కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb19 జూన్‌ పేజీ 7
  • వినోదాన్ని తెలివిగా ఎంచుకోండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వినోదాన్ని తెలివిగా ఎంచుకోండి
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
  • ఇలాంటి మరితర సమాచారం
  • యెహోవాను సంతోషపెట్టే వినోదాన్ని ఎంచుకోండి
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • వినోదాన్ని ఎలా ఎంచుకోవాలి?
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • మంచి వినోదాన్ని ఎలా ఎంచుకోవచ్చు?
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • ఆరోగ్యకరమైన వినోదాన్ని మీరు కనుగొనవచ్చు
    తేజరిల్లు!—1997
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2019
mwb19 జూన్‌ పేజీ 7

మన క్రైస్తవ జీవితం

వినోదాన్ని తెలివిగా ఎంచుకోండి

మనం వినోదాన్ని ఎందుకు జాగ్రత్తగా ఎంచుకోవాలి? ఎందుకంటే, మనం ఒక సినిమాని గానీ, పాటని గానీ, వెబ్‌సైట్‌ని గానీ, పుస్తకాన్ని గానీ, వీడియో గేమ్‌ని గానీ ఎంచుకుంటున్నామంటే, మన మనసును దేనితో నింపుకోవాలో ఎంచుకుంటున్నామని అర్థం. మన ఎంపికలు మన ప్రవర్తన మీద ప్రభావం చూపిస్తాయి. విచారకరంగా, నేడు అందుబాటులోవున్న వినోదంలో యెహోవా తప్పు అని చెప్పే విషయాలే ఎక్కువగా ఉన్నాయి. (కీర్త 11:5; గల 5:19-21) అందుకే బైబిలు, యెహోవాను ఘనపర్చే విషయాల గురించి ఆలోచిస్తూ ఉండమని మనల్ని ప్రోత్సహిస్తుంది.—ఫిలి 4:8.

నేను ఎలాంటి వినోదాన్ని ఎంచుకోవాలి? అనే వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:

రోములోని గ్లాడియేటర్‌ గేమ్‌
  • ప్రాచీన రోములోని గ్లాడియేటర్‌ గేమ్‌లు ఏ రకంగా ఈ రోజుల్లోని వినోదంలా ఉన్నాయి?

  • యౌవనులు వినోదాన్ని తెలివిగా ఎంచుకోవడానికి సంఘంలోని వాళ్లు ఎలా సహాయం చేయవచ్చు?

  • వినోదాన్ని ఎంచుకునే విషయంలో రోమీయులు 12:9 ఎలా సహాయం చేస్తుంది?

  • మీ ప్రాంతంలో ఆరోగ్యకరమైన ఎలాంటి వినోదాలు అందుబాటులో ఉన్నాయి?

రెండు రకాల వినోదాలు

ఈ రోజుల్లో ఎక్కువమంది ఆస్వాదించే వినోదం, ఇతరులు చేస్తున్న దాన్ని చూసి ఆనందించేలా ఉంటోంది తప్ప మనమే ఏదోకటి చేసేలా ఉండట్లేదు. సినిమాలు, పుస్తకాలు, టీవీ కార్యక్రమాలు మీ ఐడియాలను కాకుండా వేరేవాళ్ల ఐడియాలను చూపిస్తాయి. అలాంటి వినోదం తప్పు కాకపోయినా, దానికన్నా మీరే ఏదో ఒకటి చేయగలిగితే ఇంకా ప్రయోజనం ఉంటుంది. ఉదాహరణకు, సంగీత వాయిద్యం ప్లే చేయడం లేదా బొమ్మలు వేయడం కొంతమందికి ఇష్టం. ఇంకొంతమందికి బయటికి వెళ్లి ఆటలు ఆడడం, సరదాగా నడవడం, పిక్నిక్‌కి వెళ్లడం లాంటివి నచ్చుతాయి. మనం ఏ వినోదాన్ని ఎంచుకున్నా, “అన్నీ దేవునికి మహిమ తీసుకొచ్చేలా” చూసుకుందాం.—1 కొరిం 10:31.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి