-
“నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు”యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
-
-
స్వస్థత
20. దేవుని ప్రజలు ఏ విధమైన స్వస్థతను పొందుతారు, ఎప్పుడు?
20 యెషయా ప్రవచనంలోని ఈ భాగం ఒక హృదయోత్తేజకరమైన వాగ్దానంతో ముగుస్తుంది: “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు. దానిలో నివసించు జనుల దోషము పరిహరింపబడును.” (యెషయా 33:24) యెషయా మాట్లాడుతున్న రుగ్మత ప్రాథమికంగా ఆధ్యాత్మికమైనది, ఎందుకంటే అది పాపంతో లేక “దోషము”తో సంబంధం కలిగి ఉంది. ఈ మాటల తొలి అన్వయింపులో, బబులోను చెరనుండి విడుదల చేయబడిన తర్వాత జనాంగం ఆధ్యాత్మికంగా స్వస్థపరచబడుతుందని యెహోవా వాగ్దానం చేస్తున్నాడు. (యెషయా 35:5, 6; యిర్మీయా 33:6; కీర్తన 103:1-5 పోల్చండి.) తిరిగి వచ్చే యూదులు, తమ గత పాపాల విషయమై క్షమించబడినవారై, యెరూషలేములో స్వచ్ఛారాధనను పునఃస్థాపిస్తారు.
21. యెహోవా ఆరాధకులు నేడు ఏ యే విధాల్లో ఆధ్యాత్మిక స్వస్థతను పొందుతున్నారు?
21 అయితే, యెషయా ప్రవచనానికి ఒక ఆధునిక నెరవేర్పు ఉంది. నేడు యెహోవా ప్రజలు ఆధ్యాత్మిక స్వస్థతను కూడా పొందుతున్నారు. వారు ఆత్మ అమర్త్యత, త్రిత్వం, నరకాగ్ని వంటి అబద్ధ బోధల నుండి విడుదల పొందారు. లైంగిక దురభ్యాసాల నుండి స్వతంత్రులను చేసి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేసే నైతిక నిర్దేశాన్ని వారు పొందుతారు. యేసు క్రీస్తు విమోచన క్రయధనబలి మూలంగా, వారు దేవుని ఎదుట పరిశుభ్రమైన స్థానాన్ని కలిగివుండడమే గాక, మంచి మనస్సాక్షిని కూడా కలిగివుంటారు. (కొలొస్సయులు 1:13, 14; 1 పేతురు 2:24; 1 యోహాను 4:10) ఈ ఆధ్యాత్మిక స్వస్థత మూలంగా శారీరక ప్రయోజనాలు కూడా లభిస్తాయి. ఉదాహరణకు, లైంగిక దుర్నీతికి, పొగాకు ఉత్పాదనలకు దూరంగా ఉండడం, క్రైస్తవులను సుఖరోగాలనుండి, కొన్ని రకాలైన క్యాన్సర్‌ల నుండి కాపాడుతుంది.—1 కొరింథీయులు 6:18; 2 కొరింథీయులు 7:1.
22, 23. (ఎ) యెషయా 33:24 భవిష్యత్తులో మరింత గొప్పగా ఎలా నెరవేరుతుంది? (బి) నేడు సత్యారాధకుల నిశ్చయత ఏమిటి?
22 అంతేగాక, అర్మగిద్దోను తర్వాత దేవుని నూతన లోకంలో యెషయా 33:24 మరింత గొప్పగా నెరవేరుతుంది. మెస్సీయ రాజ్య పరిపాలన క్రింద, మానవులు ఆధ్యాత్మిక స్వస్థతతో పాటు గొప్ప శారీరక స్వస్థతను కూడా పొందుతారు. (ప్రకటన 21:3, 4) సాతాను విధానం నాశనం చేయబడిన వెంటనే, యేసు భూమిపై ఉన్నప్పుడు చేసినటువంటి అద్భుతాలు నిస్సందేహంగా భూగోళవ్యాప్త పరిధిలో జరుగుతాయి. గ్రుడ్డివారు చూస్తారు, చెవిటివారు వింటారు, కుంటివారు నడుస్తారు! (యెషయా 35:5, 6) ఇది, మహా శ్రమలను ప్రాణాలతో తప్పించుకొనే వారందరూ భూమిని పరదైసు పరిస్థితిలోకి తీసుకువచ్చే గొప్ప పనిలో భాగం వహించడాన్ని అనుమతిస్తుంది.
23 ఆ తర్వాత, పునరుత్థానం ప్రారంభమైనప్పుడు, తిరిగి జీవానికి వచ్చేవారు మంచి ఆరోగ్యంతో లేపబడతారన్నదానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే, విమోచన క్రయధన బలి విలువ అత్యధిక పరిధిలో అన్వయించబడుతుండగా, మానవజాతి పరిపూర్ణతకు తీసుకురాబడే వరకు మరిన్ని శారీరకమైన ప్రయోజనాలు చేకూరుతాయి. అప్పుడు, నీతిమంతులు సంపూర్ణ భావంలో, ‘బ్రతుకుతారు.’ (ప్రకటన 20:5, 6) ఆ సమయంలో, ఆధ్యాత్మికంగానూ, శారీరకంగానూ, “నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు.” ఎంత ఉత్తేజకరమైన వాగ్దానం! నేడు సత్యారాధకులందరూ, దాని నెరవేర్పును అనుభవించేవారిలో ఒకరై ఉండేందుకు నిశ్చయించుకుందురు గాక!
-
-
“నాకు దేహములో బాగులేదని అందులో నివసించు వాడెవడును అనడు”యెషయా ప్రవచనం—సర్వమానవాళికి వెలుగు సంపుటి I
-
-
[353 వ పేజీలోని చిత్రాలు]
విమోచన క్రయధన బలి మూలంగా, యెహోవా ప్రజలు ఆయన ఎదుట పరిశుభ్రమైన స్థానాన్ని కలిగివున్నారు
[354 వ పేజీలోని చిత్రాలు]
నూతన లోకంలో, గొప్ప శారీరక స్వస్థత జరుగుతుంది
-