మీ కష్టానికి మంచి ఫలితాన్ని చూడండి
1. పరిచర్యలో మన ఆసక్తి సన్నగిల్లేలా చేసేదేమిటి?
1 ‘కష్టానికి మంచి ఫలితం చూసే విధంగా’ దేవుడు మనిషిని తయారుచేశాడు. (ప్రసం. 2:24, NW) పరిచర్యలో మంచి ఫలితాలు రానప్పుడు నిరుత్సాహపడితే మన సంతోషం, ఆసక్తి సన్నగిల్లవచ్చు. అనుకూల దృక్పథం కలిగివుండడానికి మనకేది సహాయం చేస్తుంది?
2. పరిచర్యలో వచ్చే ఫలితాల గురించి ఎందుకు అతిగా ఆశించకూడదు?
2 మరీ ఎక్కువగా ఆశించకండి: యేసు బోధకు ఎక్కువమంది స్పందించకపోయినా ఆయన పరిచర్య సంపూర్ణమైందని గుర్తుంచుకోండి. (యోహా. 17:4) చాలామంది హృదయాలు, విత్తనం లాంటి రాజ్య సందేశాన్ని గ్రహించలేని స్థితిలో ఉంటాయని విత్తువాని గురించిన ఉపమానంలో యేసు ముందే చెప్పాడు. (మత్త. 13:3-8, 18-22) అయినా, మనం శ్రద్ధగా ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి.
3. ప్రజలు విన్నా వినకపోయినా మనం మంచి ఫలితాలు ఎలా సాధించవచ్చు?
3 మనం మంచి ఫలితాలు ఎలా సాధించవచ్చు? రాజ్య సందేశాన్ని వినేవాళ్ళు ‘ఫలిస్తారు’ అని యేసు ఆ ఉపమానంలో చెప్పాడు. (మత్త. 13:23) గోధుమ దంటు మొలకెత్తి ఎదిగిన తర్వాత, అది చిన్న గోధుమ దంట్లను కాదు గానీ కొత్త విత్తనాలను ఉత్పన్నం చేస్తుంది. కాబట్టి, మంచి ఫలితాలు సాధించే క్రైస్తవులు కొత్త శిష్యులను కాదు గానీ ఎన్నో కొత్త రాజ్య విత్తనాలను ఉత్పన్నం చేస్తారు అంటే రాజ్యం గురించి ప్రకటిస్తూ పదేపదే రాజ్య విత్తనాలను విత్తుతారు. దానివల్ల ఎంతో “మంచి” జరిగి, ప్రజలు విన్నా వినకపోయినా మనకు సంతృప్తి లభిస్తుంది. యెహోవా నామాన్ని పరిశుద్ధపర్చడంలో మనం కూడా మనం చేయగలిగింది చేస్తున్నాం. (యెష. 43:10-12; మత్త. 6:9, 10) దేవుని జతపనివాళ్ళమయ్యే మహత్తరమైన అవకాశాన్ని పొందుతున్నాం. (1 కొరిం. 3:9) అలాంటి “జిహ్వాఫలము” యెహోవాను సంతోషపెడుతుంది.—హెబ్రీ. 13:15, 16.
4. మన పరిచర్యలో మనకు తెలియకుండానే ఎలాంటి ఫలితాలు రావచ్చు?
4 అంతేగాక, మన కష్టానికి తగిన ఫలితం వెంటనే కనిపించకపోవచ్చు. యేసు బోధలు విన్న కొంతమంది, ఆయన భూపరిచర్య ముగించిన తర్వాతే ఆయన శిష్యులుగా అయ్యుంటారు. అలాగే మనం విత్తిన రాజ్య విత్తనం ఒక వ్యక్తి హృదయంలో వేళ్ళూనుకోవడానికి, ఎదగడానికి చాలా సమయమే పట్టవచ్చు, ఆ తర్వాత మనకు తెలియకుండానే ఆయన సత్యంలోకి వచ్చివుండవచ్చు. నిజానికి, మన పరిచర్య ఎంతో మంచిని చేకూరుస్తుంది. కాబట్టి మనం ‘బహుగా ఫలిస్తూ,’ యేసు శిష్యులమని నిరూపించుకుందాం.—యోహా. 15:8.