కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp21 No. 3 పేజీలు 12-14
  • మంచి భవిష్యత్తు పొందే మార్గాన్ని ఎవరు చూపిస్తారు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మంచి భవిష్యత్తు పొందే మార్గాన్ని ఎవరు చూపిస్తారు
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఉత్తమమైన సలహాలు ఎవరు ఇస్తారు?
  • బైబిల్‌ ఏమి చెప్తుంది?
    తేజరిల్లు!—2017
  • దేవుణ్ణి సంతోషపెట్టే సత్య బోధలు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • ఏది తప్పు? ఏది ఒప్పు? బైబిలు—సరైన దారి చూపిస్తుంది
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2024
  • నమ్మదగిన నడిపింపును మీరెక్కడ కనుగొనగలరు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2021
wp21 No. 3 పేజీలు 12-14
ఒకతను బైబిలు చదువుతున్నాడు.

మంచి భవిష్యత్తు పొందే మార్గాన్ని ఎవరు చూపిస్తారు?

ముందు పేజీల్లో తెలుసుకున్నట్టు, మంచి భవిష్యత్తు పొందాలనేది ప్రతీఒక్కరి కోరిక. దానికోసం కొంతమంది అదృష్టాన్ని, తలరాతను నమ్ముతుంటే; ఇంకొంతమంది చదువు మీద, డబ్బు మీద ఆధారపడుతున్నారు. ఇంకొందరు సాటిమనుషులకు మేలు చేస్తే మంచి భవిష్యత్తు దొరుకుతుందని ఆశపడుతున్నారు. కానీ అవేవీ వాళ్లు కోరుకున్న జీవితాన్ని ఇవ్వట్లేదు. వాటిమీద ఆధారపడడం ఎలాంటిదంటే, తప్పు మ్యాప్‌ సహాయంతో ఒక కొత్త ప్రాంతానికి వెళ్లేందుకు ప్రయత్నించడం లాంటిది. మరి మంచి భవిష్యత్తు ఎలా పొందాలో తెలుసుకునే మార్గమే లేదా? ఉంది!

ఉత్తమమైన సలహాలు ఎవరు ఇస్తారు?

మామూలుగా మనం ఏవైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు మనకన్నా పెద్దవాళ్లను, తెలివైనవాళ్లను, అనుభవం ఉన్నవాళ్లను సలహాలు అడుగుతాం. అదేవిధంగా, మంచి భవిష్యత్తు ఎలా పొందాలో తెలుసుకోవడానికి వయసులో, తెలివిలో మనకన్నా చాలా ఉన్నతుడైన వ్యక్తి ఇచ్చే సలహాల మీద ఆధారపడాలి. అలాంటి ఆయన ఇచ్చిన సలహాలన్నీ ఒక గ్రంథంలో ఉన్నాయి. అది సుమారు 3,500 సంవత్సరాల క్రితమే రాయబడింది. ఆ గ్రంథాన్ని “బైబిలు” అని పిలుస్తారు.

బైబిల్లో ఉన్న విషయాల్ని మీరెందుకు నమ్మవచ్చు? ఎందుకంటే దాన్ని ఇచ్చిన ఆయన విశ్వంలోనే అందరికన్నా పెద్దవాడు, తెలివైనవాడు. ఆయనకు ఉన్నంత అనుభవం ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. ఆయన “మహా వృద్ధుడు” “యుగయుగాల నుండి ఉన్నాడు.” (దానియేలు 7:9; కీర్తన 90:2) ‘ఆయనే ఆకాశాన్ని సృష్టించాడు, భూమిని నిర్మించాడు.’ (యెషయా 45:18) తన పేరు యెహోవా అని, స్వయంగా ఆయనే బైబిల్లో తెలియజేశాడు.—కీర్తన 83:18.

ఫలానా దేశంవాళ్లు లేదా ఫలానా భాషవాళ్లు గొప్పవాళ్లని బైబిలు చెప్పట్లేదు. ఎందుకంటే బైబిల్ని రాయించిన యెహోవాయే అన్నిరకాల ప్రజల్ని సృష్టించాడు. బైబిల్లో ఉన్న సలహాలు వెనుకటి కాలంలోని ప్రజలకు ఉపయోగపడ్డాయి, మనకాలంలోని వాళ్లకు కూడా ఉపయోగపడుతున్నాయి. దేశం, భాష అనే తేడా లేకుండా ఆ సలహాలు పాటించిన ప్రతీఒక్కరూ ప్రయోజనం పొందుతున్నారు. ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బైబిలు కొన్ని వేల భాషల్లో ఉంది; పైగా ప్రపంచంలో ఎక్కువమంది ప్రజల దగ్గర ఉంది.a కాబట్టి ఏ ప్రాంతంలో ఉన్నవాళ్లయినా బైబిల్ని చదివి తేలిగ్గా అర్థంచేసుకోవచ్చు, అందులోని సలహాల్ని పాటించి ప్రయోజనం పొందవచ్చు. దీన్నిబట్టి, బైబిలు చెప్తున్న ఈ మాటలు నిజమని స్పష్టమౌతోంది:

“దేవునికి పక్షపాతం లేదు. ప్రతీ జనంలో, తనకు భయపడి సరైనది చేసేవాళ్లను ఆయన అంగీకరిస్తాడు.” —అపొస్తలుల కార్యాలు 10:34, 35.

తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రేమిస్తారు, సరైన దారిలో నడిపిస్తారు. అలాగే మనందరికీ తండ్రి అయిన యెహోవా కూడా మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన రాయించిన బైబిలు ద్వారా మనకు సరైన దారేదో చూపిస్తున్నాడు. (2 తిమోతి 3:16) ఆయనిచ్చే సలహాల్ని మనం నమ్మవచ్చు. ఎందుకంటే యెహోవాయే మనల్ని చేశాడు, మన జీవితం బాగుండాలంటే మనం ఏం చేయాలో ఆయనకే బాగా తెలుసు.

బైబిల్లో ఉన్న సలహాల్ని నమ్మవచ్చా?

చిత్రాలు: 1. సబ్‌వే ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఒకతను తన స్మార్ట్‌ఫోన్‌లో చదువుతున్నాడు. 2. అతని స్మార్ట్‌ఫోన్‌లో బైబిలు కనిపిస్తుంది.

మనకాలంలో పరిస్థితులు ఎలా మారతాయో, మనుషులు ఎలా తయారౌతారో సుమారు 2,000 సంవత్సరాల క్రితమే బైబిలు చెప్పింది. ఇప్పుడు సరిగ్గా అలానే జరుగుతోంది. కాబట్టి భవిష్యత్తు గురించి బైబిలు ఇచ్చే సలహాల్ని మనం ఖచ్చితంగా నమ్మవచ్చు.

పరిస్థితులు

“ఒక దేశం మీద మరో దేశం, ఒక రాజ్యం మీద మరో రాజ్యం దాడిచేస్తాయి. తీవ్రమైన భూకంపాలు వస్తాయి. ఒక ప్రాంతం తర్వాత ఇంకో ప్రాంతంలో ఆహారకొరతలు, పెద్దపెద్ద అంటువ్యాధులు వస్తాయి.”—లూకా 21:10, 11.

మనుషులు

“చివరి రోజుల్లో ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి. ఎందుకంటే ఇలాంటి మనుషులు ఉంటారు: తమను తాము ప్రేమించుకునేవాళ్లు, డబ్బును ప్రేమించేవాళ్లు, గొప్పలు చెప్పుకునేవాళ్లు, గర్విష్ఠులు, దూషించేవాళ్లు, తల్లిదండ్రులకు లోబడనివాళ్లు, కృతజ్ఞత లేనివాళ్లు, విశ్వసనీయంగా ఉండనివాళ్లు, మమకారం లేనివాళ్లు, మొండివాళ్లు, లేనిపోనివి కల్పించి చెప్పేవాళ్లు, ఆత్మనిగ్రహం లేనివాళ్లు, క్రూరులు, మంచిని ప్రేమించనివాళ్లు, నమ్మకద్రోహులు, మూర్ఖులు, గర్వంతో ఉబ్బిపోయేవాళ్లు, దేవుణ్ణి కాకుండా సుఖాల్ని ప్రేమించేవాళ్లు.”—2 తిమోతి 3:1-4.

కొన్నివేల సంవత్సరాల క్రితం బైబిలు చెప్పిన ప్రతీ మాట ఇప్పుడు నిజమౌతోంది. దీన్నిబట్టి మీకేం అర్థమౌతుంది? హాంగ్‌కాంగ్‌లో ఉంటున్న లియూంగ్‌ అనే వ్యక్తి ఏం చెప్తున్నాడో చూడండి: “రాబోయే రోజులు ఎలా ఉంటాయని, ఎలాంటి విషయాలు జరుగుతాయని బైబిలు చెప్పిందో సరిగ్గా అలాగే జరిగింది. మనుషులైతే ఎప్పుడో జరగబోయే విషయాల్ని అంత కర్టెక్‌గా ఊహించలేరు. కాబట్టి బైబిల్ని ఖచ్చితంగా మనుషులందరి కన్నా ఎంతో తెలివైన వ్యక్తే రాయించాడని అర్థమౌతుంది.” లియూంగ్‌ చెప్పింది నిజమని బహుశా మీకు కూడా అనిపిస్తుండవచ్చు.

జరగబోయే వాటిగురించి బైబిలు చెప్పినవన్నీ నిజమయ్యాయి కాబట్టి, బైబిల్లో ఉన్న విషయాల్ని దేవుడే రాయించాడని స్పష్టమౌతోంది. యెహోవా ఇలా చెప్తున్నాడు: “నేనే దేవుణ్ణి, నాలాంటి వాళ్లు ఇంకెవ్వరూ లేరు. మొదటి నుండి నేనే చివరికి ఏమౌతుందో చెప్తున్నాను.” (యెషయా 46:9, 10) కాబట్టి భవిష్యత్తు గురించి బైబిలు చెప్పే విషయాల్ని మీరు ఏ సందేహం లేకుండా నమ్మవచ్చు.

ఇప్పుడు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలంటే . . .

తల్లిదండ్రులు తమ పిల్లల చేతుల్ని పట్టుకుని సంతోషంగా పొలంలో నడుస్తున్నారు.

బైబిల్లో ఉన్న సలహాలు పాటిస్తే మనం సంతోషంగా ఉంటాం, అవి మన మంచి కోసమే రాయబడ్డాయి. ఉదాహరణకు, ఈ సలహాల గురించి ఒకసారి ఆలోచించండి.

డబ్బు-పని గురించి సలహా

“రెండు చేతుల నిండా శ్రమ, గాలి కోసం ప్రయాస ఉండడం కన్నా ఒక చేతి నిండా విశ్రాంతి ఉండడం మేలు.”—ప్రసంగి 4:6.

భార్యాభర్తలకు సలహా

“మీలో ప్రతీ ఒక్కరు తనను తాను ప్రేమించుకున్నట్టు తన భార్యను ప్రేమించాలి; భార్య విషయానికొస్తే, ఆమెకు తన భర్త మీద ప్రగాఢ గౌరవం ఉండాలి.”—ఎఫెసీయులు 5:33.

కలిసిమెలిసి ఉండడం గురించి సలహా

“కోపం మానుకో, ఆగ్రహం విడిచిపెట్టు; కోపం తెచ్చుకొని చెడు చేయాలనుకోకు.”—కీర్తన 37:8.

బైబిలు సలహాలు పాటిస్తే ఇప్పుడు సంతోషంగా ఉండడమే కాదు, భవిష్యత్తులో కూడా సుఖంగా, సంతోషంగా ఉంటాం. త్వరలో పరిస్థితుల్ని సరిదిద్ది మనకు మంచి భవిష్యత్తు ఇస్తానని దేవుడు మాటిచ్చాడు. ఆయన మనకు ఎలాంటి జీవితాన్ని ఇవ్వబోతున్నాడో ఒకసారి చూడండి:

ఏ భయం లేకుండా సంతోషంగా ఉంటాం

“వాళ్లు ఎంతో శాంతిని అనుభవిస్తూ చాలా సంతోషంగా ఉంటారు.”—కీర్తన 37:11.

అందరికి ఇల్లు, ఆహారం ఉంటాయి

“వాళ్లు ఇళ్లు కట్టుకొని వాటిలో నివసిస్తారు, ద్రాక్షతోటలు నాటుకొని వాటి పండ్లు తింటారు.”—యెషయా 65:21.

ఎవ్వరూ అనారోగ్యంతో ఉండరు, చనిపోరు

“మరణం ఇక ఉండదు, దుఃఖం గానీ ఏడ్పు గానీ నొప్పి గానీ ఇక ఉండవు.”—ప్రకటన 21:4.

ఇలాంటి మంచి జీవితం పొందాలంటే మీరు ఏం చేయాలి? తర్వాతి పేజీల్లో తెలుసుకుందాం.

a అనువదించడం, పంచిపెట్టడం విషయంలో బైబిలుకున్న చరిత్ర గురించి తెలుసుకోవడానికి www.pr2711.com/te లో బైబిలు బోధలు అనే సెక్షన్‌లో > చరిత్ర, బైబిలు అనే విభాగం చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి