డు యెహోవా ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు?
బ్రోషుర్ను ఎలా ఉపయోగించాలి? బైబిలు విద్యార్థులను సంస్థవైపు నడిపించడానికి రూపొందించిన కొత్త బ్రోషుర్
1. నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు? బ్రోషుర్ను ఏ ఉద్దేశంతో రూపొందించారు?
1 నేడు యెహోవా ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తున్నారు? అనే కొత్త బ్రోషుర్ను ఉపయోగించడం మొదలుపెట్టారా? (1) యెహోవాసాక్షులమైన మన గురించి, (2) మన కార్యకలాపాల గురించి, (3) మన సంస్థ పనితీరు గురించి ఎక్కువగా తెలుసుకునేలా బైబిలు విద్యార్థులకు సహాయం చేయడానికే ఈ బ్రోషుర్ను రూపొందించారు. ఇందులోని పాఠాలన్నీ ఒక పేజీ అంతే ఉంటాయి. కాబట్టి ప్రతీ బైబిలు అధ్యయనం చివర్లో, ఐదు నుండి పది నిమిషాలు కేటాయిస్తే ఒక పాఠం చర్చించవచ్చు.
2. ఈ బ్రోషుర్ను ఎలా రూపొందించారు?
2 దాన్నెలా రూపొందించారు? ఈ బ్రోషుర్లో మొత్తం మూడు భాగాలున్నాయి. పై పేరాలో చూసినట్లు, వాటిలో ఒక్కో భాగం యెహోవా సంస్థకు సంబంధించిన ఒక్కో అంశం గురించి వివరిస్తుంది. ఈ బ్రోషుర్లో 28 పాఠాలున్నాయి, ప్రతీ పాఠం శీర్షిక ప్రశ్న రూపంలో ఉంటుంది. ఆ ప్రశ్నకు జవాబు ముద్దక్షరాల్లోవున్న ఉపశీర్షికల్లో ఉంటుంది. ఈ బ్రోషుర్లో, 50 కన్నా ఎక్కువ దేశాలకు సంబంధించిన చిత్రాలు, వాటి కింద ఆ దేశాల పేర్లు ఉన్నాయి. మన పని ప్రపంచవ్యాప్తంగా జరుగుతోందని అవి చూపిస్తాయి. చాలా పాఠాల్లో, “ఇంకా తెలుసుకోవడానికి . . . ” అనే బాక్సు ఇచ్చారు. మీ విద్యార్థిని ఏయే విషయాల్లో ప్రోత్సహించవచ్చో అందులో ఉంటుంది.
3. కొత్త బ్రోషుర్ను ఎలా ఉపయోగించవచ్చు?
3 ఎలా ఉపయోగించాలి? పాఠం శీర్షికలోని ప్రశ్నను చూపించి మాట్లాడడం మొదలుపెట్టవచ్చు. తర్వాత, పాఠాన్ని కలిసి చదువుతూ ముద్దక్షరాల్లో ఉన్న ఉపశీర్షికలను నొక్కిచెప్పండి. చివర్లో, కింద ఉన్న ప్రశ్నలను చర్చించండి. పాఠం మొత్తం ఒకేసారి చదివి చర్చించవచ్చు లేదా ఒక్కో పేరాను విడివిడిగా చదివి చర్చించవచ్చు. ఇచ్చిన లేఖనాల్లో వేటిని చదవాలో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయించుకోండి. చిత్రాలను, “ఇంకా తెలుసుకోవడానికి . . . ” అనే బాక్సును పరిశీలించడం మర్చిపోకండి. వీలైనంతవరకూ పాఠాలను ఇచ్చిన క్రమంలోనే పరిశీలించాలి. అయితే, విద్యార్థి అవసరాన్నిబట్టి అప్పుడప్పుడు వేరే పాఠాలను చర్చించడానికి వెనుకాడకండి. ఉదాహరణకు, దగ్గర్లో ఏదైనా సమావేశం జరుగుతుంటే నేరుగా 11వ పాఠం చర్చించవచ్చు.
4. ఈ కొత్త బ్రోషుర్ను అందుకోవడం మీకెందుకు సంతోషాన్నిస్తుంది?
4 బైబిలు అధ్యయనం చేస్తున్నప్పుడు, మన పరలోక తండ్రిని తెలుసుకునేలా విద్యార్థికి సహాయం చేస్తాం. అయితే, యెహోవా సంస్థ గురించి కూడా మనం విద్యార్థికి బోధించాలి. (సామె. 6:20) ఆ పనిని సులభం చేసే ఈ కొత్త బ్రోషుర్ను అందుకోవడం మనకెంత సంతోషాన్నిస్తుందో కదా!