మన క్రైస్తవ జీవితం
ఇలా మాట్లాడవచ్చు భాగంలో ఉన్న సమాచారాన్ని ఎలా ఉపయోగించాలి?
2018, జనవరి నుండి మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్ వర్క్‌బుక్ మొదటి పేజీలో “ఇలా మాట్లాడవచ్చు” అనే భాగం వస్తోంది. అందులోని సమాచారాన్ని ఎలా ఉపయోగించవచ్చు?
విద్యార్థి నియామకాలు చేస్తున్నప్పుడు: “ఇలా మాట్లాడవచ్చు” భాగంలో ఇచ్చిన ప్రశ్న, లేఖనం, రిటన్ విజిట్ కోసం ప్రశ్న మాత్రమే మీరు ఉపయోగించాలి. దానర్థం, “ఇలా మాట్లాడవచ్చు” వీడియోల్లో ఉన్న పదాల్నే మక్కికిమక్కి ఉపయోగించాలని కాదు. మీరు సన్నివేశం, ఉపోద్ఘాతం, తర్కించే విధానం వంటివాటిని మార్చుకోవచ్చు. అంతేకాదు, మీటింగ్ వర్క్‌బుక్‌లో సూచించకపోయినా బోధనా పనిముట్లలోని ఒక ప్రచురణను ఇవ్వవచ్చు.
పరిచర్య చేస్తున్నప్పుడు: “ఇలా మాట్లాడవచ్చు” భాగంలో ఉన్న సమాచారం, మనం ఎలా మాట్లాడితే బాగుంటుందో ఆలోచించుకోవడానికి సహాయం చేస్తుంది. మీరు కావాలనుకుంటే, ఇంటివ్యక్తి ఆసక్తిని బట్టి రిటన్ విజిట్ కింద ఉన్న సమాచారాన్ని కూడా మొదటిసారి కలిసినప్పుడే మాట్లాడవచ్చు. అంతేకాదు “ఇలా మాట్లాడవచ్చు” భాగంలో ఉన్న సమాచారాన్ని కొంచెం మార్చవచ్చు, లేదా మొత్తం మార్చి వేరేదాన్ని కూడా ఉపయోగించవచ్చు. గత నెలలో చెప్పిన అంశం గానీ, వేరే లేఖనం గానీ మీ ప్రాంతంలోని ప్రజలకు ఎక్కువ నచ్చుతుందని అనిపిస్తుందా? ఈమధ్య కాలంలో వచ్చిన ఒక వార్త లేదా స్థానికంగా జరుగుతున్న ఒక సంఘటన వాళ్లకు ఆసక్తికరంగా ఉంటుందని మీకనిపిస్తుందా? అలాగైతే వాటిని ఉపయోగించవచ్చు. “ఇలా మాట్లాడవచ్చు” భాగంలో ఉన్న సమాచారాన్ని మీరు ఎలా ఉపయోగించాలనుకున్నా, మంచివార్తను ఇతరులతో పంచుకుంటూ దాని కోసం అన్నీ చేయాలన్నదే మీ లక్ష్యమై ఉండాలి.—1కొ 9:22, 23.