కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మీరు యెహోవాకు స్నేహితులు అవ్వవచ్చు
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
    • 6. యెహోవా తన స్నేహితులకు సహాయం చేస్తాడు

      యెహోవా తన స్నేహితులకు సమస్యల్ని తట్టుకునేలా సహాయం చేస్తాడు. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

      వీడియో: యెహోవా దేవుడు నా కోసం చాలా చేశాడు (3:20)

      • వీడియోలో చూసినట్టు, నిరుత్సాహంలో ఉన్న ఒకామెకు యెహోవా ఎలా సహాయం చేశాడు?

      యెషయా 41:10, 13 చదవండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి:

      • యెహోవా తన స్నేహితులందరికీ ఏమని మాటిస్తున్నాడు?

      • యెహోవా మీకు ఒక మంచి స్నేహితుడిగా ఉండగలడని మీరు అనుకుంటున్నారా? ఎందుకు?

      చిత్రాలు: ప్రాణ స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. 1. ఒకతను పెద్ద బల్లను తీసుకెళ్లడానికి ఇంకొకతనికి సహాయం చేస్తున్నాడు. 2. ఒకామె తన మనసులో ఉన్నదంతా ఇంకొకామెకు చెప్తోంది. 3. ఊత కర్రతో నడుస్తున్న ఒకతనికి ఇంకొకతను సహాయం చేస్తున్నాడు.

      అవసరంలో ఉన్నప్పుడు ప్రాణ స్నేహితుడు సహాయం చేస్తాడు, యెహోవా కూడా అంతే

  • మీరు యెహోవాకు స్నేహితులు అవ్వవచ్చు
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • మీరు ఎలా వేరేవాళ్లకు మంచివార్త చెప్పవచ్చు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
    • 3. యెహోవా మీకు సహాయం చేస్తాడు

      కొంతమందికి ప్రకటించాలని ఉన్నా వేరేవాళ్లు ఏమనుకుంటారో అని, ఎగతాళి చేస్తారేమో అని, కోప్పడతారేమో అని భయపడతారు.

      • నేర్చుకున్న విషయాల్ని వేరేవాళ్లకు చెప్పాలంటే మీకు భయంగా అనిపిస్తుందా? ఎందుకు?

      వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి.

      వీడియో: ధైర్యం కోసం నేను యెహోవాకు ప్రార్థించాను (4:05)

      • వీడియోలో ఉన్న యౌవనులు ఎలా భయాన్ని తీసేసుకున్నారు?

      యెషయా 41:10 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

      • ప్రకటించడానికి మీకు ఎప్పుడైనా భయమేస్తే, ప్రార్థన ఎలా సహాయం చేస్తుంది?

      మీకు తెలుసా?

      మంచివార్త ప్రకటించడం మా వల్ల కాదు అని చాలామంది యెహోవాసాక్షులు ఒకప్పుడు అనుకున్నారు. ఉదాహరణకు, సెర్గీ అనే వ్యక్తికి అంతగా ఆత్మవిశ్వాసం ఉండేది కాదు, వేరేవాళ్లతో మాట్లాడాలంటే ఇబ్బంది పడేవాడు. కానీ, ఆయన బైబిలు స్టడీ తీసుకున్న తర్వాత ఇలా అన్నాడు: “నాకు భయమేసినా, నేను నేర్చుకుంటున్న విషయాల్ని ఇతరులకు చెప్పడం మొదలుపెట్టాను. బైబిలు గురించి వేరేవాళ్లకు చెప్పడం వల్ల నిజానికి నా ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను కొత్తగా నేర్చుకుంటున్న విషయాల మీద కూడా నాకు నమ్మకం పెరిగింది.”

  • బాప్తిస్మం తీసుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
    • 6. యెహోవా సహాయం చేస్తాడనే నమ్మకంతో ఉండండి

      ఒక పెద్ద వయసు ఆవిడకు ఆ యువతి ప్రీచింగ్‌ చేస్తోంది. ఆమెకు స్టడీ ఇచ్చిన సహోదరి పక్కనే ఉంది.

      మీకు సహాయం చేయడానికి యెహోవా సిద్ధంగా ఉంటాడు. వీడియో చూడండి, తర్వాత ఈ ప్రశ్నల్ని చర్చించండి.

      వీడియో: యెహోవా దేవుడు మీకు సహాయం చేస్తాడు (2:50)

      • ఒకతను బాప్తిస్మం తీసుకోవడానికి ఎందుకు వెనకాడాడు?

      • యెహోవా మీద నమ్మకం పెంచుకోవడానికి అతను నేర్చుకున్న ఏ విషయం సహాయం చేసింది?

      యెషయా 41:10, 13 చదవండి, తర్వాత ఈ ప్రశ్నను చర్చించండి:

      • మీ సమర్పణకు తగ్గట్టు జీవించగలరని ఎందుకు నమ్మకంతో ఉండవచ్చు?

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి