మన క్రైస్తవ జీవితం
ఆప్యాయంగా ఆహ్వానించండి
ఎవరిని? కొత్త వాళ్లను, మన పాత స్నేహితులను అంటే మన మీటింగ్స్‌కు వచ్చిన ఎవరినైనా ఆప్యాయంగా ఆహ్వానించాలి. (రోమా 15:7; హెబ్రీ 13:2) వాళ్లు వేరే దేశం నుండి వచ్చిన మన సహోదరులు అయ్యుండవచ్చు, లేదా నిష్క్రియులుగా ఉండి చాలా కాలం తర్వాత మీటింగ్‌కు మళ్లీ వచ్చిన సహోదరులై ఉండవచ్చు. మీరు వాళ్ల స్థానంలో ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో ఆలోచించండి. ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఆప్యాయంగా పలకరించినప్పుడు ఎంత బాగుంటుంది? (మత్త 7:12) కాబట్టి కింగ్‌డమ్ హాల్లో మీటింగ్‌కి ముందు, తర్వాత ఒకే దగ్గర కూర్చుని ఉండే బదులు అందరినీ పలకరించడానికి ఇంకాస్త ప్రయత్నం ఎందుకు చేయకూడదు? అప్పుడు ప్రశాంతమైన, ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది, యెహోవాకు ఘనత కూడా కలుగుతుంది. (మత్త 5:16) నిజమే ప్రతీ ఒక్కరిని కలిసి పలకరించడం సాధ్యం కాకపోవచ్చు. కానీ, మనం ప్రయత్నించినప్పుడు వచ్చినవాళ్లు ఇబ్బందిపడకుండా కలిసిపోతారు.a
నిజమైన ఆతిథ్యాన్ని, జ్ఞాపకార్థ ఆచరణ లాంటి ప్రత్యేకమైన సమయాల్లోనే కాదు, అన్నీ సమయాల్లో చూపించాలి. కొత్తవాళ్లు మన మధ్య ఉన్న క్రైస్తవ ప్రేమను చూసినప్పుడు, అనుభవించినప్పుడు దేవున్ని స్తుతించేలా మనతో పాటు సత్యారాధన చేసేలా కదిలించబడతారు.—యోహా 13:35.
a బహిష్కరించబడిన వాళ్లు, సహవాసం మానుకున్న వాళ్లు మీటింగ్స్‌కు వచ్చినప్పుడు వాళ్లతో మాట్లాడే విషయంలో బైబిలు సూత్రాల ప్రకారం జాగ్రత్తగా ఉండాలి.—1 కొరిం 5:11; 2 యోహా 10.