మన అధికారిక వెబ్సైట్—వ్యక్తిగత, కుటుంబ అధ్యయనం కోసం ఉపయోగించండి
ఆన్లైన్లో తాజా పత్రికలు చదవండి: కావలికోట, అవేక్! (ఆంగ్లం) పత్రికలు సంఘాలకు చేరడానికి కొన్ని వారాల ముందే వాటిని ఆన్లైన్లో చదవండి. పత్రిక ఆడియో రికార్డింగులను కూడా వినండి.—“ప్రచురణలు” కింద “పత్రికలు” చూడండి.
వెబ్సైట్లో మాత్రమే ఉండే సమాచారాన్ని చదవండి: “For Young People” (మన యువతకు), “My Bible Lessons” (బైబిలు పాఠం నేర్చుకుందాం), “For Family Review” (కుటుంబ సమీక్ష కోసం), “Young People Ask” (యువత ఇలా అడుగుతోంది) వంటి ఆర్టికల్లు ఇకనుండి వెబ్సైట్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో ఉన్న ఈ సమాచారాన్ని వ్యక్తిగత, కుటుంబ అధ్యయనాల్లో పరిశీలించండి.—“Bible Teachings” (బైబిలు బోధలు) కింద “Children” (పిల్లలు) లేదా “Teenagers” (టీనేజర్లు) చూడండి.
మన తాజా వార్తలు తెలుసుకోండి: ప్రపంచవ్యాప్తంగా మన పని ఎలా ప్రగతి సాధిస్తుందో చూపించే ప్రోత్సాహకరమైన నివేదికలను, అనుభవాలను చదవండి, వీడియో క్లిప్పింగ్‌లను చూడండి. ప్రకృతి విపత్తులను, హింసలను ఎదుర్కొంటున్న సహోదరులకు సంబంధించిన నివేదికలు తెలుసుకుంటే, సహోదరులు ఎదుర్కొంటున్న ఆ సమస్యల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయవచ్చు. (యాకో. 5:16)—“News” (వార్తలు) చూడండి.
ఆన్లైన్ లైబ్రరీలో పరిశోధన చేయండి: ఇది మీ భాషలో ఉంటే, మీ కంప్యూటర్లో లేదా మొబైల్ ఫోన్లో వెబ్సైట్ తెరిచి ఆన్లైన్లో దినవచనం చదవండి లేదా మన ఇటీవలి ప్రచురణల్లో పరిశోధన చేయండి.—“ప్రచురణలు” కింద “ఆన్లైన్ లైబ్రరీ” చూడండి లేదా అడ్రస్ ఫీల్డ్‌లో www.wol.jw.org అని టైప్ చేయండి.
[4వ పేజీలోని డయాగ్రామ్]
(For fully formatted text, see publication)
ఇలా చేసి చూడండి
1 చిత్రం మీద లేదా “Download” లింక్ మీద క్లిక్ చేయండి. PDF డాక్యుమెంట్ విండోలో చిత్రం కనిపిస్తుంది. దీన్ని ప్రింట్ తీసి మీ పిల్లలకిచ్చి రంగులతో నింపమని, చుక్కలు కలపమని, లేదా పూరించమని చెప్పండి.
2 “ప్లే” మీద క్లిక్ చేసి వీడియో చూడండి.