మన క్రైస్తవ జీవితం
విషయాల్ని అన్ని వైపుల నుండి చూడడానికి ప్రయత్నించండి
బైబిలు వృత్తాంతాల్ని చదువుతున్నప్పుడు, విషయాల్ని అన్ని వైపుల నుండి చూడడానికి ప్రయత్నించండి. సందర్భం ఏంటో, వ్యక్తులు ఎవరో, వాళ్లు చేసిన పనులకు కారణాలు ఏమై ఉండవచ్చో తెలుసుకోండి. మీ ఊహాశక్తికి పదునుపెట్టి ఆ దృశ్యాల్ని చూడండి, శబ్దాల్ని వినండి, వాసనల్ని పీల్చుకోండి, ఆ వ్యక్తుల భావోద్వేగాల్ని అనుభూతి చెందండి.
బైబిల్ని మరింత అర్థవంతంగా చదవండి—చిన్న భాగం వీడియో చూసి, ఈ ప్రశ్నలకు జవాబు చెప్పండి:
యోసేపు అన్నలు అతన్ని ద్వేషించడానికి కారణాలు ఏమై ఉండవచ్చు?
యోసేపు అన్నలు కోపంగా, అనాలోచితంగా ప్రవర్తించడానికి కారణాలు ఏమై ఉండవచ్చు?
యోసేపు తండ్రి అయిన యాకోబు గురించి బైబిల్లో ఏం తెలుసుకోవచ్చు?
గొడవల్ని పరిష్కరించుకునే విషయంలో యాకోబు తన కొడుకులకు ఏ చక్కని పాఠం నేర్పించాడు?
ఈ వీడియో చూడడం వల్ల మీరెలా ప్రయోజనం పొందారు?