కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp21 No. 1 పేజీలు 10-13
  • దేవుడు మీ ప్రార్థనలు వినాలంటే ఏమి చేయాలి?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు మీ ప్రార్థనలు వినాలంటే ఏమి చేయాలి?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • యేసు పేరున యెహోవాకు ప్రార్థించండి
  • హృదయం నుండి మాట్లాడండి
  • దేవుని ఇష్టానికి తగ్గట్టుగా ప్రార్థించండి
  • వేటికోసం ప్రార్థించవచ్చు?
  • ఓపిక చూపించండి, ప్రార్థన చేస్తూ ఉండండి
  • దేవునికి దగ్గరవ్వడానికి ప్రార్థన సహాయం చేస్తుంది
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • ప్రార్థన అనే వరం
    బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • ప్రార్థనలో దేవునికి చేరువ కావడం
    దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?
  • ప్రార్థనలో దేవునికి సన్నిహితమవండి
    బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది?
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
wp21 No. 1 పేజీలు 10-13

దేవుడు మీ ప్రార్థనలు వినాలంటే ఏమి చేయాలి?

యెహోవా “ప్రార్థనలు వినే” దేవుడు. (కీర్తన 65:2) మనం ఎప్పుడైనా, ఎక్కడైనా, గట్టిగా అయినా లేదా మనసులో అయినా ఆయనకు ప్రార్థించవచ్చు. యెహోవాను మనం “తండ్రి” అని పిలవాలని స్వయంగా ఆయనే కోరుకుంటున్నాడు. నిజంగా ఆయన మనకు ఒక మంచి తండ్రి, ఆయన లాంటి వాళ్లు ఇంకెవ్వరూ లేరు. (మత్తయి 6:9) అలాగే, సరైన విధంగా ఎలా ప్రార్థించాలో యెహోవా మనకు ప్రేమతో నేర్పిస్తున్నాడు.

యేసు పేరున యెహోవాకు ప్రార్థించండి

“మీరు నా పేరున తండ్రిని ఏది అడిగినా ఆయన దాన్ని మీకు ఇస్తాడు.”—యోహాను 16:23.

యేసు మాటల్నిబట్టి మనకు ఒక విషయం స్పష్టమౌతుంది, అదేంటంటే యేసు పేరున మాత్రమే తనకు ప్రార్థించాలని యెహోవా దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి విగ్రహాలు, సెయింట్‌లు, దేవదూతలు లేదా చనిపోయినవాళ్ల ద్వారా ప్రార్థిస్తే దేవుడు వినడని అర్థమౌతుంది. మనం యేసు పేరున దేవునికి ప్రార్థించినప్పుడు యేసుకున్న ముఖ్యమైన పాత్రను గుర్తిస్తున్నామని చూపిస్తాం. అందుకే, “నా ద్వారానే తప్ప ఎవరూ తండ్రి దగ్గరికి రాలేరు” అని యేసు చెప్పాడు.—యోహాను 14:6.

హృదయం నుండి మాట్లాడండి

“ఆయన ముందు మీ హృదయాలు కుమ్మరించండి.”—కీర్తన 62:8.

మనం ప్రార్థించేటప్పుడు ఒక ప్రేమగల తండ్రితో మాట్లాడుతున్నట్లుగా యెహోవాతో మాట్లాడాలి. మనం కంఠస్థం చేసి ప్రార్థన చేయకూడదు లేదా పుస్తకంలో ఉన్నది చదువుతూ ప్రార్థించకూడదు. దానికి బదులు, గౌరవపూర్వకంగా హృదయం నుండి మాట్లాడాలి.

దేవుని ఇష్టానికి తగ్గట్టుగా ప్రార్థించండి

“మనం ఆయన ఇష్టానికి తగ్గట్టు ఏది అడిగినా ఆయన మన మనవి వింటాడు.”—1 యోహాను 5:14.

బైబిల్లో, యెహోవా దేవుడు మనకు ఏం చేస్తానని చెప్తున్నాడో ఉంది, అలాగే ఆయన కోసం మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడో కూడా ఉంది. కాబట్టి, దేవుడు మన ప్రార్థనల్ని అంగీకరించాలంటే “ఆయన ఇష్టానికి తగ్గట్టుగా” ప్రార్థించాలి. దానికోసం మనం బైబిల్ని అధ్యయనం చేయాలి, అప్పుడు ఆయన్ని బాగా తెలుసుకుంటాం. అలా చేస్తే మన ప్రార్థనలు ఆయనకు ఇష్టమైన విధంగా ఉంటాయి.

వేటికోసం ప్రార్థించవచ్చు?

భోజనం చేసే ముందు ఒక కుటుంబం కలిసి ప్రార్థించుకుంటున్నారు.

మీ అవసరాల కోసం ప్రార్థించండి. మన రోజువారీ అవసరాల కోసం అంటే ఆహారం, బట్టలు, ఉండడానికి ఇళ్లు వంటివాటి కోసం ప్రార్థించవచ్చు. సరైన నిర్ణయాలు తీసుకోవడానికి తెలివి కోసం, మన కష్టాలను సహించడానికి బలం కోసం కూడా ప్రార్థించవచ్చు. విశ్వాసాన్ని ఇవ్వమని, క్షమించమని అలాగే సహాయం చేయమని ప్రార్థించవచ్చు.—లూకా 11:3, 4, 13; యాకోబు 1:5, 17.

హాస్పిటల్‌ బెడ్‌ మీదున్న తన భార్య కోసం ప్రార్థిస్తున్న ఒక భర్త.

ఇతరుల కోసం ప్రార్థించండి. ప్రేమగల తల్లిదండ్రులు తమ పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకోవడం చూసినప్పుడు సంతోషిస్తారు. యెహోవా కూడా భూమ్మీద ఉన్న తన పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకోవాలని కోరుకుంటున్నాడు. “ఒకరి కోసం ఒకరు ప్రార్థించండి” అని శిష్యుడైన యాకోబు రాశాడు. (యాకోబు 5:16) కాబట్టి మన వివాహజత, పిల్లలు, బంధువులు, స్నేహితుల కోసం ప్రార్థించవచ్చు.

సూర్యాస్తమయం సమయంలో పొలం మధ్యలో నడుస్తున్న ఒక వ్యక్తి.

కృతజ్ఞతలు చెప్పండి. మన సృష్టికర్త మనకోసం చేసినవాటి గురించి బైబిలు ఇలా చెప్తుంది: “ఆయన ఆకాశం నుండి వర్షాల్నీ పుష్కలంగా పంటనిచ్చే రుతువుల్నీ ఇస్తూ, ఆహారంతో మిమ్మల్ని సంతృప్తిపరుస్తూ, మీ హృదయాల్ని సంతోషంతో నింపుతూ వచ్చాడు.” (అపొస్తలుల కార్యాలు 14:17) దేవుడు మన కోసం చేసినవాటన్నిటి గురించి ఆలోచించినప్పుడు ప్రార్థన ద్వారా ఆయనకు కృతజ్ఞతలు చెప్పడానికి కదిలించబడతాం. అంతేకాదు, దేవునికి లోబడడం ద్వారా కూడా మన కృతజ్ఞతను చూపించవచ్చు.—కొలొస్సయులు 3:15.

ఓపిక చూపించండి, ప్రార్థన చేస్తూ ఉండండి

కొన్నిసార్లు మనం నిజాయితీగా ప్రార్థించినా వెంటనే సమాధానం రాకపోతే నిరుత్సాహంగా అనిపించవచ్చు. అంటే దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదని దానర్థమా? కానేకాదు! అలాంటి సమయాల్లో కూడా మనం ప్రార్థిస్తూనే ఉండాలని చూపించే కొన్ని అనుభవాల్ని ఇప్పుడు చూద్దాం.

మొదట్లో మనం చూసిన స్టీవ్‌ ఏం చెప్తున్నాడంటే, “ఒకవేళ నేను ప్రార్థన చేస్తూ ఉండకపోయుంటే, అసలు జీవితం మీదే ఆశ కోల్పోయేవాణ్ణి.” ఆయన ఎలా మారాడు? బైబిల్ని అధ్యయనం చేయడం మొదలుపెట్టాక, ప్రార్థించడం చాలా ప్రాముఖ్యమని, అది అస్సలు మానకూడదని నేర్చుకున్నాడు. స్టీవ్‌ ఇంకా ఇలా అంటున్నాడు, “నా స్నేహితుల ద్వారా దేవుడు నాకిచ్చిన ప్రేమపూర్వక మద్దతును బట్టి నేను ఆయనకు ప్రార్థనలో కృతజ్ఞతలు చెప్పాను. నేను అంతకుముందు కంటే ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నాను.”

దేవుడు నా ప్రార్థన వినడానికి నేను అర్హురాల్ని కాదు అని అనుకున్న జెన్ని సంగతేంటి? ఆమె ఇలా అంటుంది, “నేను పనికిరానిదాన్నని అనిపించినప్పుడు, అలా ఎందుకు అనిపిస్తుందో అర్థం చేసుకునేలా సహాయం చేయమని దేవుణ్ణి వేడుకున్నాను.” అలా చేయడం ఆమెకు ఎలా సహాయం చేసింది? ఆమె ఇలా అంటుంది, “దేవునితో మాట్లాడడం వల్ల ఆయన నన్ను చూస్తున్న విధంగా, నన్ను నేను చూసుకోవడం మొదలుపెట్టాను. నా హృదయం నన్ను నిందించినా దేవుడు మాత్రం నన్ను నిందించడం లేదని అర్థం చేసుకోగలిగాను. ఆశ వదులుకోకూడదని కూడా నిర్ణయించుకున్నాను.” ఫలితంగా ఏం జరిగింది? “ప్రార్థన వల్ల నేను యెహోవాను ఒక నిజమైన, ప్రేమగల, శ్రద్ధగల దేవునిగా, తండ్రిగా, స్నేహితునిగా చూడగలిగాను. యెహోవా నాకు ఎప్పుడు తోడుగా ఉంటాడని, ఆయన కోరుకున్న విధంగా నేను జీవించినంతకాలం నాకు సహాయం చేస్తూ ఉంటాడని అర్థం చేసుకున్నాను.”

తన భర్త, కొడుకుతో ఇసబెల్‌.

“మా అబ్బాయి జెరార్డ్‌, అంగవైకల్యంతో ఉన్నా తన జీవితాన్ని ఆనందించడం చూసినప్పుడు, నా ప్రార్థనలకు నిజంగా జవాబు దొరికిందని నాకనిపించింది,” అని ఇసబెల్‌ చెప్పింది

ఇసబెల్‌ అనుభవాన్ని కూడా పరిశీలించండి. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు తన బిడ్డ అంగవైకల్యంతో పుడుతుందని డాక్టర్లు చెప్పారు. ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. కొందరైతే అబార్షన్‌ చేయించుకోమని కూడా సలహా ఇచ్చారు. ఆమె ఇలా అంటోంది, “నా హృదయంలో ఉన్న తీవ్రమైన బాధ వల్ల చనిపోతానేమో అని నాకనిపించింది.” అయితే ఆమె ఏం చేసింది? “సహాయం కోసం నేను దేవునికి పదేపదే ప్రార్థించాను.” కొంతకాలానికి, డాక్టర్లు చెప్పినట్టుగానే అంగవైకల్యంతో ఆమెకు ఒక బాబు పుట్టాడు. దేవుడు తన ప్రార్థనలకు జవాబిచ్చినట్టు ఇసబెల్‌కు అనిపించిందా? అవును, ఖచ్చితంగా అనిపించింది! ఎలా చెప్పవచ్చు? ఇసబెల్‌ ఇలా అంటుంది, “పద్నాలుగేళ్లున్న మా అబ్బాయి జెరార్డ్‌, అంగవైకల్యంతో ఉన్నా తన జీవితాన్ని ఆనందించడం చూసినప్పుడు, నా ప్రార్థనలకు నిజంగా జవాబు దొరికిందని నాకనిపించింది. దేవుడు నాకిచ్చిన వాటన్నిటిలో జెరార్డే పెద్ద బహుమతి.”

అలాంటి హృదయపూర్వక భావాలు కీర్తనకర్త అన్న ఈ మాటల్ని మనకు గుర్తుచేస్తాయి, “యెహోవా, నువ్వు సాత్వికుల ప్రార్థన వింటావు. వాళ్ల హృదయాల్ని బలపర్చి, వాళ్ల మొర శ్రద్ధగా ఆలకిస్తావు.” (కీర్తన 10:17) పట్టుదలగా ప్రార్థిస్తూ ఉండడానికి ఎన్ని మంచి కారణాలు ఉన్నాయో కదా!

బైబిల్లో యేసు చేసిన ఎన్నో ప్రార్థనలు ఉన్నాయి, వాటిలో తన శిష్యులకు నేర్పించిన ప్రార్థన చాలామందికి సుపరిచితమే. ఆ ప్రార్థన నుండి మనమేమి నేర్చుకోవచ్చు?

మనం ఎలా ప్రార్థించాలో యేసు నేర్పించాడు

యేసు కొండ మీద ప్రసంగం ఇస్తుండగా చాలామంది శ్రద్ధగా వింటున్నారు.

తరచు పరలోక ప్రార్థన అని పిలువబడే మాదిరి ప్రార్థనను, కొండమీద ప్రసంగంలో యేసు తన శిష్యులకు నేర్పించాడు. (మత్తయి 6:9-13; లూకా 11:2-4 కూడా చూడండి.) వందల సంవత్సరాలుగా ఆ ప్రార్థన ఎంత ప్రసిద్ధి చెందిందంటే, ప్రజలు అందులోని ప్రతీ పదాన్ని వల్లిస్తూ, కంఠస్థం చేసేశారు. కానీ మనం నిజంగా అలా కంఠస్థం చేయాలనే యేసు ఆ ప్రార్థనను నేర్పించాడా? లేదు. ఎందుకంటే అంతకుముందే ఆ ప్రసంగంలో, ప్రార్థిస్తున్నప్పుడు చెప్పిన మాటలే మళ్లీమళ్లీ చెప్పొద్దని యేసు తన శిష్యులతో అన్నాడు. (మత్తయి 6:7) బదులుగా ఎలా ప్రార్థించాలి, దేని గురించి ప్రార్థించాలి అని యేసు తన అనుచరులకు తెలియజేస్తున్నాడు. ఆ మాదిరి ప్రార్థన నుండి మనమేమి నేర్చుకోవచ్చో ఇప్పుడు చూద్దాం.

“పరలోకంలో ఉన్న మా తండ్రీ”

  • దేవునికి మాత్రమే మనం ప్రార్థించాలి.

“నీ పేరు పవిత్రపర్చబడాలి”

  • యెహోవా అనే దేవుని పేరు ఘనపర్చబడాలి, పవిత్రంగా ఎంచబడాలి.

“నీ రాజ్యం రావాలి”

  • దేవుని రాజ్యం అంటే పరలోకంలో ఉండే ఒక ప్రభుత్వం, దానికి యేసు రాజుగా ఉన్నాడు. అది త్వరలోనే ఈ భూమంతటిని పరిపాలిస్తుంది.

“నీ ఇష్టం పరలోకంలోలాగే భూమ్మీద కూడా నెరవేరాలి”

  • మనుష్యులు భూమ్మీద శాంతిభద్రతలతో శాశ్వతకాలం జీవించి ఉండాలన్నదే దేవుని ఇష్టం.

“మాకు ఈ రోజుకు అవసరమైన ఆహారం ఇవ్వు”

  • మనం బ్రతికి ఉండడానికి కావాల్సిన వాటిని యెహోవాయే ఇస్తున్నాడు.

‘మా అప్పులు క్షమించు’

  • మనందరం ఎన్నో తప్పులు చేస్తాం కాబట్టి, మనకు క్షమాపణ అవసరం.

ఈ విషయాలన్నిటిని మనసులో ఉంచుకుంటే మీ వ్యక్తిగత ప్రార్థనలు అర్థవంతంగా ఉంటాయి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి