మన క్రైస్తవ జీవితం
సృష్టికర్త మీద బలమైన విశ్వాసం పెంచుకోవడానికి మీ పిల్లలకు సహాయం చేయండి
సృష్టి యెహోవాను ఘనపరుస్తుంది. (కీర్త 19:1-4; 139:14) అయితే, దుష్టుడైన సాతాను కింద ఉన్న లోకం జీవం ఎలా ఆరంభమైందో వివరించే సిద్ధాంతాలను ప్రోత్సహిస్తూ దేవుణ్ణి అగౌరవపరుస్తుంది. (రోమా 1:18-25) అలాంటి విషయాలు మీ పిల్లల మనసుల్లో, హృదయాల్లో నాటుకుపోకుండా మీరు ముందే ఎలా జాగ్రత్తలు తీసుకోవచ్చు? యెహోవా నిజంగా ఉన్నాడని, ఆయనకు వాళ్లపై శ్రద్ధ ఉందని చిన్నప్పటి నుండే వాళ్ల విశ్వాసాన్ని పెంచడానికి సహాయం చేయండి. (2 కొరిం 10:4, 5; ఎఫె 6:16) స్కూల్లో నేర్పించే విషయాల గురించి వాళ్ల మనసులో ఉన్న ఆలోచనలను బయటకు తీయడానికి ప్రయత్నించండి. వాళ్ల హృదయాలను చేరుకోవడానికి ఉన్న వివిధ పరికరాలను ఉపయోగించండి.—సామె 20:5; యాకో 1:19.
మీ వయసువాళ్లు ఏమంటున్నారు—దేవుడున్నాడని నమ్మవచ్చా వీడియో చూసి ఈ ప్రశ్నల గురించి ఆలోచించండి:
దేవున్ని నమ్మే విషయంలో ప్రజల్లో ఎక్కువగా ఉన్న అపోహ ఏంటి?
మీ స్కూల్లో ఏమి నేర్పిస్తారు?
యెహోవా ఉన్నాడని మీరు ఎందుకు నమ్ముతున్నారు?
దేవుడు అన్నిటినీ సృష్టించాడని వివరించడానికి మీరు ఇతరులకు ఎలా సహాయం చేస్తారు?