కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • ijwhf ఆర్టికల్‌ 4
  • మద్యం గురించి పిల్లలతో మాట్లాడడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మద్యం గురించి పిల్లలతో మాట్లాడడం
  • కుటుంబం కోసం
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరేం తెలుసుకోవాలి?
  • మీరేం చేయవచ్చు?
  • మద్యం సేవించే విషయంలో సమతుల్యమైన దృక్కోణాన్ని కాపాడుకోండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • మద్యం గురించి దేవుని అభిప్రాయం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2023
  • మద్యం గురించి బైబిలు ఏం చెప్తుంది?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • మద్యం విషయంలో సరైన అభిప్రాయంతో ఉండడం
    కావలికోట: మద్యం విషయంలో సరైన అభిప్రాయంతో ఉండడం
మరిన్ని
కుటుంబం కోసం
ijwhf ఆర్టికల్‌ 4
తల్లిదండ్రులు మద్యం తాగుతుంటే గమనిస్తున్న అమ్మాయి

కుటుంబం కోసం

మద్యం గురించి పిల్లలతో మాట్లాడడం

“మా పాపకి ఆరేళ్లున్నప్పుడు మేము మద్యం గురించి మొదటిసారి తనతో మాట్లాడాం. ఆశ్చర్యంగా, మేము అనుకున్నదాని కన్నా మద్యం గురించి తనకు చాలానే తెలుసు.”—అలెగ్సాండర్‌.

  • మీరేం తెలుసుకోవాలి?

  • మీరేం చేయవచ్చు?

  • మద్యం గురించి బైబిలు ఏం చెప్తోంది?

మీరేం తెలుసుకోవాలి?

పిల్లలతో మద్యం గురించి మాట్లాడడం ప్రాముఖ్యం. మీ పిల్లలు టీనేజీకి వచ్చేవరకు ఆగకండి. రష్యాకు చెందిన హామీట్‌ ఇలా అంటున్నాడు: “మద్యం తాగడం గురించి మా అబ్బాయితో చిన్నవయసు నుండే మాట్లాడివుంటే బావుండేది. అలా మాట్లాడకపోవడం ఎంత తప్పో ఆ తర్వాత నాకర్థమైంది. మా అబ్బాయి 13 ఏళ్లకే తాగడానికి అలవాటు పడ్డాడని నాకు తెలిసింది.”

మాట్లాడాల్సిన అవసరం ఎందుకుంది?

  • తోటి విద్యార్థులు, అడ్వర్టైజ్‌మెంట్లు, టీవీ వంటివి మద్యం విషయంలో మీ పిల్లవాడి ఆలోచనపై ప్రభావం చూపించవచ్చు.

  • U.S. సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రకారం, అమెరికాలోని 11 శాతం మద్యాన్ని చిన్నపిల్లలే తాగుతున్నారు.

కాబట్టి మద్యం తాగడం వల్ల వచ్చే ప్రమాదాల గురించి తల్లిదండ్రులు చిన్నవయసు నుండే పిల్లలతో మాట్లాడాలని ఆరోగ్య అధికారులు చెప్పడంలో ఆశ్చర్యం లేదు. మరి పిల్లలతో మద్యం గురించి ఎలా మాట్లాడవచ్చు?

మీరేం చేయవచ్చు?

మీ పిల్లవాడు ఏమేం ప్రశ్నలు అడుగుతాడో ముందే ఊహించండి. చిన్న పిల్లలకు కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది, కాస్త పెద్ద పిల్లలకు ఆ ఆసక్తి ఇంకా ఎక్కువ ఉంటుంది. కాబట్టి, ఎలా జవాబివ్వాలో మీరు ముందుగానే బాగా సిద్ధపడడం మంచిది. ఉదాహరణకు:

  • మద్యం టేస్ట్‌ ఎలా ఉంటుందని మీ పిల్లవాడు అడిగితే, వైన్‌ పులిసిన పండ్ల రసంలా ఉంటుందని, బీర్‌ చేదుగా ఉంటుందని చెప్పవచ్చు.

  • మద్యాన్ని టేస్ట్‌ చేయాలనుందని మీ పిల్లవాడు అంటే, మద్యం చిన్నపిల్లలకు మంచిది కాదని చెప్పవచ్చు. తాగితే ఏం జరగవచ్చో చెప్పండి. మద్యం ఒకవ్యక్తి రిలాక్స్‌ అయ్యేలా చేస్తుంది కానీ, మరీ ఎక్కువ తాగితే కళ్లు తిరుగుతాయని, పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తారని, అనకూడని మాటలు అంటారని, దానివల్ల తర్వాత బాధపడాల్సి వస్తుందని చెప్పండి.​—సామెతలు 23:29-​35.

ముందు మీరు తెలుసుకోండి. బైబిలు ఇలా చెప్తోంది: “వివేకులందరు తెలివి గలిగి పని జరుపుకొందురు.” (సామెతలు 13:16) మద్యం తాగితే ఏమౌతుందనే దాని గురించి, మద్యం విషయంలో మీ దేశంలో ఉన్న చట్టాల గురించి, తాగే విషయంలో ఉన్న చట్టపరమైన హద్దుల గురించి తెలుసుకోండి. అప్పుడు మీ పిల్లవాడితో మాట్లాడడానికి మీరు మరింత సిద్ధంగా ఉంటారు.

మీరే చొరవ తీసుకుని మాట్లాడండి. బ్రిటన్‌లోని మార్క్‌ అనే తండ్రి ఇలా అంటున్నాడు: “మద్యం తాగొచ్చా, లేదా అనే విషయంలో పిల్లలకు సందేహాలు ఉంటాయి. నేను మా ఎనిమిదేళ్ల అబ్బాయిని, మద్యం తాగడం అతనికి తప్పనిపిస్తుందా, సరైనదనిపిస్తుందా అని అడిగాను. నేను ప్రశాంతమైన, స్నేహపూర్వకమైన వాతావరణంలో మాట్లాడాను. దానివల్ల అతను తన అభిప్రాయాల్ని నిర్భయంగా చెప్పాడు.”

మద్యం గురించి మళ్లీమళ్లీ మాట్లాడుతూ ఉంటే మీ పిల్లవాడికి బాగా అర్థమౌతుంది. మీ పిల్లవాడి వయసును బట్టి, మద్యం గురించే కాక రోడ్డు భద్రత, సెక్స్‌ వంటి విషయాల గురించి కూడా మాట్లాడండి.

మీరు ఆదర్శంగా ఉండండి. పిల్లలు స్పాంజీ లాంటివాళ్లు. చుట్టూ జరిగేవాటి నుండి వాళ్లు త్వరగా నేర్చుకుంటారు. పిల్లలపై అన్నిటికన్నా తల్లిదండ్రుల ప్రభావమే ఎక్కువగా ఉంటుందని పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంటే, మీరు స్ట్రెస్‌ తగ్గించుకోవడానికి, రిలాక్స్‌ అవ్వడానికి మద్యమే మందు అన్నట్టుగా ప్రవర్తిస్తే, వాళ్లు కూడా జీవితంలోని ఆందోళనలు తట్టుకోవడానికి మద్యమే మార్గం అనుకుంటారు. కాబట్టి మీరు మంచి ఆదర్శంగా ఉండండి. మద్యం విషయంలో మీరు బాధ్యతగా నడుచుకోవడం చాలా ప్రాముఖ్యమని గుర్తుంచుకోండి.

వెయిటర్‌ మరింత మద్యం పోయమంటారా అని అడిగినప్పుడు, వద్దు అని చెప్తున్న తల్లిని చూస్తున్న అమ్మాయి

మద్యం తాగే విషయంలో మీ పిల్లలు మిమ్మల్నే ఆదర్శంగా తీసుకుంటారు

మద్యం గురించి బైబిలు ఏం చెప్తోంది?

“[యెహోవా] నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును ... పుట్టించుచున్నాడు.” (కీర్తన 104:14, 15) మద్యం చెడ్డదేమీ కాదు, దేవుడిచ్చిన బహుమతి.

“ద్రాక్షారసము వెక్కిరింతల పాలుచేయును. మద్యము అల్లరి పుట్టించును. దాని వశమైనవారందరు జ్ఞానములేనివారు.” (సామెతలు 20:1) మద్యం విషయంలో బాధ్యతగా ప్రవర్తించాలి.

“తాగుబోతులు . . . దేవుని రాజ్యంలో ఉండరు.” (1 కొరింథీయులు 6:​10) దేవుడు మద్యం తాగడాన్ని కాదు, తాగుబోతుతనాన్ని ఖండిస్తున్నాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2025)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి