మన క్రైస్తవ జీవితం
ఇంటింటి పరిచర్యలో తలుపు దగ్గర చూపించాల్సిన మర్యాద
క్రైస్తవులు “ఈ లోకం దృష్టిలో . . . రంగస్థల పాత్రధారుల్లా” ఉన్నారు. (1 కొరిం 4:9) కాబట్టి కొంతమంది ఇంటివాళ్లు మనల్ని కిటికీ నుండి లేదా తలుపు చాటు నుండి చూసినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనం వెళ్లిన ఇంటికి కెమెరాలు, మైక్రోఫోన్లు కూడా ఉండవచ్చు, వాటి ద్వారా ఇంటివాళ్లు మనల్ని చూడొచ్చు, మన మాటల్ని వినొచ్చు, రికార్డు చేయవచ్చు. కాబట్టి మనం వాళ్ల తలుపు దగ్గర ఉన్నప్పుడు మర్యాద, మంచి అలవాట్లు ఎలా చూపించవచ్చో చూద్దాం.—2 కొరిం 6:3.
మీ ప్రవర్తన (ఫిలి 1:27):
ఇంటివాళ్ల ఏకాంతానికి (ప్రైవసీ) గౌరవం ఇచ్చి వాళ్ల ఇంటిలోకి తొంగి చూడకండి. వాళ్ల తలుపు దగ్గర నిలబడినప్పుడు తినకండి, త్రాగకండి లేదా ఫోన్లు చేయకండి, మెసేజ్లు పంపించకండి
మీ మాటలు (ఎఫె 4:29):
గడప దగ్గర ఉన్నప్పుడు, ఇంటివాళ్లకు ఇబ్బంది కలిగించే విషయాలు లేదా వాళ్లు వినకూడని విషయాలు మాట్లాడకండి. కొంతమంది ప్రచారకులు చెప్పాలనుకుంటున్న విషయాన్ని గురించి ఎలా మాట్లాడాలో ఆలోచించుకోవడానికి ప్రక్కన వాళ్లతో మాట్లాడడం ఆపేస్తారు