృహస్థులు ఆసక్తి చూపిస్తే, మత్తయి 24:7, 8 చదవండి.] ప్రకృతి విపత్తులు రానురాను ఎందుకు ఎక్కువౌతున్నాయి? వాటితో దేవుడు మనలను శిక్షిస్తున్నాడా? వాటన్నిటినీ దేవుడు త్వరలోనే తీసివేస్తాడని మనమెందుకు నమ్మవచ్చు? అనే ప్రశ్నలకు ఈ పత్రికలో జవాబులున్నాయి.”