కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp20 No. 3 పేజీలు 4-5
  • సృష్టికర్తకు మనమీద ప్రేమ, శ్రద్ధ ఉన్నాయి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సృష్టికర్తకు మనమీద ప్రేమ, శ్రద్ధ ఉన్నాయి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • 1. మన సృష్టికర్త సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు
  • 2. మన సృష్టికర్త వర్షం కురిపిస్తున్నాడు
  • 3. మన సృష్టికర్త ఆహారాన్ని, బట్టల్ని ఇస్తున్నాడు
  • వర్షం—అది చేసే మేలుకు కృతజ్ఞత చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
  • వస్తుసంపదల్ని కాదు రాజ్యాన్ని వెదకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2016
  • మీ సృష్టికర్త—ఆయనెలాంటివాడో తెలుసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1999
  • అన్నిటినీ చేసిన దేవుడు
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
wp20 No. 3 పేజీలు 4-5
కొండల పైన ఉదయిస్తున్న సూర్యుడు.

సృష్టికర్తకు మనమీద ప్రేమ, శ్రద్ధ ఉన్నాయి

1. మన సృష్టికర్త సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు

సూర్యకాంతి లేని భూమిని మీరు ఊహించుకోగలరా? సూర్యుని శక్తితోనే చెట్లు ఆకుల్ని, పువ్వుల్ని, పండ్లను, విత్తనాల్ని ఇస్తున్నాయి. అంతేకాదు, ఆ శక్తితోనే అవి వేర్ల ద్వారా నేలలోని నీటిని పీల్చుకుని ఆకులన్నిటికీ సరఫరా చేస్తున్నాయి, తర్వాత ఆ నీటిని ఆవిరి రూపంలో గాల్లోకి వదులుతున్నాయి.

కొండల మీద గుబురుగా పెరిగిన టీ ఆకుల పంట.

2. మన సృష్టికర్త వర్షం కురిపిస్తున్నాడు

వర్షం మనకు దేవుడిచ్చిన ఒక అద్భుతమైన వరం. దానివల్లే భూమ్మీద పంటలు పండుతున్నాయి. దేవుడు ఆకాశం నుండి వర్షాల్నీ, పుష్కలంగా పంటనిచ్చే రుతువుల్నీ ఇస్తూ ఆహారంతో మనల్ని సంతృప్తిపరుస్తున్నాడు, మన హృదయాల్ని సంతోషంతో నింపుతున్నాడు.

చెట్టు కొమ్మ మీద వాలిన చిన్నపిట్ట, పడిపోతున్న పండును వంగి పట్టుకుంటోంది.

3. మన సృష్టికర్త ఆహారాన్ని, బట్టల్ని ఇస్తున్నాడు

చాలామంది తండ్రులు తమ కుటుంబానికి సరిపడా ఆహారాన్ని, బట్టల్ని సమకూర్చగలమో లేమో అని ఆందోళనపడుతున్నారు. లేఖనాలు ఏం చెప్తున్నాయో పరిశీలించండి: “ఆకాశపక్షుల్ని బాగా గమనించండి; అవి విత్తవు, కోయవు, గోదాముల్లో పోగుచేసుకోవు, అయినా మీ పరలోక తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికన్నా విలువైనవాళ్లు కారా?”—మత్తయి 6:25, 26.

‘గడ్డిపూలు ఎలా పెరుగుతాయో జాగ్రత్తగా గమనించండి; తన పూర్తి వైభవంతో ఉన్న [రాజైన] సొలొమోను కూడా ఈ పూలలో ఒకదానంత అందంగా అలంకరించబడలేదని నేను మీతో చెప్తున్నాను. ఇవాళ ఉండి రేపు పొయ్యిలో వేయబడే గడ్డిమొక్కలనే దేవుడు అలా అలంకరిస్తున్నాడంటే, ఆయన మీకు తప్పకుండా బట్టలు ఇస్తాడు కదా?’—మత్తయి 6:28-30.

మనకు ఆహారాన్నీ బట్టల్నీ ఇవ్వగల దేవుడు, మన మిగతా అవసరాల్ని తీర్చుకోవడానికి కూడా సహాయం చేయగలడు. మనం దేవునికి నచ్చినట్టు జీవిస్తే, ఆహారాన్ని పండించడానికి మనం చేసే కృషిని ఆయన దీవిస్తాడు, లేదా కుటుంబాన్ని పోషించుకోవడానికి కావల్సిన ఉద్యోగం దొరికేలా సహాయం చేస్తాడు.—మత్తయి 6:32, 33.

సూర్యుడు, వర్షం, పక్షులు, పువ్వుల గురించి ఆలోచించినప్పుడు దేవున్ని ప్రేమించడానికి మనకు ఎన్నో కారణాలు దొరుకుతాయి. తర్వాతి ఆర్టికల్‌లో, మన సృష్టికర్త తన సందేశాన్ని మనుషులకు ఏ విధంగా తెలియజేశాడో చూస్తాం.

మన సృష్టికర్త “సూర్యుణ్ణి ఉదయింపజేస్తున్నాడు . . . వర్షం కురిపిస్తున్నాడు.”—మత్తయి 5:45

మన సృష్టికర్తకు మనమీద ఎంతో ప్రేమ, శ్రద్ధ ఉన్నాయి. ఒక ప్రేమగల తండ్రిలా, తన కుటుంబమైన మనల్ని ఆయన పోషిస్తున్నాడు. దేవుడు అన్నిటినీ సమృద్ధిగా ఇస్తాడని, “మీరు అడగకముందే మీకేమి అవసరమో” ఆయనకు తెలుసని పవిత్ర లేఖనాలు చెప్తున్నాయి.—మత్తయి 6:8.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి