మన క్రైస్తవ జీవితం
ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం పుస్తకం నుండి మీరు ప్రయోజనం పొందుతున్నారా?
యెహోవాకు దగ్గరవ్వడానికి మీరు రోజూ చేసే ఎన్నో పనులతోపాటు ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం పుస్తకంలో ఉన్న లేఖనాన్ని, దాని వ్యాఖ్యానాన్ని కూడా చదువుతున్నారా? మీకు ఆ అలవాటు లేకపోతే, ఇకనుంచి అలా చేయగలరా? చాలామంది దినవచనాన్ని ఉదయాన్నే చదువుతారు. అలా చేయడం ద్వారా రోజంతా పనులు చేసుకుంటున్నప్పుడు దాని గురించి ఆలోచిస్తారు. (యెహో 1:8; కీర్త 119:97) దినవచనం నుండి ఇంకా ఎక్కువ ప్రయోజనం పొందాలంటే ఏం చేయవచ్చు? ఆ లేఖన సందర్భం తెలుసుకోవడానికి దాని పైన, కింద ఉన్న వచనాల్ని చదవండి. ఆ లేఖనంలో ఉన్న సూత్రాన్ని నొక్కిచెప్పే ఏదైనా బైబిలు వృత్తాంతం గురించి ఆలోచించండి. తర్వాత, ఆ సూత్రాన్ని మీ జీవితంలో పాటించండి. దేవుని వాక్యంపై ఆధారపడి నిర్ణయాలు తీసుకున్నప్పుడు బైబిలు మీ జీవితాన్ని నిర్దేశిస్తుంది, అంతేకాదు మీకు ఎన్నో ప్రయోజనాల్ని తెస్తుంది.—కీర్త 119:105.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెతెల్ కుటుంబాలు ఉదయాన్నే తమ పని మొదలుపెట్టకముందు ప్రతీరోజు లేఖనాలను పరిశోధిద్దాం పుస్తకంలో ఉన్న దినవచనాన్ని చర్చిస్తాయి. బెతెల్‌లో జరిగిన అలాంటి ఎన్నో చర్చల్ని JW బ్రాడ్‌కాస్టింగ్‌లో ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ అనే సెక్షన్లో పెడుతున్నారు. మీరు ఈమధ్యకాలంలో వాటిలో ఏవైనా చూశారా? బహుశా వాటిలో మీకు సరిగ్గా అవసరమైన సమాచారం దొరకవచ్చు. ఉదాహరణకు, మీరు నిర్ణయాలు తీసుకునేటప్పుడు లోతు వృత్తాంతం ఎలా సహాయం చేయవచ్చు?
లోకాన్ని ప్రేమించకండి (1యో 2:15) అనే వీడియో చూసి ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
ఉదయకాల ఆరాధనలో ఇచ్చిన ప్రసంగాన్ని ఏ బైబిలు సూత్రం ఆధారంగా చెప్పారు?
లోకాన్ని, దానిలో ఉన్నవాటిని ప్రేమిస్తే ఎలాంటి ప్రమాదం వస్తుందని లోతు వృత్తాంతం చూపిస్తుంది?—ఆది 13:12; 14:12; 19:3, 12, 13, 24-26.
మనం యెహోవాను ప్రేమిస్తున్నామని, లోకాన్ని దానిలో ఉన్నవాటిని ప్రేమించడం లేదని ఎలా చూపిస్తాం?
నేను యెహోవా వాక్యాన్ని విలువైనదిగా ఎంచుతున్నానని రోజంతా ఎలా చూపించగలను?