కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 1/13 పేజీ 1
  • సంపూర్ణంగా సాక్ష్యమివ్వండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సంపూర్ణంగా సాక్ష్యమివ్వండి
  • మన రాజ్య పరిచర్య—2013
  • ఇలాంటి మరితర సమాచారం
  • సమగ్ర సాక్ష్యమివ్వాలనే కృతనిశ్చయంతో ఉందాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2008
  • ‘పూర్తిగా సాక్ష్యమివ్వడానికి’ కష్టపడి పనిచెయ్యండి
    మన రాజ్య పరిచర్య—2003
  • సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి శిక్షణ పొందడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • ప్రకటించి సంపూర్ణంగా సాక్ష్యమివ్వండి
    మన రాజ్య పరిచర్య—2003
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2013
km 1/13 పేజీ 1

సంపూర్ణంగా సాక్ష్యమివ్వండి

1. పరిచర్య చేసే విషయంలో పౌలు ఎలా మంచి ఆదర్శంగా ఉన్నాడు?

1 “పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము.” (2 తిమో. 4:5) అపొస్తలుడైన పౌలు ఆ మాటల్ని తిమోతికి ధైర్యంగా చెప్పగలిగాడు. ఎందుకంటే, సా.శ. 47 నుండి 56 మధ్యకాలంలో పౌలు మూడు మిషనరీ యాత్రలు పూర్తిచేశాడు. పౌలు, “సమగ్రంగా” లేక సంపూర్ణంగా సాక్ష్యమిచ్చాడని అపొస్తలుల కార్యముల పుస్తకంలో తరచూ చదువుతాం. (అపొ. 23:11; 28:23, NW) మనం పౌలులా సాక్ష్యమివ్వాలంటే ఏమి చేయాలి?

2. ఇంటింటి పరిచర్యలో ఎలా సంపూర్ణంగా సాక్ష్యమివ్వవచ్చు?

2 ఇంటింటికి: ఇప్పటివరకూ సువార్త వినని వాళ్లను కలవాలంటే, మనం వేర్వేరు సమయాల్లో ప్రకటించాల్సి రావచ్చు. బహుశా కొందరు సాయంకాలాల్లో లేక వారాంతాల్లో ఇంటిదగ్గర ఉంటారు. అంత తరచుగా పనిచేయని క్షేత్రాల్లో సాక్ష్యమిచ్చినప్పుడు, ఆసక్తి చూపించే కొత్తవాళ్లను కనుగొనవచ్చు. ప్రతీ ఇంట్లో కనీసం ఒక్కరితోనైనా మాట్లాడడానికి ప్రయత్నించాలి. ఒకవేళ ఇంటికి తాళం వేసివుంటే, వాళ్లు కలిసే వరకు మనం మళ్లీమళ్లీ వెళ్తుండాలి. అయినా కలవకపోతే, ఒక ఉత్తరం రాసో, ఫోన్‌ చేసో సాక్ష్యమిస్తే మంచి ఫలితాలు వస్తాయి.

3. బహిరంగంగా, అలాగే రోజువారీ పనులు చేసుకుంటున్నప్పుడు సాక్ష్యమిచ్చేందుకు మీకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి?

3 బహిరంగంగా, అవకాశం దొరికినప్పుడల్లా: నేడు, యెహోవా సేవకులు వినేవాళ్లందరికీ నిజమైన ‘జ్ఞానాన్ని’ తెలియజేస్తున్నారు. కొన్నిసార్లు అది ‘వీధుల్లో’ కావచ్చు, ఇంకొన్నిసార్లు ‘సంతవీధుల్లో’ లేదా మార్కెట్‌ స్థలాల్లో కావచ్చు. (సామె. 1:20, 21) మనం రోజువారీ పనులు చేసుకుంటున్నప్పుడు, సాక్ష్యమిచ్చే అవకాశాల కోసం చూస్తున్నామా? వాక్యం బోధించేందుకు “ఆతురత” కలిగివున్నామా? (అపొ. 18:5) అలాగైతే, ‘పరిచర్యను సంపూర్ణంగా జరిగించాల్సిన’ మన బాధ్యతను నిర్వర్తిస్తున్నట్లే.—అపొ. 10:42; 17:17; 20:20, 21, 24.

4. ప్రార్థన చేయడం, ధ్యానించడం సంపూర్ణంగా సాక్ష్యమివ్వడానికి ఎలా సహాయం చేస్తాయి?

4 స్వతహాగా ఉన్న బిడియం వల్ల, పరిమితుల వల్ల కొన్నిసార్లు మనం సాక్ష్యమివ్వడానికి వెనుకాడుతుండవచ్చు. అయితే, మన పరిమితుల్ని యెహోవా తప్పకుండా అర్థం చేసుకుంటాడు. (కీర్త. 103:14) అయినప్పటికీ, అలాంటి సందర్భాల్లో మాట్లాడేందుకు కావాల్సిన ధైర్యం కోసం యెహోవాకు ప్రార్థించవచ్చు. (అపొ. 4:29-31) ఇంకా, మనం అధ్యయనం చేసుకుంటున్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు సువార్తకున్న గొప్ప విలువను అర్థంచేసుకోవడానికి కృషిచేయవచ్చు. (ఫిలి. 3:8) అలాచేస్తే, మనం దాన్ని ఉత్సాహంగా ప్రకటించగలుగుతాం!

5. యోవేలు ప్రవచన నెరవేర్పులో మనమెలా భాగం వహించవచ్చు?

5 యెహోవా భయంకరమైన మహాదినం సమీపించినప్పుడు, ఆయన ప్రజలు ఏమాత్రం పక్కదారిపట్టకుండా ప్రకటనా పనిలో “చక్కగా” ముందుకు సాగిపోతారని యోవేలు ప్రవచనం ముందే చెప్పింది. (యోవే. 2:2, 7-9) మళ్లీ ఎప్పుడూ జరగని ఈ సాక్ష్యపు పనిలో మనం పూర్తిగా భాగం వహిద్దాం!

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి