కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w24 మే పేజీలు 14-19
  • ప్రేమ వల్లే మనం ప్రీచింగ్‌ చేస్తాం!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రేమ వల్లే మనం ప్రీచింగ్‌ చేస్తాం!
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం మంచివార్తను ప్రేమిస్తాం
  • మనం ప్రజల్ని ప్రేమిస్తాం
  • మనం యెహోవాను, ఆయన పేరును ప్రేమిస్తాం
  • అంతం వచ్చే వరకు ప్రీచింగ్‌ ఆపం!
  • భవిష్యత్తులో యెహోవా తీర్పులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ప్రీచింగ్‌లో బోలెడంత సంతోషాన్ని సొంతం చేసుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ప్రీచింగ్‌లో యేసులాంటి ఉత్సాహాన్ని చూపించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
  • మనకు తెలియనివి తెలీదని ఒప్పుకోవాలంటే వినయం కావాలి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
w24 మే పేజీలు 14-19

అధ్యయన ఆర్టికల్‌ 20

పాట 67 ‘వాక్యాన్ని ప్రకటించండి’

ప్రేమ వల్లే మనం ప్రీచింగ్‌ చేస్తాం!

“అన్నిదేశాల్లో ముందుగా మంచివార్త ప్రకటించబడాలి.”—మార్కు 13:10.

ముఖ్యాంశం

మనకు ప్రేముంటే ఉత్సాహంగా, మనస్ఫూర్తిగా ప్రీచింగ్‌ చేస్తాం.

1. 2023 వార్షిక కూటంలో మనం ఏం తెలుసుకున్నాం?

2023 వార్షిక కూటంలో,a మన నమ్మకాల్లో వచ్చిన కొన్ని సవరణల గురించి విన్నప్పుడు మన రోమాలు నిక్కపొడుచుకుని ఉంటాయి. అలాగే ప్రీచింగ్‌ విషయంలో వచ్చిన ప్రకటన కూడా మనకు కొత్త ఉత్తేజాన్ని ఇచ్చి ఉంటుంది. ఉదాహరణకు, మహాబబులోను నాశనమైన తర్వాత కూడా కొంతమంది యెహోవావైపు తిరిగే అవకాశం ఉందని మనం తెలుసుకున్నాం. అంతేకాదు, రాజ్య ప్రచారకులు 2023 నవంబరు నుండి ఇచ్చే క్షేత్రసేవా రిపోర్టులో మార్పులు జరిగాయని తెలుసుకున్నాం. ఈ మార్పుల వల్ల ప్రీచింగ్‌కి ఉన్న ప్రాముఖ్యత ఏమైనా తగ్గిపోయిందా? అత్యవసర భావంతో చేయాల్సిన అవసరం లేదా? కానేకాదు!

2. ఒక్కోరోజు గడిచేకొద్దీ మనం ప్రీచింగ్‌ని ఎందుకు అత్యవసర భావంతో చేయాలి? (మార్కు 13:10)

2 ఒక్కోరోజు గడిచేకొద్దీ మనం ప్రీచింగ్‌ ఇంకా అత్యవసర భావంతో చేయాలి. ఎందుకంటే కాలం వేగంగా పరుగెడుతుంది. ఈ చివరిరోజుల్లో ప్రీచింగ్‌ గురించి యేసు ముందే ఏం చెప్పాడో గుర్తుతెచ్చుకోండి. (మార్కు 13:10 చదవండి.) మత్తయి సువార్తలో “అంతం” రాకముందే భూమంతటా మంచివార్త ప్రకటించబడుతుందని యేసు చెప్పాడు. (మత్త. 24:14) ఇక్కడ అంతం అనే మాట సాతాను చెడ్డ లోకానికి తెర పడడాన్ని సూచిస్తుంది. అది ‘ఏ రోజు, ఏ గంట’ రావాలో యెహోవా ముందే నిర్ణయించాడు. (మత్త. 24:36; 25:13; అపొ. 1:7) కాబట్టి ఒక్కో రోజు గడుస్తుంటే మనం అంతానికి ఒక్కో అడుగు దగ్గరౌతున్నాం! (రోమా. 13:11) అది వచ్చేవరకు మనం ప్రీచింగ్‌ చేస్తూ ఉండాలి.

3. మనం ఎందుకు ప్రీచింగ్‌ చేస్తాం?

3 మనం ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి: అసలు మనం ఎందుకు ప్రీచింగ్‌ చేస్తున్నాం? ఒక్కముక్కలో చెప్పాలంటే ప్రేమ వల్లే! మనం ప్రీచింగ్‌ చేస్తున్నప్పుడు మంచివార్త మీద, ప్రజల మీద, అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవా మీద, ఆయన పేరు మీద ఉన్న ప్రేమను చూపిస్తాం. ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా చూద్దాం.

మనం మంచివార్తను ప్రేమిస్తాం

4. ఏదైనా సంతోషకరమైన వార్త విన్నప్పుడు మనకెలా అనిపిస్తుంది?

4 పిల్లలు పుట్టినప్పుడు లేదా మీకు చాలా అవసరమైన ఒక ఉద్యోగం దొరికినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆనందం పట్టలేక మీ బంధువులకు, మీ స్నేహితులకు ఆ విషయం ఖచ్చితంగా చెప్తారు కదా! అయితే, అన్నిటికన్నా ఎక్కువ సంతోషాన్నిచ్చే వార్త అంటే దేవుని రాజ్యం గురించిన మంచివార్త విన్నప్పుడు మీకు అలాగే అనిపించిందా?

5. బైబిలు నుండి మీరు సత్యం మొదటిసారి విన్నప్పుడు మీకెలా అనిపించింది? (చిత్రాలు కూడా చూడండి.)

5 మీరు మొదటిసారి బైబిలు నుండి సత్యం విన్నప్పుడు ఎలా అనిపించిందో ఒకసారి గుర్తుతెచ్చుకోండి. మీ పరలోక తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని, తన కుటుంబంలో మీరు ఒకరిగా ఉండాలనుకుంటున్నాడని తెలుసుకున్నారు. అంతేకాదు మీ బాధలు-కష్టాలు తీసేస్తానని, చనిపోయిన మీ ప్రియమైనవాళ్లను కొత్తలోకంలో తిరిగి లేపుతానని ఆయన మాటిచ్చాడు. ఇలా చెప్పుకుంటూపోతే ఇంకా చాలా ఉన్నాయి. (మార్కు 10:29, 30; యోహా. 5:28, 29; రోమా. 8:38, 39; ప్రక. 21:3, 4) ఆ సత్యాలన్నీ మీకు పట్టలేనంత ఆనందాన్ని ఇచ్చుంటాయి. (లూకా 24:32) మీరు నేర్చుకున్నవాటిని మీరు ప్రేమించారు కాబట్టే వాటిని వేరేవాళ్లకు చెప్పకుండా ఉండలేకపోయారు.—యిర్మీయా 20:9 తో పోల్చండి.

“ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!” పుస్తకాన్ని ఉపయోగించి ఒకతనికి బైబిలు స్టడీ చేస్తున్న ఒక బ్రదర్‌. చిత్రాలు: అతను నేర్చుకున్న విషయాల్ని వేరేవాళ్లకు చెప్తున్నాడు. 1. తనతోపాటు ఉద్యోగం చేసే వ్యక్తికి. 2. కుటుంబానికి. 3. ఫ్రెండ్‌కి.

మంచివార్త మొట్టమొదటిసారి విన్నప్పుడు దాన్ని వేరేవాళ్లకు చెప్పకుండా ఉండలేకపోయాం! (5వ పేరా చూడండి)


6. ఎర్నెస్ట్‌, రోస్‌ అనుభవం నుండి మీరేం నేర్చుకున్నారు?

6 ఎర్నెస్ట్‌ b అనే బ్రదర్‌ అనుభవాన్ని గమనించండి. అతనికి పదేళ్లు ఉన్నప్పుడు వాళ్ల డాడీ చనిపోయారు. ఎర్నెస్ట్‌ ఇలా అంటున్నాడు: “మా డాడీ పరలోకానికి వెళ్లాడా, అసలు ఆయన్ని మళ్లీ చూస్తానా అని ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. వేరే పిల్లల్ని వాళ్ల డాడీలతో చూస్తుంటే నేను తట్టుకోలేకపోయేవాణ్ణి.” అతను వాళ్ల డాడీ సమాధి దగ్గరికెళ్లి మోకాళ్ల మీద కూర్చుని, “దేవుడా ప్లీజ్‌ మా డాడీ ఎక్కడున్నాడో చెప్పు” అని ప్రార్థించేవాడు. వాళ్ల డాడీ చనిపోయిన 17 ఏళ్ల తర్వాత ఒకరోజు అతన్ని యెహోవాసాక్షులు కలిశారు. అతను వెంటనే బైబిలు స్టడీకి ఒప్పుకున్నాడు. చనిపోయినవాళ్లకు ఏమీ తెలీదని, వాళ్లు గాఢనిద్రలో ఉన్నారని, త్వరలోనే వాళ్లు తిరిగి బ్రతుకుతారని బైబిలు నుండి తెలుసుకున్నప్పుడు అతను ఆశ్చర్యపోయాడు. (ప్రసం. 9:5, 10; అపొ. 24:15) చివరికి ఎన్నో ఏళ్లుగా అతను సతమతమౌతున్న ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరికాయి! అతను ఆనందం పట్టలేకపోయాడు. తర్వాత అతని భార్య రోస్‌ కూడా తనతోపాటు బైబిలు స్టడీ తీసుకుంది, నేర్చుకున్న విషయాలు ఆమెకు కూడా బాగా నచ్చాయి. వాళ్లిద్దరూ 1978 లో బాప్తిస్మం తీసుకున్నారు. వాళ్లు నేర్చుకున్న విలువైన సత్యాల్ని వెంటనే కుటుంబ సభ్యులకు, ఫ్రెండ్స్‌కి అలాగే ఇరుగుపొరుగు వాళ్లకు చెప్పడం మొదలుపెట్టారు. దానివల్ల 70 కన్నా ఎక్కువమంది బాప్తిస్మం తీసుకునేలా వాళ్లు సహాయం చేశారు.

7. మన హృదయం నిండా బైబిలు సత్యం మీద ప్రేమ ఉంటే ఏం చేస్తాం? (లూకా 6:45)

7 మన హృదయం నిండా బైబిలు సత్యం మీద ప్రేముంటే మన నోటికి తాళం వేయలేం. (లూకా 6:45 చదవండి.) మనకు కూడా మొదటి శతాబ్దంలోని యేసు శిష్యులకు అనిపించినట్టే ఇలా అనిపిస్తుంది: “మేమైతే చూసినవాటి గురించి, విన్నవాటి గురించి మాట్లాడకుండా ఉండలేం.” (అపొ. 4:20) మనం సత్యాన్ని చాలా ప్రేమిస్తాం కాబట్టి వీలైనంత ఎక్కువమందికి దాన్ని చెప్పాలనుకుంటాం.

మనం ప్రజల్ని ప్రేమిస్తాం

8. మనం ఇతరులకు మంచివార్త ఎందుకు చెప్తాం? (“ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం” అనే బాక్స్‌ చూడండి.) (చిత్రం కూడా చూడండి.)

8 యెహోవాలా, యేసులా మనం కూడా ప్రజల్ని ప్రేమిస్తాం. (సామె. 8:31; యోహా. 3:16) ‘దేవుడు తెలియనివాళ్లను,’ “ఏ నిరీక్షణా” లేనివాళ్లను చూసినప్పుడు మన కడుపు తరుక్కుపోతోంది. (ఎఫె. 2:12) వాళ్లు తమ జీవిత చింతల్లో మునిగిపోతున్నారు. వాళ్లను పైకి లాగే తాడు మన దగ్గర ఉంది, అదే దేవుని రాజ్యం గురించిన మంచివార్త! మనకు వాళ్లమీద ప్రేమ, కనికరం ఉంది కాబట్టి వాళ్లకు మంచివార్త చెప్పడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తాం. అదే వాళ్లలో ఆశను చిగురిస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ల జీవితాల్లో సంతోషాన్ని నింపుతుంది. భవిష్యత్తులో “వాస్తవమైన జీవితం” అంటే కొత్తలోకంలో శాశ్వత జీవితాన్ని పొందే అవకాశాన్నిస్తుంది.—1 తిమో. 6:19.

కాఫీ షాప్‌లో ఒకావిడకు కరపత్రం ఇచ్చి మాట్లాడుతున్న ఒక సిస్టర్‌.

ప్రజల మీద ప్రేమ, కనికరం ఉంటే వాళ్లకు మంచివార్త చెప్పే ఏ అవకాశాన్ని వదలుకోం! (8వ పేరా చూడండి)


ప్రజల్ని ప్రేమిద్దాం—శిష్యుల్ని చేద్దాం

ఈ కొత్త బ్రోషురులో మనం పెంచుకోవాల్సిన 12 లక్షణాలు ఉన్నాయి. ప్రీచింగ్‌లో ప్రేమ చూపించడానికి, శిష్యుల్ని చేయడానికి అవి మనకు సహాయం చేస్తాయి. మనం ప్రీచింగ్‌లో ఏం మాట్లాడాలా అనే దానిమీద కాకుండా ఇతరులు ఏం ఆలోచిస్తున్నారో, వాళ్లకు దేనిమీద ఆసక్తి ఉందో లాంటి విషయాల మీద మనసు పెట్టడానికి ఈ బ్రోషురులో ఉన్న ప్రతీ పాఠం సహాయం చేస్తుంది. ఇలా ప్రశ్నించుకోండి: ‘వాళ్లు దేనిగురించి ఆలోచిస్తున్నారు? వాళ్ల అవసరాలు ఏంటి?’ ఈ బ్రోషుర్‌లోని పరిచయ మాటల్లో ఇలా ఉంది: “వేరే ఏ నైపుణ్యం కన్నా ప్రేమే శిష్యుల్ని చేసే మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి సహాయం చేస్తుంది.”

9. భవిష్యత్తు గురించి మనం ప్రజలకు ఏం చెప్తాం? ఎందుకు? (యెహెజ్కేలు 33:7, 8)

9 మనం ప్రజల్ని ప్రేమిస్తాం కాబట్టి ఈ చెడ్డ లోకానికి టైం దగ్గరపడిందని వాళ్లకు చెప్తాం. (యెహెజ్కేలు 33:7, 8 చదవండి.) మన చుట్టుపక్కల ఉన్నవాళ్లను అలాగే యెహోవాను ఆరాధించని కుటుంబ సభ్యుల్ని చూసినప్పుడు మనకు జాలేస్తుంది. ఎందుకంటే భవిష్యత్తులో “మహాశ్రమ వస్తుంది. లోకం పుట్టిన దగ్గర నుండి ఇప్పటివరకు అలాంటి శ్రమ రాలేదు, మళ్లీ రాదు కూడా” అనే విషయం తెలీక పాపం వాళ్ల పనుల్లో వాళ్లు మునిగిపోతున్నారు. (మత్త. 24:21) తీర్పుతీర్చే సమయంలో ఏం జరుగుతుందో వాళ్లు కూడా తెలుసుకోవాలని మనం కోరుకుంటాం. అబద్ధమతం తుడిచిపెట్టుకుపోతుంది అని, ఆ తర్వాత హార్‌మెగిద్దోన్‌లో ఈ చెడ్డ లోకం నాశనమౌతుంది అని వాళ్లు తెలుసుకోవాలి. (ప్రక. 16:14, 16; 17:16, 17; 19:11, 19, 20) నిజమే వీలైనంతమంది మనం చెప్పేది విని, మనతో కలిసి యెహోవాను ఆరాధించాలని మనం కోరుకుంటాం. కానీ మన కుటుంబ సభ్యులతో సహా మనం చెప్పేది వినని వాళ్లందరి సంగతేంటి?

10. అతి త్వరలో ఏం జరుగుతుందో ప్రజలకు చెప్తూ ఉండడం ఎందుకు ప్రాముఖ్యం?

10 మహాబబులోను నాశనం చూసి మనసు మార్చుకునేవాళ్లను యెహోవా కాపాడే అవకాశం ఉందని ముందటి ఆర్టికల్‌లో చూశాం. ఒకవేళ అదే నిజమైతే, ఇప్పుడే దానిగురించి ప్రజల చెవుల్లో మారుమ్రోగేలా చెప్పడం చాలా ముఖ్యం! ఈ విషయాన్ని మనసులో ఉంచుకోండి: ఇప్పుడు మనం దానిగురించి చెప్తేనే మహాశ్రమ సమయంలో వాళ్లు దాన్ని గుర్తుతెచ్చుకోగలుగుతారు. (యెహెజ్కేలు 33:33 తో పోల్చండి.) బహుశా మనం చెప్పింది గుర్తుతెచ్చుకుని, సమయం మించిపోకముందే వాళ్లు మనతో కలిసి యెహోవాను ఆరాధించే అవకాశం ఉంది. ఒక “పెద్ద భూకంపం” వచ్చిన తర్వాత ఫిలిప్పీలోని చెరసాల అధికారి తన మనసు మార్చుకున్నట్టే, భవిష్యత్తులో మహాబబులోను నాశనాన్ని చూసిన తర్వాత కొంతమంది తమ మనసు మార్చుకునే అవకాశం ఉంది.—అపొ. 16:25-34.

మనం యెహోవాను, ఆయన పేరును ప్రేమిస్తాం

11. యెహోవాకు మహిమను, ఘనతను, శక్తిని ఎలా ఇస్తాం? (ప్రకటన 4:11) (చిత్రాలు కూడా చూడండి.)

11 మనం ప్రీచింగ్‌ చేయడానికి అన్నిటికన్నా ముఖ్యమైన కారణం ఏంటంటే మనం యెహోవాను, ఆయన పవిత్రమైన పేరును ప్రేమిస్తాం. మనం ప్రీచింగ్‌ చేస్తే మన ప్రియమైన దేవున్ని స్తుతించినట్టే! (ప్రకటన 4:11 చదవండి.) తన ఆరాధకుల మహిమ, ఘనత, శక్తిని పొందడానికి యెహోవా అర్హుడని మనం మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాం. యెహోవా ‘అన్నిటినీ సృష్టించాడు’ అని ఒప్పించే రుజువుల్ని ఇతరులకు చెప్పినప్పుడు మనం ఆయనకు మహిమ, ఘనత ఇస్తాం. అలాగే మనం ఈరోజు ప్రాణాలతో ఉన్నామంటే అది ఆయనవల్లే కాబట్టి ఆయనకు రుణపడి ఉన్నాం. అంతేకాదు మన సమయాన్ని, బలాన్ని, మనకు ఉన్నవాటన్నిటినీ ఉపయోగించి ప్రీచింగ్‌లో చేయగలిగినదంతా చేస్తూ ఉంటే యెహోవాకు మన శక్తిని ఇస్తాం. (మత్త. 6:33; లూకా 13:24; కొలొ. 3:23) ఒక ముక్కలో చెప్పాలంటే, మనం ప్రేమించే యెహోవా గురించి వేరేవాళ్లకు చెప్పకుండా ఉండలేం. ఆయన పేరు గురించి, దాని అర్థం గురించి కూడా చెప్పాలనే బలమైన కోరిక మనలో ఉంటుంది. ఎందుకో ఇప్పుడు చూద్దాం.

చిత్రాలు: మంచివార్త చెప్పే మార్గాలు. 1. ఆఫ్రికాలో ఒక జంట ఒకావిడకు, వాళ్ల పిల్లలకు తలుపు దగ్గర నిలబడి మంచివార్త చెప్తున్నారు. 2. బస్టాపులో బస్సు కోసం చూస్తూ పక్కన ఉన్న ఆవిడతో మాట్లాడుతున్న ఒక సిస్టర్‌. 3. సరదాగా సమయం గడపడానికి బీచ్‌కి వెళ్లిన ఒక బ్రదర్‌ తన పక్కన కూర్చున్న వ్యక్తికి మంచివార్త చెప్తున్నాడు.

మన పరిస్థితులు అనుమతించినంత వరకు మంచివార్త చెప్పడానికి మన సమయాన్ని, శక్తిని, వస్తువుల్ని ఉపయోగిస్తే యెహోవాకు మన శక్తిని ఇచ్చినట్టే (11వ పేరా చూడండి)


12. ప్రీచింగ్‌లో యెహోవా పేరును ఎలా పవిత్రపరుస్తాం?

12 మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి ఆయన పేరును పవిత్రపర్చాలని కోరుకుంటాం. (మత్త. 6:9) సాతాను యెహోవా పేరుమీద వేసిన నిందలన్నిటినీ తీసేయాలని కోరుకుంటాం. (ఆది. 3:1-5; యోబు 2:4; యోహా. 8:44) అందుకే మనం ప్రీచింగ్‌లో యెహోవా గురించి నిజాలు చెప్తూ ఆయన పక్షాన ఉంటాం. యెహోవాకున్న గొప్ప లక్షణం ప్రేమ అని, ఆయన పరిపాలన నీతిగా-న్యాయంగా ఉంటుందని, అతి త్వరలోనే ఆయన తన రాజ్యం ద్వారా కష్టాల్ని తీసేసి మనుషులందరికీ శాంతి-సంతోషాల్ని ఇస్తాడని మనం అందరికీ చెప్తాం. (కీర్త. 37:10, 11, 29; 1 యోహా. 4:8) అలా మనం యెహోవా గురించి చెప్పినప్పుడు ఆయన పేరును పవిత్రపరుస్తాం. అంతేకాదు, మన పేరుకు తగ్గట్టుగా జీవిస్తున్నాం అన్న తృప్తి కూడా మనకు ఉంటుంది. అదెలా?

13. యెహోవాసాక్షులుగా పిలవబడడం మనకు దక్కిన గొప్ప గౌరవమని ఎందుకు అనుకుంటాం? (యెషయా 43:10-12)

13 యెహోవా మనల్ని తనకు ‘సాక్షులుగా’ ఎంచుకున్నాడు. (యెషయా 43:10-12 చదవండి.) కొన్నేళ్ల క్రితం వచ్చిన పరిపాలక సభ ఉత్తరంలో ఇలా ఉంది: “యెహోవాసాక్షులుగా పిలవబడడం మనకు దక్కిన గొప్ప గౌరవం.” అలాగని ఎందుకు చెప్పవచ్చు? ఈ ఉదాహరణ గమనించండి. మీ తరఫున కోర్టులో సాక్ష్యం చెప్పడానికి ఎవరైనా కావాలంటే మీరు ఎవరిని ఎంచుకుంటారు? మీకు బాగా తెలిసిన అలాగే మీరు బాగా నమ్మిన వ్యక్తినే కదా. అలాగే అతని మాటలు వేరేవాళ్లు కూడా నమ్మాలి కాబట్టి అతనికి మంచి పేరుందో లేదో కూడా మీరు ఆలోచిస్తారు. యెహోవా మనల్ని తన సాక్షులుగా ఎంచుకున్నాడంటే ఆయనకు మనం బాగా తెలుసు. ఆయనే నిజమైన దేవుడని మనం వేరేవాళ్లకు నిరూపించగలమని ఆయన నమ్ముతున్నాడు. తనకు సాక్షులుగా ఉండడం మనకు దక్కిన గొప్ప గౌరవం కాబట్టి ఆయన పేరు గురించి చెప్పడానికి, ఆయన మీద పడిన నిందలన్నీ తీసేయడానికి మనం ఏ అవకాశాన్ని వదలుకోం! అలా చేస్తూ ఉంటే యెహోవాసాక్షులుగా మన పేరుకు తగ్గట్టు జీవించినట్టే.—కీర్త. 83:18; రోమా. 10:13-15.

అంతం వచ్చే వరకు ప్రీచింగ్‌ ఆపం!

14. భవిష్యత్తులో జరగబోయే వేటిగురించి మనం ఆశతో ఎదురుచూస్తున్నాం?

14 భవిష్యత్తులో జరగబోయే వాటిగురించి మనం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం. మహాశ్రమ మొదలవ్వకముందే యెహోవా ఆశీర్వాదంతో ఇంకా చాలామంది సత్యాన్ని అంగీకరిస్తారని మనం ఆశతో ఉంటాం. అంతేకాదు, మానవ చరిత్రలోనే కారుచీకటి లాంటి మహాశ్రమలో కూడా ఎంతోమంది ప్రజలు కాలంచెల్లే ఈ సాతాను లోకంతో తెగతెంపులు చేసుకుని, యెహోవాను స్తుతిస్తారనే ఆశాకిరణం కనిపిస్తుంది.—అపొ. 13:48.

15-16. మనం ఏం చేస్తూ ఉండాలి? అది కూడా ఎప్పటివరకు?

15 ఈలోపు మనం చేయాల్సిన ముఖ్యమైన పనుంది. ఆ పనిని ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ చేయలేం. అదే దేవుని రాజ్యం గురించిన మంచివార్త ఈ భూమంతటా ప్రకటించడం. దాంతోపాటు, త్వరలో జరగబోయే దానిగురించి ప్రజల చెవుల్లో మారుమ్రోగేలా చెప్తూ ఉండాలి. ఈ దుష్టలోక అంతం చాలా దగ్గర్లో ఉందని ప్రజలు తెలుసుకోవాలి. అలా చేస్తే, మనం చెప్పిన సందేశం యెహోవా నుండే వచ్చిందని వాళ్లు తీర్పు సమయంలో గ్రహిస్తారు.—యెహె. 38:23.

16 మనం ఏమని నిర్ణయించుకోవాలి? మంచివార్త మీద, ప్రజల మీద, అన్నిటికన్నా ముఖ్యంగా యెహోవా మీద, ఆయన పేరు మీద మనకు ప్రేమ ఉంది కాబట్టే ప్రీచింగ్‌ చేస్తూ ఉండాలి. అది కూడా “ఇక చాలు” అని యెహోవా చెప్పే వరకు మనం తపనతో, అత్యవసర భావంతో, ఉత్సాహంతో ప్రీచింగ్‌ చేస్తూ ఉందాం!

ప్రీచింగ్‌ చేయడానికి మనకు ఈ కింది విషయాలు ఎలా సహాయం చేస్తాయి?

  • మంచివార్త మీద ప్రేమ

  • ప్రజల మీద ప్రేమ

  • యెహోవా మీద, ఆయన పేరు మీద ప్రేమ

పాట 54 ఇదే త్రోవ

a 2023, అక్టోబరు 7న ఆమెరికాలోని న్యూయార్క్‌లో ఉన్న న్యూబర్గ్‌ అసెంబ్లీ హాల్‌లో వార్షిక కూటం జరిగింది. తర్వాత ఆ పూర్తి కూటం రెండు భాగాలుగా వచ్చింది. 1వ భాగం నవంబరు, 2023 బ్రాడ్‌కాస్టింగ్‌లో, 2వ భాగం జనవరి, 2024 బ్రాడ్‌కాస్టింగ్‌లో వచ్చింది.

b కావలికోట బ్రోషుర్‌ 2015 లో “బైబిలు జీవితాల్ని మారుస్తుంది—బైబిలు ఇచ్చే స్పష్టమైన, సరైన జవాబులు నాకు నచ్చాయి” అనే ఆర్టికల్‌ చూడండి.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి