అధస్సూచి
a ఆ మార్గంలోనే ప్రయాణించిన రోమన్ కవి హోరెస్ (సా.శ.పూ. 65-8), ఆ ప్రయాణపు చివరి భాగంలో ఎదురయ్యే ఇబ్బందులపై వ్యాఖ్యానించాడు. అప్పీయా సంతపేట “పడవలు నడిపేవారితో, సత్రాలు నడిపే పిసినిగొట్టు వ్యాపారులచే క్రిక్కిరిసి ఉంటుంది” అని హోరెస్ వర్ణించాడు. “జుగుప్సాకరమైన జోరీగలు, కప్పల” గురించి, “అపరిశుభ్రమైన” నీటి గురించి ఆయన ఫిర్యాదు చేశాడు.