అధస్సూచి
a “ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును” అన్న పౌలు మాటలను గురించి వ్యాఖ్యానిస్తూ బైబిలు విద్వాంసుడైన గోర్డన్ డి.ఫీ ఇలా వ్రాస్తున్నాడు: “పౌలు వివరించే దైవశాస్త్రంలో అవి [దీర్ఘశాంతము దయ] మానవజాతిపట్ల దైవుడు కలిగివున్న దృక్పథంలోని రెండు పార్శ్వాలను సూచిస్తున్నాయి (రోమా. 2:4 పోల్చండి). ఒకవైపు దేవుని ప్రేమపూర్వకమైన సహనం ఆయన మానవ తిరుగుబాటుపట్ల తన ఉగ్రతను పట్టివుంచడం ద్వారా ప్రదర్శితమౌతుంటే, మరోవైపు ఆయన దయ, వెయ్యి విధాలుగా వ్యక్తమైన ఆయన కరుణలో మనకు కనిపిస్తుంది. అందుకే ప్రేమను గురించిన పౌలు వర్ణన దేవుని గురించిన ద్వికోణ వర్ణనతో ప్రారంభం అవుతుంది. దైవిక ప్రతికూల తీర్పులు పొందవలసివున్న వారిపట్ల తాను సహనం గలవాడినని దయగలవాడినని దేవుడు క్రీస్తు ద్వారా చూపించుకున్నాడు.”