కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • మీకు ఓదార్పునిచ్చే ప్రవచనార్థక మాటలు
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి II
    • 24, 25. యెహోవా కోరెషు గురించి మళ్ళీ ఎలా ప్రస్తావించాడు, ఇది మనకు మరే ఇతర ప్రవచనాన్ని గుర్తు చేస్తుంది?

      24 యెహోవా మళ్ళీ కోరెషు గురించి ప్రస్తావిస్తున్నాడు: “ఉత్తరదిక్కునుండి నేనొకని రేపుచున్నాను. నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కునుండి వచ్చుచున్నాడు. ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రొక్కును.” (యెషయా 41:​25)d జనముల దేవుళ్ళకు భిన్నంగా, యెహోవా విషయాలను సాధించగలడు. ఆయన కోరెషును తూర్పు దిక్కు నుండి, “సూర్యోదయ దిక్కునుండి” రప్పించినప్పుడు, దేవుడు తనకున్న ప్రవచించే సామర్థ్యాన్ని, తాను ప్రవచించినదాన్ని నెరవేర్చడానికి భవిష్యత్తును మలచగల సామర్థ్యాన్ని ప్రదర్శిస్తాడు.

      25 ఈ మాటలు, మన కాలంలో చర్య తీసుకోవడానికి రేపబడే రాజుల గురించి అపొస్తలుడైన యోహాను ఇచ్చిన ప్రవచనార్థక వివరణను మనకు గుర్తుచేస్తాయి. “తూర్పునుండి వచ్చు రాజుల” కోసం మార్గం సిద్ధం చేయబడుతుందని మనం ప్రకటన 16:12 లో చదువుతాము. ఈ రాజులు మరెవరో కాదు యెహోవా దేవుడు, యేసు క్రీస్తే. చాలాకాలం క్రితం కోరెషు దేవుని ప్రజలను విడుదల చేసినట్లుగా, అంతకంటే ఎంతో శక్తివంతులైన ఈ రాజులు యెహోవా శత్రువులను నిర్మూలించి, ఆయన ప్రజలు మహాశ్రమల గుండా నీతియుక్తమైన నూతన లోకంలోకి ప్రవేశించేలా వారిని నడిపిస్తారు.​—⁠కీర్తన 2:​8, 9; 2 పేతురు 3:​13; ప్రకటన 7:​14-17.

  • మీకు ఓదార్పునిచ్చే ప్రవచనార్థక మాటలు
    యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి II
    • d కోరెషు స్వదేశం బబులోనుకు తూర్పున ఉన్నప్పటికీ, ఆయన ఆ నగరంపై తుది దాడి చేసినప్పుడు, ఉత్తర దిక్కు నుండి అంటే ఆసియా మైనర్‌ నుండి వచ్చాడు.

తెలుగు ప్రచురణలు (1982-2025)
లాగౌట్‌
లాగిన్‌
  • తెలుగు
  • షేర్ చేయి
  • ఎంపికలు
  • Copyright © 2025 Watch Tower Bible and Tract Society of Pennsylvania
  • వినియోగంపై షరతులు
  • ప్రైవసీ పాలసీ
  • ప్రైవసీ సెటింగ్స్‌
  • JW.ORG
  • లాగిన్‌
షేర్‌ చేయి