సెప్టెంబరు 5-11 | కీర్తన 119
యెహోవా ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొనుడి
యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవడం అంటే దేవుని నిర్దేశానికి ఇష్టపూర్వకంగా లోబడి ఉండడం. కీర్తనకర్తలా యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి, ఆయన మీద ఆధారపడిన ఎంతోమంది మంచి ఉదాహరణలు మనకు బైబిల్లో ఉన్నాయి.
నిజమైన సంతోషం దేవుని నియమాల ప్రకారం నడిచినప్పుడు వస్తుంది
119:1-8
యెహోవా ఇచ్చిన నిర్దేశాన్ని యెహోషువ పూర్తిగా నమ్మాడు. సంతోషంగా ఉండడానికి, విజయం సాధించడానికి పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మాలని ఆయనకు తెలుసు
జీవితంలో కష్టాలను తట్టుకోవడానికి కావాల్సిన ధైర్యాన్ని దేవుని వాక్యం ఇస్తుంది
119:33-40
యిర్మీయా కష్టమైన పరిస్థితుల్లో కూడా ధైర్యం చూపించాడు, యెహోవా మీద ఆధారపడ్డాడు. సాధారణ జీవితాన్ని జీవిస్తూ ఆయనకు అప్పగించిన పనిని పట్టుదలగా చేశాడు
దేవుని వాక్యంలో ఉన్న ఖచ్చితమైన జ్ఞానం పరిచర్య చేయడానికి మనకు ధైర్యం ఇస్తుంది
119:41-48
దేవుని సందేశాన్ని పౌలు భయపడకుండా ఎలాంటి వాళ్లకైనా చెప్పాడు. రోమా అధికారియైన ఫేలిక్సుకు ధైర్యంగా సువార్త చెప్పినప్పుడు యెహోవా సహాయం చేస్తాడని పౌలుకు పూర్తి నమ్మకం ఉంది
ఇతరులకు సువార్త చెప్తున్నప్పుడు నేను ఏయే పరిస్థితుల్లో ధైర్యాన్ని చూపించవచ్చు?
స్కూల్
పని చేసే చోట
కుటుంబం
వేరే చోట్ల