‘విశ్వాసమందు స్థిరపడేందుకు’ వాళ్లకు సహాయం చేయండి
సమకూర్చే పనిని యెహోవా ఎంతగా ఆశీర్వదిస్తున్నాడో చూడడం మనకు చెప్పలేనంత సంతోషాన్నిస్తుంది. ప్రతీ సంవత్సరం దాదాపు రెండున్నర లక్షలమంది బాప్తిస్మం తీసుకుంటున్నారు. (ద్వితీ. 28:2) సాధారణంగా ప్రచారకులు తమ బైబిలు విద్యార్థి బాప్తిస్మం తీసుకున్న తర్వాత, అతనితో అధ్యయనం ఆపేసి వేరేవాళ్లకు సహాయం చేయాలని ఆలోచిస్తుంటారు. బాప్తిస్మం తీసుకున్న విద్యార్థులు కూడా, అధ్యయనం ఆపేసి పరిచర్యలో ఎక్కువ సమయం గడపాలని ఆలోచిస్తుంటారు. అయితే, బైబిలు విద్యార్థులకు బలమైన పునాది అవసరం. వాళ్లు క్రీస్తునందు “వేరుపారి,” ‘విశ్వాసమందు స్థిరపడాలి.’ (కొలొ. 2:6, 7; 2 తిమో. 3:12) కాబట్టి, బైబిలు విద్యార్థి బాప్తిస్మం తీసుకున్నా, బైబిలు బోధిస్తోంది పుస్తకం, దేవుని ప్రేమ పుస్తకం రెండూ పూర్తయ్యేవరకు అధ్యయనం కొనసాగించాలి.—ఏప్రిల్ 2011 మన రాజ్య పరిచర్యలో 2వ పేజీ చూడండి.