ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
జూలైలో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“మేము ఈ రోజు మా పొరుగువాళ్లను కలిసి కాసేపు మాట్లాడుతూ, ఈ ప్రాముఖ్యమైన ప్రశ్నను చర్చిస్తున్నాం. [జూలై – సెప్టెంబరు కావలికోట సంచిక చివరి పేజీలోని మొదటి ప్రశ్న చూపించండి.] మీ అభిప్రాయం ఏమిటి?” వాళ్లేమి చెప్తారో వినండి. “ఈ విషయం గురించిన లేఖనాధారిత సమాచారాన్ని మీకు చూపించవచ్చా?” అని అడగండి. గృహస్థుడు ఒప్పుకుంటే ఆ ప్రశ్న కిందున్న సమాచారాన్ని, అక్కడున్న లేఖనాల్లో కనీసం ఒకదాన్ని చర్చించండి. పత్రిక ఇచ్చి, తర్వాతి ప్రశ్నను చర్చించడానికి ఏర్పాటు చేసుకోండి.
కావలికోట జూలై – సెప్టెంబరు
“పొగతాగడం వల్ల ప్రతీ సంవత్సరం దాదాపు 60,00,000 మంది చనిపోతున్నారు. ఈ మహమ్మారిని ఆపడానికి ఏమైనా చేయగలమంటారా? [వాళ్లేమి చెప్తారో వినండి.] ఈ విషయంలో దేవుని అభిప్రాయాన్ని తెలుసుకున్న చాలామంది ఆ అలవాటును మానేశారు, లేదా దానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. పొగతాగడం వల్ల ఇతరులకు కలిగే హాని గురించి కొంతమందిని ఆలోచింపజేసిన దేవుని సలహాను మీకు చూపించవచ్చా? [గృహస్థునికి ఆసక్తి ఉంటే, 1 కొరింథీయులు 10:24 చదవండి.] పొగతాగే విషయంలో దేవుని అభిప్రాయాన్ని తెలుసుకోవడం వల్ల ఆ అలవాటునుండి ఎలా బయటపడవచ్చో ఈ పత్రిక వివరిస్తుంది.”